షర్మిల కోసం ఈ మూడు సీట్లని రెడీ చేసిన జగన్ | OMG! Do You Know What Jagan did for Sharmila

admin
sharmila

The Opposition leader and the wish to go for direct election to sister YS Jagan’s sister Sharmis will finally be in the next election.click on the below video to know more details of OMG! Do You Know What Jagan did for Sharmila

apప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిలకు ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దిగాల‌న్న కోరిక ఎట్ట‌కేల‌కు వచ్చే ఎన్నిక‌ల్లో తీర‌నుంది.

నిజానికి 2014 ఎన్నిక‌ల బ‌రిలోకి దిగాల‌ని ఎంతో ఆసపడిన ఆమె ఆశ‌ల‌ను జ‌గ‌న్ వ‌మ్ము చేశారు. కారణాలేవైనా గ‌త ఎన్నిక‌ల్లో ష‌ర్మిల‌ను జ‌గ‌న్ ప‌క్క‌న పెట్టారు. గ‌త ఎన్నిక‌ల్లో వరసకు తమ్ముడైన అవినాష్‌రెడ్డికి క‌డ‌ప ఎంపీ సీటు ఇచ్చిన జ‌గ‌న్‌, త‌ల్లి విజ‌య‌మ్మని విశాఖ mpఅభ్యర్థి గా బ‌రిలోకి దింపారు. చివరి అవకాశంగా ష‌ర్మిల ఖ‌మ్మం ఎంపీ సీటు ఆశించారు. అయితే తన ఫ్యామిలీలో అప్పటికే రెండు ఎంపీ సీట్లు ఇవ్వ‌డం, మ‌రో వైపు తాను పులివెందుల నుంచి, మేన‌మామ రవీంద్రనాథ్ రెడ్డి క‌మ‌లాపురం నుంచి ఎమ్మెల్యేలుగా బ‌రిలో ఉండ‌డంతో జ‌గ‌న్ ష‌ర్మిల‌ను ప‌క్క‌న పెట్టారు. తర్వాత ఆమె రాజ్య‌స‌భ సీటు ఆశించినా అది విజ‌యసాయిరెడ్డికి ఇచ్చారు. ఇక క‌నీసం ఎమ్మెల్సీ అయినా ద‌క్కుతుంద‌ని ఆమె ఆశించిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత ష‌ర్మిలకు, ఆమె భ‌ర్త అనిల్‌కు జ‌గ‌న్‌కు మ‌ధ్య పొరాపొచ్చ‌ల‌పై కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది.

వాస్త‌వానికి జ‌గ‌న్ జైలులో ఉన్న‌ప్పుడు ష‌ర్మిల అప్ప‌టి సమైక్యాంధ్ర‌లో పాద‌యాత్ర చేసి రికార్డు క్రియేట్ చెయ్యడమే కాకుండా పార్టీని నిలబెట్టారు. ఆ త‌ర్వాత ఆమె ఎంపీ సీటు ఆశించినా ఆమె కోరిక నెర‌వేర‌లేదు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో సోద‌రిని ఎంపీ బ‌రిలో దింపేందుకు జ‌గ‌న్ ఓకే చెప్పిన‌ట్టు వైసీపీ వ‌ర్గాల స‌మాచారం. ష‌ర్మిల కోసం జ‌గ‌న్ క‌డ‌ప, విశాఖ‌పట్నం ఎంపీ స్థానాలను ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది. క‌డ‌ప ఎంపీ అవినాష్‌పై అసంతృప్తితో ఉన్న జ‌గ‌న్ ఆయ‌న్ను ఎమ్మెల్సీగా పంపి అక్క‌డ ష‌ర్మిల‌ను దింపాలా ? అని ఓ ఆలోచ‌న చేస్తున్నార‌ట‌. ఇక విశాఖ‌లో విజ‌య‌ల‌క్షి ఓడిపోవ‌డంతో పోయిన‌చోటే వెతుక్కోవాల‌న్న చందంగా ష‌ర్మిల‌ను అక్క‌డ నుంచి పోటీ చేయించాల‌ని కొంద‌రు జగ‌న్‌కు చెప్పార‌ట‌. అయితే ఒంగోలులో జ‌గ‌న్ బాబాయ్ ఎంపీ సుబ్బారెడ్డి వ‌చ్చే ఎన్నిక‌ల్లో అద్దంకి నుంచి mlaగా పోటీ చేయాల‌నుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ష‌ర్మిల కోసం జ‌గ‌న్ ఒంగోలును కూడా ఓ ఆప్ష‌న్‌గా ప‌రిశీలిస్తున్నార‌ట‌. మ‌రి ష‌ర్మిల కోరిక‌ను జ‌గ‌న్ ఏ సీటు నుంచి తీరుస్తారో ? చూడాలి.

Tags : , , , , , , , , , , , , , , , , , , , , , ,