తెలుగు రాష్ట్రాల్లో మ‌రో మినీ సాధార‌ణ ఎన్నిక‌లు త‌ప్ప‌వా? | OMG! Mini Elections in AP & Telangana?

admin
telugu

The remarks made by the Supreme Chief Justice in both the Telugu Desam Party have now not been able to sleep for the defectors. There are two new states that have formed a separate Andhra Pradesh division. But everybody thinks that the newly formed states will have good traditions. But in contrast to the Telugu states’ desecration efforts in the AP. Click on the below video to know more details of OMG! Mini Elections in AP & Telangana?

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విచ్చ‌ల‌విడిగా సాగిన ఫిరాయింపుల‌పై సుప్రీం ప్ర‌ధాన న్యాయ‌మూర్తి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఫిరాయింపు దార్ల‌కు నిద్ర‌ప‌ట్ట‌నీయంటం లేదు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న జ‌రిగి రెండు కొత్త రాష్ట్రాలు ఏర్ప‌డిన సంగ‌తి తెల్సిందే. అయితే కొత్త‌గా ఏర్ప‌డిన రాష్ట్రాల్లో మంచి సంప్ర‌దాయాలు నెల‌కొల్పుతార‌ని అంద‌రూ భావించారు. కానీ దానికి భిన్నంగా తెలుగు రాష్ట్రాల ప‌రువు తీసే చ‌ర్య‌ల‌కు ఏపీలోనూ. తెలంగాణ‌లో పార్టీ ఫిరాయింపుల‌కు చంద్ర‌లిద్ద‌రూ తెర లేపారు. ఏపీలో టీడీపీ 22 మందిని ఫిరాయింపుల‌కు ప్రోత్స‌హిస్తే, తెలంగాణ తామేమి తక్కువ కాదంటూ అన్ని రాజకీయ పార్టీల నుంచి కూడా కేసీఆర్ స‌ర్కార్ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించింది. దీనిపై స్పీక‌ర్ల‌కు ఫిర్యాదు చేసినా కూడా ప్ర‌యోజ‌నం లేకుండా పోయింది. ఏళ్లు గ‌డుస్తున్నాస్పీక‌ర్లు ఈ ఫిర్యాదుల‌పై ప‌ట్టించుకున్న పాపాన పోవ‌టంలేదు. దీంతో ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై త‌గిన వ్య‌వ‌ధిలో చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించాల‌ని కోరుతూ సుప్రీం కోర్టును కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సంప‌త్ ఆశ్ర‌యించారు.

ఈ ఫిరాయింపు అనేది చ‌ట్ట వ్య‌తిర‌క‌మైన‌ప్ప‌టికీ కూడా ఇది స్పీక‌ర్ అధికారాలు, హ‌క్కుల‌తో ముడిప‌డి ఉన్నందున దీన్ని రాజ్యాంగ ధ‌ర్మాస‌నానికి నివేదించిన‌ట్లుగా సుప్రీం కోర్టు చీఫ్ జ‌స్టీస్ పేర్కొన్నారు. వ‌చ్చే నెల నుంచి దీనిపై విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లుగా ఆయ‌న తెలిపారు. సాధార‌ణంగా రాజ్యాంగ ధ‌ర్మాస‌నం తీర్పు ఇస్తే దాన్ని స్పీక‌ర్లు అనివార్యంగా అమ‌లు చేయాల్సి ఉంటుంది. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా స్పీక‌ర్ల వ్య‌వ‌స్ధ‌పై చ‌ర్చ జ‌రుగుతుంది. పార్టీల‌కు అతీత‌గా స్పీక‌ర్లు వ్య‌వ‌హారించాల‌ని కోరుకుంటున్నా, ఆయ‌న కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన త‌ర్వాత‌నే ఆయ‌న స్పీక‌ర్ అవుతున్నందున స్పీక‌ర్ కూడా పార్టీ అదేశాల‌ను కాద‌న‌లేని ప‌రిస్థితిలో ఉంటున్నార‌నే అప‌వాదు ఇప్ప‌టికే స్పీక‌ర్ల‌పై ఉంది. రాజ్యాంగ ధ‌ర్మాస‌నం తీర్పు త్వ‌ర‌గా వ‌చ్చి, ఫిరాయింపుదార్ల‌పై వేటు ప‌డితే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ సంఖ్య‌లో ఉప‌ ఎన్నిక‌లు జ‌ర‌గ‌టం ఖాయం అంటున్నారు. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 45 స్ధానాల వ‌ర‌కు ఉప ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంటుంది. అదే జ‌రిగితే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మ‌రో మినీ ఎన్నిక‌లు ఖాయం అని చెప్ప‌క త‌ప్ప‌దు.

Tags : , , , , , , , , , , , , , , , , , , , , ,