కాపుల‌పై ముద్ర‌గ‌డ ముద్ర ప‌నిచేయ‌లేదా? |Mudragada Padmanabham Impact On Kapu Voters

admin
mudra

The CPI (ML), who was thinking of how the politics will change in the moment when the AP government has no disadvantage from the Kapus, has sung the Andhra Pradesh state after the split of the Andhra Pradesh state.Click on the below video to know more details of Mudragada Padmanabham Impact On Kapu Voters.

ఏపీ ప్ర‌భుత్వానికి ఇప్ప‌టి వ‌ర‌కు కాపుల నుంచి ఎలాంటి ప్ర‌తికూల‌త వ‌స్తుందో ఏ క్ష‌ణంలో రాజ‌కీయం ఎలా మారుతుందో అని భావిస్తూ వ‌చ్చిన టీడీపీకి కాకినాడ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్న కాపులు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని విడ‌గొట్టిన త‌రువాత వారికి మంగ‌ళం పాడారు.

దీంతో వారి ఓటు బ్యాంకును ఖాతాలో వేసుకునేందుకు ఇటు జ‌గ‌న్ పార్టీ అయిన వైసీపీ, అటు టీడీపీ అధినేత చంద్ర‌బాబు చ‌క‌చ‌క పావులు క‌దిపారు. కాపుల‌కు కీల‌క‌మైన నేత‌లు లేక‌పోవ‌డంతో వారిపై వీరి ముద్ర‌వేసుకునేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు. చిరంజీవి లాంటి వ్య‌క్తి ఉన్నా ఆయ‌న‌పై పెద్ద‌గా వారికి న‌మ్మ‌కం లేక‌పోవ‌డం, ప్ర‌జారాజ్యం పార్టీని పెట్టి కాంగ్రెస్ లో క‌లిపేయ‌డంతో ఇక కాపునేత‌ల కంటే ఇత‌ర పార్టీల‌వైపు చూడ‌టం ప్రారంభించారు. దీంతో చంద్ర‌బాబు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తామంటూ చెప్పి వారి ఓటు బ్యాంకును లాగేసుకున్నారు. అయితే ఆయ‌న ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌లేదంటూ కాపు నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ఉద్య‌మం చేప‌ట్టారు. కాపుల‌నంద‌రిని క‌లుపుకొని అధికార పార్టీపై దండెత్తారు. దీంతో ఆయ‌న‌కు కావాల్సిన మ‌ద్ద‌తు వ‌చ్చింది. ప్ర‌తీక్ష‌ణం ప్ర‌భుత్వానికి కునుకు లేకుండా చేశారు.


