రాహుల్ గాంధీపై చెప్పు గిరాటు

నేత‌ల‌పైకి చెప్పులు విస‌ర‌డం కొత్త కాన్సెప్టు కాదు కానీ.. రాహుల్ పైకి విస‌ర‌డం కొత్త కాన్సెప్టే. అయితే వైరి వ‌ర్గాల ప‌ని ఇదంతా!

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాందీ యూపీని ప్ర‌చారం పేరుతో సుడిగాలిలా చుట్టేస్తున్నాడు. మొన్నామ‌ధ్య స‌భ‌కు హ‌జ‌రైన వారికి మంచాలు ఫ్రీ అంటూ పార్టీ ప్ర‌జ‌ల‌కు ఎర వేయ‌డంతో స‌భ‌ను విజ‌య‌వంతం చేసి మంచాలు తీసుకెళ్లారు. చిన్న చిన్న అల్లర్లు జ‌రిగినా స‌భ సక్సెస్ అయింది. అయితే సోమ‌వారం ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని సీతాపూర్ రోడ్ షో లో మాత్రం రాహుల్ కు చేదు అనుభ‌వం ఎదురైంది. రాహుల్ ప్ర‌చారం చేస్తుండ‌గా ఓ అగంత‌కుడు అత‌ని ముఖంపై కి చెప్పు గిరాటేశాడు.

అంత‌టితో ఆగ‌కుండా పార్టీని ఉద్దేశించి కామెంట్ చేశాడు. దీంతో వెంట‌నే పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం రాహుల్ షో యాధావిధిగా కొన‌సాగింది. అయితే చెప్పు గిరాటేసిన వ్య‌క్తి మాత్రం ప్ర‌ధాన ప్ర‌తి ప‌క్ష పార్టీకి చెందిన వ్య‌క్తి అని రాహుల్ స‌న్నిహితులు ఆరోపిస్తున్నారు. పోలీస్ స్టేష‌న్ లో కార్య‌క‌ర్త‌లు ఆ విధంగానే కేసు న‌మోదు చేసిన‌ట్లు స‌మాచారం.

Add your comment

Your email address will not be published.