వైర‌ల్ గా మారిన ప‌వ‌న్ జ‌నసేన కొత్త‌నినాదం | Pawan Kalyan’s Janasena Party Latest TWEET Goes VIRAL

admin
pawan

Relationships between neo-politicians and media are indirectly clarifying some things. This is evident in making the parties’ agendas more important and preferred. The media is working as an architecture for future strategies. click on the below video to know more details of Pawan Kalyan’s Janasena Party Latest TWEET Goes VIRAL

నయా రాజకీయాల తీరు తెన్నులకు మీడియాకు మధ్య సత్సంబంధాలు.. కొన్ని విషయాలను పరోక్షంగా స్పష్టం చేస్తుంటాయి. పార్టీల ఎజెండాలను భుజానికెత్తుకుని వాటికి ప్రాధాన్యం కల్పించడంలో ఈ విషయం స్పష్టమవుతుంది. భవిష్యత్తు వ్యూహాలకు వారధిగా మీడియా ఒక నిర్మాణంలా పనిచేయడం రాజకీయాల్లో ఇప్పుడు చాలా పార్టీలకు ఓ అనివార్యత ఏర్ప‌డింది .బహుశా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఇదే విషయాన్ని సీరియస్ గా తీసుకున్నట్లున్నారు. ఏకకాలంలో అటు పార్టీ నిర్మాణంతో పాటు.. పార్టీ పట్ల ప్రజలకు ఒక స్థిరాభిప్రాయం ఏర్పడేలా ఇటు మీడియాతోను ఇటు సోష‌ల్ మీడియాతోనూ సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.పవన్ కళ్యాణ్ దాదాపు మూడు సంవత్సరాల క్రితం పార్టి పెట్టిన అది పూర్తి స్థాయిలోకి ప్రజల్లోకి రాని విషయం విదితమే.కానీ పవన్ అప్పడప్పుడు తన పార్టీకి సంబందించి ఏదో ఒకటి చేస్తుంటారు. అయితే దానికి యాక్టివిటీ ఎలా ఉంటుందో లేదో తెలియ‌దు కానీ సోష‌ల్ మీడియాలో ఏ పోస్టు చేసినా ఆయ‌న అనుచ‌రులు, అభిమానులు తెగ హుషారుగా ఉంటారు. తాజాగా జనసేన పార్టీ విడుద‌ల చేసిన స్గోగ‌న్ ఇప్పుడు అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది అదే..

” అడుగు ముందుకు వేస్తే తల తెగి పడాలే గానీ కాళ్ళు అయితే వెనక్కి పడదు ” అన్నదే. జనసేన కొత్త నినాదం ఇదేనా అన్న సందేహం వ్యక్తమవుతోంది. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం కోసం సర్వ శక్తులూ ఒడ్డాలన్న లక్ష్యంతో ఆయన ఈ పిలుపు ఇస్తున్నాడా ? అయితే ఇక్కడో చిన్న పొరబాటు.. కాళ్ళు అయితే వెనక్కి పడదు అన్న క్యాప్షన్ ఉంది. కాళ్ళు బహువచనమైనప్పుడు..” వెనక్కి పడవు ” అని ఉండాలి.. కానీ..” పడదు ” అని కావాలనే పేర్కొన్నారా అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇక గ‌తంలోనూ అభిమానుల‌ను ఉత్సాహ‌ప‌రిచేందుకు కూడా ఓ వీడియోను విడుద‌ల చేశారు…మనసేన అంటూ ఒక టీజర్ ను పార్టీకి చెందిన యుట్యూబ్ లో దీనిని విడుదల చేశారు.దీంతో అప్పుడుజనసేన సామాజిక మాద్యమంలోకి రావడంపై పవన్ కళ్యాణ్ అబిమానులలో సంతోషం వ్యక్తం అయింది.కొందరు జై మనసేన అంటూ వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యక్రమాలను ప్రజలకు తెలపడం కోసం పేస్ బుక్, ట్విటర్ వంటి వాటిలో ఖాతాలు తెరిచిన జనసేన ఇప్పుడు టీజర్ విడుదల చేసింది. దీంతో వారిని మ‌రోసారి ఉత్సాహ‌ప‌రిచేందుకు ఈ నినాదాన్నితీసుకువ‌చ్చినట్టుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే ప‌వ‌న్ ఏ ప‌ని చేసిన మ‌ధ్య‌లో ఆపేస్తార‌ని ప్ర‌శ్నిస్తాన‌ని చెప్పి ప్ర‌శ్నించ‌కుండానే ఉండిపోతున్నార‌నే అపవాదును మూట‌గ‌ట్టుకుంటు వచ్చారు.. అయితే వాట‌న్నింటికి స‌మాధానంగానే ఇలాంటి స్లోగ‌న్ తీసుకువ‌చ్చి ఉంటార‌ని అనుకుంటున్నారు. ఇక పోతే ప‌వ‌న్ ఇక రాజ‌కీయాల్లోకి రావ‌డానికి రంగం సిద్ద‌మైంద‌ని దీంతో అర్థ‌మైత‌పోతుంద‌ని తెలుస్తోంది..

Tags : , , , , , , , , , , , , , , , , , ,