TDPని విడేందుకు రెడీ అయ్యిన మేయర్ భర్త! | OMG! Mayor Husband to LEAVE TDP Party!

admin
tdp

Rajahmundry Mayor Smt Padam Rajani Sasha Sai Husband Pantha Kondala Rao has been angry at the corruption in the corporation.click on the below video to know more details of OMG! Mayor Husband to LEAVE TDP Party!

రాజమండ్రి మేయర్ శ్రీమతి పంతం రజని శేష సాయి భర్త పంతం కొండల రావు కు కార్పొరేషన్ లో జరుగుతున్న అవినీతిపై ఒక్కసారిగా కోపం వచ్చింది .

దాంతో ఆయన మీడియా సమావేశం పెట్టి అధికారులను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేసారు. కార్పొరేషన్ అంతా అవినీతి మయంగా మారిపోయిందని దీని ప్రక్షాళనకు తాను నడుం కట్టక తప్పడం లేదని హెచ్చరించారు . అధికార పార్టీలో వుంటూ స్వయానా మేయర్ భర్త గా వున్న పంతం కొండల రావు చేసిన విమర్శలు ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి . ఇటీవలే కాకినాడ ఎన్నికల్లో విజయం సాధించి జోష్ మీదున్న టిడిపి నేతలకు ఆయన చేసిన వ్యాఖ్యలు మింగుడు పడటం లేదు అయినా తాను చేసిన కామెంట్స్ పార్టీ కి మైలేజ్ తెచ్చేవే అంటున్నారు పంతం.

ఈనెల 7 వతేదీన ఏపీ సీఎం చంద్రబాబు రాజమండ్రి లో పర్యటించి కార్పొరేషన్ కొత్త కార్యాలయ భవనం ప్రారంభించనున్నారు . ఈ సమయంలో ఇన్నేళ్ళు మౌనంగా ఉండి ఇప్పుడు తెరపైకి వచ్చి అంతా అవినీతి మయం అంటూ కొండలరావు చేసిన వ్యాఖ్యల నేపధ్యం వెనుక టిడిపికి భవిష్యత్తులో గుడ్ బై కొట్టేందుకే అని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది . బిజెపి లేదా జనసేన లోకి పంతం జంప్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తుంది . అందుకోసమే రంగం సిద్ధం చేసుకుంటున్నారని అంటున్నారు . పంతం కొండల రావు సీసీసీ ఛానెల్ ఎండి గా కాంగ్రెస్ పార్టీలో మూడు దశాబ్దాల రాజకీయ నేతగా ఒక సారి కార్పొరేటర్ గా పనిచేశారు. కాపు సామాజిక వర్గం, వ్యక్తిగత ఇమేజ్ కూడా ఉండటంతో విభజన తరువాత టిడిపి ఆయన భార్యకు మేయర్ ఆఫర్ ఇచ్చి పంతం కుటుంబాన్ని పార్టీ లోకి లాగింది . అయితే ఆమె పేరుకే మేయర్ తప్ప చక్రం తిప్పేది అంతా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి , కమిషనర్ విజయరామరాజులే సీనియర్ నేత ఆదిరెడ్డి అప్పారావు. ఎదిఎమైనా గోరంట్ల కోటరికే కార్పొరేషన్ లో మాట చెల్లుబాటు అవుతుంది . అదీగాక భార్య మేయర్ అయినా కార్పొరేషన్ వ్యవహారాల్లో కొండలరావు వేలు పెట్టింది లేదు .

కార్పొరేషన్ వ్యవహారాలను చూస్తూ వూరుకుంటూ ఉంటే అటు వైఫల్యం చెందారు అనే చెడ్డ పేరు, తన రాజకీయ భవిష్యత్తును ఇబ్బందుల్లోకి నెట్టే ఛాన్స్ ఉందని గ్రహించి ఆయన క్రీయాశీలం అయినట్లు తెలుస్తుంది . కమిషనర్ వైఖరి పై ,టౌన్ ప్లానింగ్ అవినీతిపై దశలవారీ పోరాటం చేపడతా అంటూ పంతం చేసిన హాట్ కామెంట్స్ వెనుక పక్కా క్లారిటీ, వ్యూహం ఉన్నాయని ఆయన ప్రత్యర్ధులు అంచనా వేస్తున్నారు. కానీ మరో ఏడాదిన్నర లో ఎన్నికలు జరిగే ముందు మాత్రమే ఆయన తెరపైకి వచ్చి ఈ హడావిడి చేయడాన్ని చాలా మంది తప్పు పడుతున్నారు . ఏడాదిపాటు కార్పొరేషన్ పాలన చూసి గాడిన పెట్టే లా ప్రయత్నాలు చేసి ఉంటే పంతం కి మరింత క్రేజ్ ఉండేదని ఇప్పుడు పాలన బాగోలేదంటే అర్బన్, రురల్ ఎమ్యెల్యేలు, ఎమ్యెల్సీ లతో బాటు తన భార్య సైతం సక్రమంగా పని చేయలేదనే మెసేజ్ వెళుతుందని ఇప్పటి వరకు చోద్యం చూస్తూ ఇప్పుడు హడావిడి చేస్తే మాత్రం లాభం ఏమిటని మరికొందరు భావిస్తున్నారు . మరి పంతం చేస్తున్న ఈ హడావిడి రాజమండ్రి రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తుందో వేచి చూడాలి .

Tags : , , , , , , , , , , , ,