అయితే ఈ ప‌రిణాలు ఎక్క‌డ ఫ‌లించి వైసీపీకి మేలు జ‌రుగుతుందో అని టీడీపీ నేత‌లు బ‌య‌ప‌డ్డారు. ముద్ర‌గ‌డ వ‌చ్చే 2019 ఎన్నిక‌ల నాటికి వైసీపీకి అనుకూలంగా ఉంటే గంప గుత్తగా ఆ ఓటు జ‌గ‌న్ కు వెళితే జ‌గ‌న్ సీఎం అవ‌డం ఖాయ‌మ‌ని అనుకున్నారు. ఇందులో భాగంగానే కాకినాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌తో కాస్త అనుకూల ప‌రిస్థితి క‌నిపించింది. దీంతో ముద్ర‌గ‌డ మ‌రింత బ‌ల‌ప‌డ‌తారు అని అనుకున్నారు.తాజాగా వెల్ల‌డైన ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో ముద్రగడ పద్మనాభం వ్యవహారం కూడా కాపుజాతిపై ముద్రగడ పట్టు విషయంలో ఓ క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే, గడచిన ఏడాదిన్నరగా కాపులకు రిజర్వేషన్ పేరుతో ముద్రగడ ఆందోళనలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తునిలో రైలు దగ్ధం ఘటన తర్వాత ఆందోళనలు తీవ్రస్ధాయికి చేరుకుంది. అదే సమయంలో ప్రభుత్వం కూడా ఉద్యమాన్ని అంతే స్ధాయిలో అణిచివేస్తోంది.ఇటువంటి సమయంలోనే కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు నగారా మోగింది. దాంతో టిడిపిలో తీవ్ర ఆందోళన మదలైంది. అప్పటికే నంద్యాల ఎన్నికలో టిడిపి-వైసీపీలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. అదేసమయంలో కాపులందరూ నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో టిడిపికి వ్యతిరేకంగా ఓట్లు వేయాలంటూ ముద్రగడ పిలుపినిచ్చారు. దాంతో టిడిపి పరిస్ధితి మరింత దయనీయంగా తయారైంది. ముద్రగడ పిలుపుతో టిడిపి ఇబ్బంది పడింది. అందుకనే ఏవో కారణాలు చెప్పి కాకినాడ ఎన్నికను వాయిదా వేయించేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. సాధ్యం కాకపోవటంతో తప్పని పరిస్ధితిలోనే ఎన్నికకు సిద్దపడింది. ఇంతలో నంద్యాల ఫలితం వచ్చింది. అక్కడ ఊహించని రీతిలో టిడిపి విజయం సాధించింది. ఎందుకంటే, నంద్యాలలో బలిజల ఓట్లు సుమారు 25 వేలున్నాయి. అయినా విజయం సాధించిందంటే బలిజలెవరూ ముద్రగడ మాటను పట్టించుకోలేదని అర్ధమైంది. దాంతో కాకినాడలో కూడా టిడిపి నేతలు రెచ్చిపోయారు.తీరా శుక్రవారం ఫలితాలను చూస్తే ఇక్కడ కూడా కాపులు ముద్రగడ పిలుపును లెక్కచేయలేదనే అర్దమవుతోంది. ఎందుకంటే, ఎన్నికలు జరిగిన 48 డివిజన్లలో టిడిపి 32 చోట్ల గెలిచింది. ఇక్కడ కాపుల ఓట్లు 45 వేలున్నాయ్. కాపులందరూ నిజంగానే ముద్రగడ పిలుపుకు స్పందించి టిడిపికి వ్యతిరేకంగా ఓట్లు వేసుంటే కచ్చితంగా వైసీపీనే గెలిచి ఉండేది.కానీ అక్క‌డ టీడీపీ పాగా వేసింది. ఇదిలా ఉంటే తూర్పు గోదావ‌రి ముద్ర‌గ‌డ సొంత జిల్లా కావ‌డం దీనికి తోడు ఆయ‌న స్వస్ధలం కిర్లంపూడికి సమీపంలోనే ఉన్న కాకినాడలో ఎన్నిక జ‌రిగిన‌ప్ప‌టికీ ఆయ‌న మాట చెల్లుబాటు కాలేద‌ని రుజువైంది. దీంతో ఆయ‌న మాట‌లు కూడా కాపులు న‌మ్మే ప‌రిస్థితుల్లో లేర‌ని అంటున్నారు విశ్లేష‌కులు. కాపుల‌కు కొంత అనుకూలంగా ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించ‌డం, మేయ‌ర్ ప‌ద‌విని కాపుల‌కే ఇస్తామ‌ని చెప్ప‌డం వారికి క‌లిసి వ‌చ్చింది. అంటే ముద్ర‌గ‌డ ముద్ర పూర్తి స్థాయిలో కాపుల‌పై లేదనే విష‌యం స్ప‌ష్టంగా అర్థ‌మైంది. దీంతో ఆయ‌న త‌రువాతి స్టెప్ ఎలా ఉండ‌బోతుంది. జ‌గ‌న్ ముద్ర‌గ‌డ‌ను చేర‌దీసి ఉద్య‌మానికి ఊత‌మిస్తారా అనేది ఆస‌క్తిగా మారింది.

Tags : , , , , , , , , , , , , , , , , , , , , , , , ,