దసరా అవ్వగానే పవన్ కొత్త పోరాటం డీటెయిల్స్ ఇవే! | Pawan Kalyan to Follow This After Dussehra

admin
janasena

Hero Pawan Kalyan created a new trend in Andhra Pradesh for the past two years. Even if no problem comes to him, he is playing a role in solving it. There is a delay in getting some trouble going to public representatives and going to Pawan Kalyan. Click on the below video to know more details of Pawan Kalyan to Follow This After Dussehra

గత రెండు సంవత్సరాలు గా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఒక కొత్త ట్రెండ్ ని సృష్టించాడు హీరో పవన్ కళ్యాణ్. ఎలాంటి సమస్య తన దగ్గరకి వచ్చినా కూడా దాన్ని సాల్వ్ చేయడం లో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు ఆయన. ఏదైనా సమస్య రావడం ఆలస్యం జనం ఇక ప్రజా ప్రతినిధుల దగ్గరకి వెళ్ళడం మానేసి పవన్ కళ్యాణ్ దగ్గరకి వెళుతున్నారు. జనసేన అధినతగా జనం లో అంతటి మంచిని కాపాడుకున్నాడు పవన్. పవన్ ఆ సమస్య కి సంబంధించి ఏదో ఒక ఉద్యమం లాగా లేవదీయడం దాన్ని ప్రభుత్వం అర్ధం చేసుకుని సమాధాన పరుస్తూ సొల్యూషన్ చూపించడం. ఇదొక వరస ప్రాసెస్ అయిపొయింది. అసలు పవన్ ప్రశ్నించేదాకా ప్రభుత్వం ఆయా సమస్యల పరిష్కారంపై ఎందుకు దృష్టి సారించడం లేదన్న విషయం సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోతుండగా అసలు ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించరో అర్థం కాని పరిస్థితి.

ఆక్వా ఫుడ్ పార్క్ అనేది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటె ఈ సమస్య ని చెప్పుకోవడం కోసం హైదరాబాద్ వరకూ వచ్చారు అక్కడి జనాలు తమ సమస్య ని విన్నవించుకోవడం కోసం పవన్ కళ్యాణ్ వరకూ వెళ్ళారు అంటే లోకల్ లీడర్ ల విఫల ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. ఇలాంటివి చూసిన తరవాత మా సమస్య పరిష్కరించండి , మా సమస్య పరిష్కరించండి అంటూ పవన్ దగ్గరకి కోకొల్లలుగా వస్తున్నారు. ఉద్దానం కిడ్నీ సమస్య విషయం లో , అగ్రికల్చర్ స్టూడెంట్స్ విషయం లో తన హెల్ప్ తాను చేసిన పవన్ కళ్యాణ్ వారికి దేవుడు అయ్యాడు. తాజా ట్రెండ్ ని జనాలు కూడా బాగా వంట పట్టించుకుంటూ ఉన్నారు దాంతో ఇప్పుడు కొత్తగా పెట్రోల్ బ్యాంకుల డీలర్లు అందరూ పవన్ కళ్యాణ్ కార్యాలయం కి వెళ్లేందుకు సిద్దం అయ్యారు. చాలా కాలం నుంచి తాము కొన్ని సమస్యలతో సతమతమవుతున్నామని – ప్రభుత్వాల దృష్టికి వీటిని తీసుకెళ్లినా పరిష్కారం దక్కడం లేదని తీవ్ర ఆవేదనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ సభ్యులు ఇప్పుడు పవన్ కల్యాణ్ను కలిస్తే… సరిపోతుందని భావించారట. అనుకున్నదే తడవుగా వారు కాసేపటి క్రితం గుంటూరులోని జనసేన నేతలను కలిశారట. తమ సమస్యలను పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లాలని పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ వినతి పత్రం ఇచ్చారు. దసరా పూర్తి అవ్వగానే పవన్ వీరికోసం పోరాటం మొదలు పెడతాడు అని జనసేన పెద్దలు వారితో చెప్పారట .

Tags : , , , , , , , , , , , , , , , , ,