సంస్ధాగ‌త నిర్మాణ‌మే టీడీపీ ఆయువు ప‌ట్టా?

mohanrao
babu-and-jagan

ఏపీ పాల‌నలో తలమునకలై ఉన్న టీడీపీ మూడు రోజుల పాటు పార్టీ నేత‌ల‌కు వ‌ర్క్ షాపు నిర్వ‌హించి  నిర్మాణానికి ఉన్న ప్రాధాన్య‌త‌ను మ‌రోసారి చాటుకుంది.

ఏ పార్టీకైనా పార్టీ నిర్మాణం ప‌ట్టుగొమ్మ‌వంటిది. ఈ విష‌యాన్ని టీడీపీ అర్దం చేసుకున్న‌ట్లుగా మ‌రే పార్టీ అర్ధం చేసుకోలేద‌ని చెప్ప‌టం అతియోశ‌క్తి కాదు. అధికారంలో ఉండి పాల‌న‌లో త‌లమునకలై  ఉన్న ఆ పార్టీ మూడు రోజులు పాటు పార్టీ నేత‌ల‌కు వ‌ర్క్ షాపు నిర్వ‌హించింది. ఈ మూడు రోజులూ ముఖ్య‌మంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇత‌ర యంత్రాంగం అంతా దీనిపైనే దృష్టి పెట్టిందంటే ఆ పార్టీ నిర్మాణానికి ఎంత ప్రాధాన్య‌త ఇస్తోందో అర్ధం అవుతోంది. సాధార‌ణంగా ప్ర‌తిప‌క్షంలో ఉన్న పార్టీలు ఎక్కువ‌గా పార్టీ నిర్మాణానికి ప్రాధాన్య‌త ఇస్తాయి. కానీ ఏపీ పూర్తి భిన్నంగా ఉంది. ప్ర‌తిప‌క్షంలో ఉన్న వైసీపీ పార్టీ నిర్మాణానికి త‌గిన ప్రాధాన్య‌త ఇవ్వ‌టం లేద‌నే విమ‌ర్శ‌లు బ‌హిరంగంగానే విన్పిస్తున్నాయి.

ఒక ప‌క్క సోషల్ మీడియా లో తెలుగుదేశం పై అనేక ఆరోప‌ణ‌ల విన్పిస్తున్నాయి. వాటిని తిప్పి కొట్టాలంటే పార్టీ కేడ‌ర్‌ను అప్ర‌మ‌త్తం చేయాలి. దానికి అనుగుణంగానే టీడీపీ చ‌ర్య‌లు చేప‌ట్టింద‌నే వాద‌న కూడా విన్పిస్తోంది. ప్రభుత్వ పనులు అన్నీ పక్కన పెట్టి దాదాపు 3 రోజుల పాటు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమైన నాయకులు మొత్తం అక్కడే ఉండి పార్టీ మొత్తానికీ దిశా నిర్దేశం చేసారు అంటే . ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఎంత తీవ్రంగా తీసుకున్నారో ప్ర‌తిప‌క్షాలు ఆలోచించుకోవాలి.
ఏపీలో టీడీపీపై అనేక ఆరోప‌ణ‌లు ఉన్నాయి. రైతాంగానికి రుణ మాఫీ చేయ‌టంలో విఫ‌లం అయింద‌ని, డ్వాక్రా మ‌హిళ‌ల‌కు రుణ మాఫీ విష‌యంలోనూ టీడీపీ మాట త‌ప్పింద‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. అంతే కాకుండా అమ‌రావ‌తి నిర్మాణాన్ని సింగ‌పూర్ కంపెనీల‌కు క‌ట్ట‌బ‌ట్ట‌డానికి చంద్ర‌బాబు ప్ర‌య‌త్నం చేస్తున్నారని విమ‌ర్శ‌లు ఉన్నాయి. ముఖ్యంగా ఏపీకి ప్ర‌త్యేక హోదా కు ప్ర‌త్యామ్నాయంగా పాకేజీ వైపు టీడీపీ మొగ్గు చూప‌డంపై ఆ పార్టీ పై తీవ్ర మైన విమ‌ర్శ‌లు ఉన్నాయి. వీటిపై టీడీపీ వెర్ష‌న్ ప్ర‌జ‌ల్లోకి వెళ్లాలంటే పార్టీ కేడ‌ర్‌ని అప్ర‌మ‌త్తం చేయాల‌ని పార్టీ భావిస్తోంది. దానిలో భాగంగానే టీడీపీ ఈ చ‌ర్య‌లు చేప‌ట్టిందంటున్నారు. తెలుగుదేశం అనే పార్టీ ఇంకా నిలబడి ఉన్నది అంటే కారణం కేవలం చంద్రబాబు గారే అన్నది స్పష్టం. అధికారంలో ఉండి పార్టీ నిర్మాణానికి త‌గిన ప్రాధాన్య‌త‌ను ఇస్తున్న చంద్ర‌బాబును చూసి జ‌గ‌న్ నేర్చుకోవాల్సింది ఎంత‌నా ఉంద‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. పార్టీ నిర్మాణం ప‌టిష్ట ప‌ర్చుకోకుండా పార్టీకి దిశా నిర్దేశం చేయ‌టం అంత సులువు కాదు. ఎవ‌రైన ఈ విష‌యాన్ని అంగీక‌రించాల్సిందే.

 

Tags : , , , , , , , , , ,