కేసీఆర్ పై రాహుల్ ఛార్జి షీటు .. కేడర్ లో జోష్ నింపుతుందా?

మ‌రో రెండేళ్ల‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న త‌రుణంలో వ‌చ్చే ఎన్నిక‌ల‌ను ఎదుర్కొంవాలంటే పార్టీ శ్రేణుల్లో రాహుల్ జోష్ నింపాల్సి ఉంది.

తెలంగాణ‌లో రాహుల్ గాంధీ ప‌ర్య‌ట‌న‌కు కాంగ్రెస్ భారీగా ఏర్పాట్లు పూర్తి చేసింది. కాంగ్రెస్ రాహుల్ రాక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ఆ పార్టీకి రాహుల్ స‌భ‌ను స‌క్స్‌స్ చేయ‌టం అత్యంత అవ‌స‌రం. తెలంగాణ‌లో ప్ర‌జ‌ల‌కు న‌మ్మ‌కం క‌ల్గించాలంటే ఆ పార్టీకి మ‌రో మార్గం లేదు.

మ‌రో రెండేళ్ల‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న త‌రుణంలో వ‌చ్చే ఎన్నిక‌ల‌ను ఎదుర్కొంవాలంటే పార్టీ శ్రేణుల్లో రాహుల్ జోష్ నింపాల్సి ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఆవిర్భావ దినోత‌వ్స‌వం ముందు రోజున ఈ ఏర్పాట్లు చేసింది. ఈ స‌భ‌లో రాహుల్ కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై ఛార్జి షీటు విడుద‌ల చేస్తారు. ఈ ఛార్జి షీటులో తెలంగాణ‌లో అధికారంలో ఉన్న టీఆర్ ఎ స్ ప్ర‌భుత్వం గ‌త ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీల‌ను అమ‌లు తీరును ఈ ఛార్జి షీటులో పొందుప‌రుస్తారు. అలాగే న‌రేంద్ర‌మోదీ ఎన్నిక‌ల ముందు ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీలు , ఏ మేర‌కు నెర‌వేరుస్తారు? అనే విష‌యాల‌ను కూడా ఈ ఛార్జి షీటులో పొందుప‌ర్చి ప్ర‌జ‌ల్లో కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాల‌ని కాంగ్రెస్ ప్లాన్ రూపొందించ‌కుంది. రాహుల్ గాంధీ త‌న టూర్‌లో త‌ను అనుకున్న విధంగా కాంగ్రెస్‌లో జ‌వ‌స‌త్వాలు నింపుతారా?


కేసీఆర్ స‌ర్కార్‌కు తామే ప్ర‌త్య‌ర్ధుల‌మంటే తామే ప్ర‌త్య‌ర్ధుల‌మ‌ని బీజేపీ, కాంగ్రెస్‌లు పోటీ ప‌డుతున్న ప‌రిస్థితి క‌న్పిస్తోంది. ఇటీవ‌ల బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా టూర్ పూర్తి చేసుకుని వెళ్లారు. ఆ టూరు త‌ర్వాత కేసీఆర్ అమిత్ షా పై అగ్గిల‌మీద గుగ్గులం అయిన సంగ‌తి తెల్సిందే. రాహుల్ గాంధీ తెలంగాణ టూర్ కు వ‌స్తున్న నేప‌థ్యంలో సీఎం కేసీఆర్ రాహుల్ టూర్‌పై ప‌క్కాగా నిఘా ఉంచారు. రాహుల్ తెలంగాణ స‌ర్కార్‌పై దాడి చేస్తే దానికి కౌంట‌ర్ చేయ‌టానికి సిద్ద‌ప‌డుతున్నార‌ని తెలుస్తోంది.

తెలంగాణ‌లో మ‌రో రాజ‌కీయ పార్టీ టీఆర్ ఎస్ కు వ్య‌తిరేకంగా ఏం మాట్లాడినా కేసీఆర్ స‌హించ‌టానికి సిద్దంగా లేరు . ఈ విష‌యం అమిత్ షా టూర్‌, అలాగే చంద్ర‌బాబు నాయుడు టీడీపీ మ‌హానాడులో మాట్లాడిన విష‌యాల‌పై కేసీఆర్ స్పందించిన టూరే సాక్ష్యం. ఇప్పుడు రాహుల్ టూర్ త‌ర్వాత కూడా కేసీఆర్ తీవ్రంగా స్పందించే అవ‌కాశం ఉందంటున్నారు. అయితే రాహుల్ ఏ స్ధాయిలో టీఆర్ ఎస్ ప్ర‌భుత్వ విధానాలపై విరుచుకుప‌డ‌తార‌నే దాన్ని బ‌ట్టి కేసీఆర్ వ్యూహం ఉంటుంద‌ని తెలుస్తోంది. రాహుల్ ఉప‌న్యాసంలో స‌రుకులేదు, తెలంగాణ ప్ర‌జ‌ల‌పై ప్ర‌భావం చూప‌ని ప‌క్షంలో రెండో శ్రేణి నేత‌ల‌తో కౌంట‌ర్ ఇప్పించ వ‌చ్చంటున్నారు. రాహుల్ మాత్రం కేసీఆర్‌ను ఇరుకున పెట్టే ప‌ని చేస్తే మాత్రం కేసీఆర్ మ‌రో సారి జూలు విద‌ల్చ‌టం ఖాయ‌మంటున్నారు. రాహుల్ సామ‌ర్ధంపై ఆధార‌ప‌డే కేసీఆర్ ప్లానింగ్ ఉంటుంద‌ని తెలుస్తోంది.

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించే ప్రజాగర్జన బహిరంగసభ చారిత్రాత్మకమై నదిగా ఏఐసీసీ పరిశీలకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. స్థానిక అంబేడ్కర్ మైదానంలో జరగనున్న బహిరంగసభ ఏర్పాట్లను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలసి బుధవారం రాత్రి పరిశీలిం చారు. అనంతరం జరిగిన మీడియా సమా వేశంలో మాట్లా డుతూ.. మూడేళ్ల పాలనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను సంగారెడ్డి సభలో రాహుల్ గాంధీ ఎండగడతారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ప్రజాసమస్యలు పరిష్కరిం చడంలో విఫలమయ్యాయని దిగ్విజయ్ ఆరోపించారు.

నల్లధనం వెనక్కి తేవడం, ఉగ్రవాదాన్ని అంతం చేయడం, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో కేంద్రంలో మోదీ ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తూ.. వసూ ళ్లకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దళితులకు మూడెకరాలు, రెండు బెడ్ రూంల ఇళ్లు, రైతులకు మద్దతు ధర తది తర అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలం. ఖమ్మంలో కనీస మద్దతు ధర అడిగిన రైతులను అరెస్టు భూ సేకరణలో నష్టపోయే రైతులు, రైతు కూలీలకు పరిహా రం, జీవనోపాధి త‌దిత‌ర అంశాలు రాహుల్ ప్ర‌స్తావిస్తార‌ని తెలుస్తోంది.

Add your comment

Your email address will not be published.