వైసీపీతో డీల్ ఎమ్మెల్యే సీటు, 15 కోట్ల ఎవరికో తెలుసా?

admin
ycp

ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మన్ గా ఉన్న ఐవైఆర్ కృష్ణారావును ముఖ్య‌మంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.


ప్రభుత్వానికి, పార్టీకి వ్యతిరేకంగా సామాజిక మాద్యమాల్లో ఐవైఆర్ అనేక పోస్టులు షేర్ చేయడంపై చంద్రబాబుకు నేతల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. టిడిపి ప్రభుత్వం బ్రాహ్మణులకు తగు ప్రాధాన్యం కల్పించాలనే ఉద్ధేశ్యంతో ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేసి… గతంలో ఏ బ‌డ్జెట్‌లోనూ కేటాయించని విధంగా నిధులు కేటాయించామని, బ్రాహ్మణులకు ఆ నిధులు సద్వినియోగం అయ్యేలా చేస్తారని కృష్ణారావుకు బాధ్యతలు అప్పగిస్తే ఈ విధంగా పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొని రావడం పట్ల చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు ఎట్టకేలకి ఆయన్ని తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అయితే దీని వెనుక మరింత కుట్ర దాగుందని తెలుస్తోంది, తెలుగుదేశం నుండి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సీటుని ఆశించి భంగపడ్డ కృష్ణారావు తరువాత పరిణామాలతో వైసీపీకి టచ్ లోకి వెళ్ళారని తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో అదే సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ ఒకరు జగన్ పార్టీ కి టచ్ లోకి తెచ్చారని ప్రచారం జరుగుతోంది. 15 కోట్ల రూపాయల డీల్ కూడా జరిగిందనేది వైసేపీ వర్గాల నుండి అందుతున్న సమాచారం.

ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ తర్వాత తొలి ప్రధాన కార్యదర్శి, ఇప్పుటి ప్రభుత్వ అనుబంధ సంస్థ అయిన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తో చంద్రబాబు మీద వ్యతిరేక పోస్ట్లు పెట్టి, ఆల్రెడీ ఉన్న వాటిని షేర్ చేస్తే ఆంధ్రాలో ఏదైనా ఎమ్మెల్యే సీటు, 15 కోట్ల నగదు ఇచ్చేలా వైసీపీ తో డీల్ కూడా జరిగిందని వైసీపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.

ఈ మొత్తం వ్యవాహారంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేసి స్పందిన్చనున్న కృష్ణారావు ఎ విధంగా ఈ వ్యవహారాన్ని సమర్ధించుకునే ప్రయత్నం చేస్తారో చూడాలి. ఒక వేళ వైసీపి లోకి వెళ్ళేది నిజమే అయితే ఇప్పుడు ప్రకటిస్తారా, లేక ఎన్నికల సమయంలో వెల్లడిస్తారా అనేది తెలియాల్సి ఉంది.

Tags : , , , , , , , , ,