రాహుల్ స‌భ కాంగ్రెస్‌లో ఆశ‌లు చిగురింప చేస్తుందా?

ఏపీలో మూడేళ్ల త‌ర్వాత ఏపీ ప్ర‌త్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ విజ‌య‌వంతం కావ‌టంతో పార్టీకి ఏపీ మ‌ళ్లీ ఆశ‌లు చిగురిస్తున్న‌ట్లుగా ఉన్నాయి.

ఆ పార్టీ నేత‌ల మాట‌ల‌ను బ‌ట్టి కూడా ఇదే విష‌యం అర్దం అవుతోంది. ఆ పార్టీ గుంటూరులో నిర్వ‌హించిన భరోసా స‌భ విజ‌య‌వంతం అయింద‌ని ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ప్ర‌జ‌లు కూడా రాహుల్ గాంధీ ఉప‌న్యాసం పూర్తి అయ్యే వ‌ర‌కు చాలా ఆస‌క్తితో ఎదురు చూశార‌ని, అంద‌రూ స్వ‌చ్ఛందంగా వ‌చ్చార‌ని ఆ పార్టీ నేత‌లు చెప్పుకుంటున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలోనూ బీజేపీ, టీడీపీ పాల‌న ప‌ట్ల ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెర‌గ‌టం, అలాగే ఏపీకి ఆ రెండు పార్టీలు క‌లిపి ఏగ‌నామం పెట్ట‌టంతో ప్ర‌జ‌ల‌కు ఈ రెండు పార్టీల‌పై కోపం పెరుగుతున్న త‌రుణంలో కాంగ్రెస్ నిర్వ‌హించిన స‌భ విజ‌య‌వంతం అయింద‌ని అంటున్నారు. దాంతో స‌రైన టైం కోసం వేచి చూస్తున్న కొంద‌రు నేత‌లు మ‌ళ్లీ డైల‌మాలో ప‌డ్డారంటున్నారు. ఇప్ప‌టికే కాంగ్రెస్ నేత‌లు చాలా మంది ఇత‌ర పార్టీల్లోకి వెళ్లిపోయిన సంగతి తెల్సిందే. రాహుల్ స‌భ‌తో ఇటువంటి ఆలోచ‌న‌ల్లో ఉన్న నేత‌లు మ‌ళ్లీ డైల‌మాలో ప‌డ్డారంటున్నారు.

రాహుల్ గాంధీ ఏపీలోని టీడీపీ, కేంద్రంలోని మోడీ స‌ర్కార్‌పై గ‌ట్టి విమ‌ర్శ‌లే చేశారు. ప్ర‌తిప‌క్ష వైసీపీ, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల‌పై కూడా చుర‌క‌లు వేశారు. అంతే కాకుండా చంద్ర‌బాబు. వైఎస్ జ‌గ‌న్‌ల‌ను ఒకే గాట‌ను క‌ట్టారు. రాహుల్ ఉప‌న్యాసం ఎలా సాగిందో మీరే చూడండి.

కమీషన్ల కోసమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదాను కేంద్రప్రభుత్వం వద్ద తాకట్టు పెట్టారని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టును రాష్ట్రానికెంతో ప్రాధాన్యమైందిగా గుర్తించి ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిగా కేంద్రం నిధులు ఖర్చుచేసేలా చట్టంలో పొందుపరిస్తే చంద్రబాబు కమీషన్లకోసం ఆ ప్రాజెక్టు నిర్మాణాన్ని తామే చేపడతామని చెప్పడం ఎంతవరకు భావ్యమని ప్రశ్నించారు. కమీషన్ల భయంతోనే ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రమివ్వాల్సిన డబ్బులను పూర్తిస్థాయిలో ఇవ్వాలని చంద్రబాబు ధైర్యంగా అడగలేకపోతున్నారని ఆరోపించారు. 2019లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని, వెంటనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయమై నిర్ణయం తీసుకుంటామని రాహుల్ ప్రకటించారు. ప్రధాని మోదీ హిందూ ధర్మ పరిరక్షణకోసం పాటు పడుతున్నట్లు చెబుతూనే.. తిరుపతి వెంకటేశ్వరస్వామి సన్నిధిలో రాష్ట్రానికి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారని, అయితే తర్వాత ఆ హామీని ఎందుకు వెనక్కు తీసుకున్నారో తెలియట్లేదన్నారు. దీన్ని హిందూ ధర్మ పరిరక్షణకు పాటుపడటమంటారా? అని ఎద్దేవా చేశారు.

మోదీ ప్రభుత్వం అంటే ఇక్కడి పార్టీలకు ఏదో భయమున్నట్లు కనిపిస్తోందని, అందుకే వారు రాష్ట్ర ప్రయోజనాలపై ఒత్తిడి తీసుకురావట్లేదని రాహుల్ ఆరోపించారు. కాంగ్రెస్ తోపాటు భరోసా వేదిక పైన ఉన్న పార్టీలకు మోదీ అంటే భయం లేదని, అందుకే హోదా కోసం పోరాటం చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ విధంగా చంద్ర‌బాబు, మోదీల‌పై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేయ‌టంతో పాటుగా జాతీయ నేత‌ల‌ను కూడా స‌భ‌కు ఆహ్వానించారు. స‌మాజ్‌వాది పార్టీ నేత‌, మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేష్ యాద‌వ్‌, రాష్ట్రీయ జ‌నాతాద‌ళ్ నేత శ‌ర‌ద్ యాద‌వ్‌, సీపీఐ జాతీయ నేత‌లు రాజా, సుర‌వరం సుధాక‌ర్‌రెడ్డిలు స‌భ‌లో మాట్లాడారు. ఏపీకి ప్ర‌త్యేక హోదాకు మ‌ద్ద‌తు తెలిపారు. దాంతో ఏపీలోని బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్ల‌దీస్తున్న కాంగ్రెస్ నేత‌ల‌కు కొంత హోప్స్ పెరుగుతున్నాయి.

Add your comment

Your email address will not be published.