వివాదంలోకి మ‌రో టీఆర్ఎస్ ఎమ్మెల్యే! |OMG! TRS MLA in a BIG Trouble? | Political News

admin
trs

There is another controversy for the party at the time when the unemployed, the lower cadre disgrace on the Telangana government.click on the below video to know more details of OMG! TRS MLA in a BIG Trouble? | Political News

తెలంగాణ ప్ర‌భుత్వంపై ఇప్ప‌టికే నిరుద్యోగులు, కింది స్థాయి కేడ‌ర్ అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్న త‌రుణంలో ఆ పార్టీకి మ‌రో వివాదం అంటుకుంది.

టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల ప‌నితీరు కార‌ణంగా ఆ పార్టీ ఓ వ‌ర్గానికి మెల్ల‌మెల్ల‌గా దూరం అవుతూ వ‌స్తుంద‌నే వాద‌న‌లు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్య‌మాల‌కు పెట్టింది పేరుగా,, కేసీఆర్ రాజ‌కీయ ప్ర‌స్తానానికి అండ‌గా ఉన్న క‌రీంన‌గ‌ర్ జిల్లాలో వ‌రుస‌గా ద‌ళితుల‌పై చోటు చేసుకుంటున్న ఘ‌ట‌న‌లు ఇప్పుడు ఆ పార్టీకి గుదిబండ‌గా మారాయి. కొద్ది రోజుల క్రితం మంథ‌ని ఎమ్మెల్యే పుట్ట‌మ‌ధు ఓ ద‌ళిత యువ‌కుడి హ‌త్య‌కు కార‌ణం అయ్యార‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇటీవ‌ల కేటీఆర్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న సిరిసిల్ల నియోజ‌క‌వ‌ర్గంలోని నేరెళ్ల‌లో ద‌ళితుల‌పై పోలీసులు అమానుషంగా వ్య‌వ‌హ‌రించారు.

ఇవ‌న్నీ ప‌క్క‌న‌ప‌డ్డాయి అని అనుకుంటున్న స‌మ‌యంలోనే మ‌రో వివాదం తెర‌పైకి వ‌చ్చింది. క‌ళాకారుడిగా ఎంతో గుర్తింపు ఉన్న టీఆర్ ఎస్ ఎమ్మెల్యే ర‌స‌మ‌యి బాల‌కిష‌న్ వివాదాల్లో ఇరుక్కున్నారు. అయితే అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఆయ‌న వివాదాల్లో ఇరుక్కోవ‌డం ప‌రిపాటిగా మారింది. కొన్ని రోజుల క్రితం కరీంనగర్ కలెక్టర్ తో వాగ్వాదానికి దిగి వార్తల్లో నిలిచారు. తాజాగా మ‌రో వివాదంలో చిక్కుకున్నారాయ‌న‌. ద‌ళితుల‌కు ప్ర‌భుత్వం ఇచ్చే మూడెక‌రాల బూమి విష‌యంలో త‌మ‌కు అన్యాయం జ‌రిగింద‌ని నిర‌సిస్తూ.. ఇద్ద‌రు ద‌ళిత యువ‌కులు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశారు. క‌రీంనగర్ జిల్లా మానకొండూరులోని టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు ఎదుటే ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు.అన‌ర్హుల‌కు అండ‌గా ఉంటూ త‌మ‌కు అన్యాయం చేస్తున్నార‌ని ఇదేంట‌ని ప్రశ్నిస్తే త‌మ‌పై అనుచితంగా వ్య‌వ‌హ‌రించార‌ని బాధితులు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ అంశం కాస్తా ఇప్పుడు ర‌స‌మ‌యి మెడ‌కు పాములా చుట్టుకుంది.
ఈ ఘ‌ట‌న గురించి తెలియ‌గానే పార్టీ అగ్ర‌నేత‌లంతా ఆస్ప‌త్రికి వెళ్లి బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. వారికి మెరుగైన చికిత్స అందేలా చూడాల‌ని వైద్యుల‌ను కోరారు. అయితే ఇప్ప‌టికే నేరేళ్ల ఘ‌ట‌న‌తో ప్ర‌భుత్వానికి, పార్టీకి కొంత చెడ్డ‌పేరు వ‌చ్చింది. దాన్నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప్ర‌భుత్వం న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు కూడా చేప‌ట్టింది. తాజాగా భూపంపిణి విష‌యంలో ఎమ్మెల్యే ర‌స‌మ‌యి తీరును నిర‌సిస్తూ ఇద్ద‌రు ద‌ళితులు ఆత్మ‌య‌త్నాయత్నం చేయ‌డం వివాదాస్ప‌ద‌మైంది. ఇప్ప‌టికే ర‌స‌మ‌యి తీరుపై జిల్లా నాయ‌కుల్లోనూ ఇటు కేసీఆర్ కూడా అసంతృప్తిగానే ఉన్నారు. గ‌తంలో ఆయ‌న‌కు కేసీఆర్ వార్నింగ్ కూడా ఇచ్చిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఈ స‌మ‌యంలోనే మ‌రోసారి ఆయ‌న వ్య‌వ‌హ‌రం కాస్తాహాట్ టాపిక్ గా మారింది. ద‌ళితుల వ్య‌వ‌తిరేక‌త‌ను తిప్పికొట్టేందుకు మూడెక‌రాల భూమి హామీని తీసుకువ‌స్తున్న త‌రుణంలో బాల‌కిష‌న్ అత్యుత్సాహంగా వ్య‌వ‌హ‌రించి బాధితుల‌ను దూషించార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీంతో ద‌ళితుల అంశం నుంచి ఎంత బ‌య‌ట‌ప‌డ‌దామ‌ని భావిస్తున్నా పార్టీ నేత‌ల కార‌ణంగా వ్య‌తిరేక‌త మూట‌గ‌ట్టుకోవాల్సి వ‌స్తూనే ఉంది. అయితే ద‌ళితుల వ్య‌తిరేక‌త ఎక్కువ రావ‌డానికి కేసీఆర్ కూడా ఓ కార‌ణ‌మేన‌ని టీఆర్ ఎస్ వ‌ర్గాలు ఇన్న‌ర్ గా మాట్లాడుకుంటున్నాయి. తెలంగాణ‌లో ద‌ళితుడే తొలి ముఖ్య‌మంత్రి అంటూ కేసీఆర్ హామీఇచ్చి మాట త‌ప్పిన సంగ‌తి తెలిసిందే.. ఇదే అలుసుగా తీసుకొని వారి త‌రుపున మాట్లాడే వారు ఉండ‌ర‌ని భావించిన కొంత మంది నేత‌లు అదేప‌నిగా వారిపై దాడి చేస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.మొత్తానికి ఈ వ్య‌వ‌హారం కాస్తా ఇప్పుడు టీఆర్ ఎస్ ను ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసింది.

Tags : , , , , , , , , , , , , , , , , ,