మోదీపై సంచ‌లన వ్యాఖ్య‌లు చేసిన రాహుల్‌

mohanrao
rahul-and-modi

ప్రధాని నరేంద్రమోదీతో రాహుల్ ఢీ అంటే ఢీ అంటున్నారు. మోదీ బండారం బయట పడుతుందనే తనను సభలో మాట్లాడనివ్వటం లేదని ఆయన బీజేపీపై మండిపడ్డారు.

ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మండిపడ్డారు. లోక్‌సభలో మాట్లాడే అవకాశం రాకపోవడంతో రాహుల్‌గాంధీ అసహనానికి గురయ్యారు. తాను మాట్లాడితే భూకంపమే వస్తుందంటూ కొన్ని రోజుల క్రితం రాహుల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కానీ లోక్‌సభలో ఆయనకు మాట్లాడే అవకాశం రాలేదు. ఈ క్రమంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికార బిజెపిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్వేగానికి గురయ్యారు. లోక్‌సభ రేపటికి వాయిదా పడిన అనంతరం పార్లమెంట్ సమావేశాల తీరుపై విపక్షాలుసం సంయుక్త మీడియా సమావేశం ఏర్పాటు చేశాయి. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ మాట్లాడారు. ప్రధాని మోడీ వ్యక్తిగత అవినీతి సమాచారం తన వద్ద ఉందని, ఆ వివరాలను లోక్‌సభలో చెప్పాలనుకున్నట్లు రాహుల్ తెలిపారు. తన వద్ద ఉన్న సమాచారానికి ప్రధానే సమాధానంచెప్పాలని, తాను మాట్లాడితే ప్రధాని ఇబ్బందిపడతారని ఆయన పేర్కొన్నారు. అందుకే లోక్‌సభలో తనను మాట్లాడనివ్వడం లేదని ఆయన పేర్కొన్నారు. సభలో చర్చ జరగకుండా అధికారపక్షమే అడ్డుపడుతుందని ఆయన ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ సహా ఇతర విపక్ష పార్టీల ఎంపిలు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

Tags : , , , , , , ,