TRSలో రగులుతున్న మంటలు! | Political War in TRS Party | CM KCR

admin
trs

Telangana ruling party TRS MLAs criticize each other over criticism. This is why the TRS supremo does not have to do what KCR does! If you go back to the original party, there is no reason to be accused of opposition to the party in power.click on the below video to know more details of Political War in TRS Party | CM KCR

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌లో ఎమ్మెల్యేలు ఒక‌రిపై ఒక‌రు విమర్శలతో రెచ్చిపోతున్నారు.. సాధార‌ణంగా oppositionచేసే విమ‌ర్శ‌ల‌ను స్వ‌ప‌క్షంలోనే చేస్తూ నేత‌లు రాజ‌కీయాల‌ను ర‌క్తి క‌ట్టిస్తున్నారు. దీంతో టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌కు ఏం చేయాలో పాలుపోవడం లేద‌ట‌! అసలు విష‌యంలోకి వెళ్తే.. అధికారంలో ఉన్న పార్టీపై విప‌క్షం ఆరోప‌ణ‌లు చేయ‌డం ఎక్క‌డైనా స‌హ‌జం. కానీ, తెలంగాణ‌లో అధికార పార్టీలోని ఎమ్మెల్యేలే సొంత పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల‌పై అవినీతి ఆరోపణలు చేస్తుండ‌డం విచిత్రంగా మారింది. ఎమ్మెల్యేలకు , కిందిస్థాయి నేతలకు అసలు పడటం లేదు. కొందరు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా రాజీనామాలు చేస్తుండగా మరికొందరు ఎమ్మెల్యేల అవినీతి బండారాన్ని బయట పెడతామని బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నష్టనివారణ చ‌ర్య‌లకు దిగాల‌ని డిసైడ్ అయ్యారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్ జయశ్రీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే అవినీతికి అమ్ముడుపోయి పార్టీ కోసం కష్టపడుతున్న వారిని పక్కన పెట్టేశారని అన‌డ‌మే కాకుండా ఏకంగా తన పదవికి రాజీనామా చేసేశారు.

మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మనుషులు తమను డబ్బుల కోసం వేధిస్తున్నారంటూ మహంకాళి శ్రీనివాస్ అనే యువకుడు కిరోసిన్ పోసి నిప్పంటించుకున్నాడు. దళితులకు మూడెరాల భూమిని కోరితే ఎమ్మెల్యే అనుచరులు తమను డబ్బులు అడుగుతున్నారని శ్రీనివాస్ ఆరోపిస్తూ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి చెందాడు. మంత్రి మహీందర్ రెడ్డిపైనా ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. టీఆర్ఎస్ కు చెందిన ముస్లిం నేత నిప్పంటించుకుని మృతి చెందాడు. అదేవిధంగా జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి భూ ఆక్రమణలకు పాల్పడ్డారని స్వయంగా కలెక్టరే ఆరోపణలు చేశారు. చొప్పదండి ఎమ్మెల్యే బోడిగ శోభపై ఆ గ్రామ సర్పంచ్ ఆరెల్లి చంద్రశేఖర్ ఇటీవల తీవ్ర ఆరోపణలే చేశారు. కరీంనగర్, హైదరాబాద్ లలో బోడిగ శోభ పెద్దయెత్తున భూములు, ప్లాట్లు కొనుగోలు చేశారన్నారు. శోభ అవినీతిపై తాను సీఎం కేసీఆర్ తో పాటు సీబీఐకి కూడా ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. సో.. తెలంగాణ‌లో ప‌రిస్థితి ఇదీ! దీనిపై కేసీఆర్ దృష్టి పెట్టారు. ప‌రిస్థితి చేజార కుండానే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న భావిస్తున్న‌ట్టు స‌మాచారం. మ‌రి కొర‌డా ఎలా ఝ‌ళిపిస్తారో చూడాలి.

Tags : , , , , , , , , , , , , , , , , ,