మోదీపై రాహుల్ ఘాటు వ్యాఖ్య‌లు

రాహుల్ గాంధీ ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీపై తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. పెద్ద నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో ఈ వ్యాఖ్య‌ల‌కు చాలా ప్రాధాన్య‌త ఏర్ప‌డింది.

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ బ్లాక్ మ‌నీ, అవినీతిని ర‌ద్దు చేయ‌డం కోస‌మే పెద్ద నోట్లు ర‌ద్దు చేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే పెద్ద నోట్ల ర‌ద్దు చేసి నెల రోజులు గ‌డుస్తున్నాయి. కానీ స‌మ‌స్య‌లు పెరుగుతున్నాయి. ప్ర‌జ‌లంతా క్యూల్లోనే కాలం వెల్ల‌దీస్తున్నారు. ఇప్ప‌టికే వంద మంది చ‌నిపోయార‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్షాలు పార్ల‌మెంట్‌లో భేటీ అయ్యాయి. మోదీపై మండిప‌డ్డాయి. ఈ సంద‌ర్భంగా రాహుల్ చేసిన వ్యాఖ్య‌లు ప‌రిస్థితికి అద్దంప‌డుతున్నాయి.

పెద్దనోట్లను రద్దు చేస్తూ దేశ ప్రధాని నరేంద్రమోడీ అనాలోచిత నిర్ణయం తీసుకున్నారని ఎంపి, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మండిపడ్డారు. నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని గురువారం నాటికి నెల పూర్తయింది. ఈ సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడారు. ప్రధాని తప్పుడు నిర్ణయం వల్ల దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ను సజావుగా నడిపే బాధ్యత ప్రభుత్వం, స్పీకర్‌దేనని, ప్రతిపక్షాలది కాదని ఆయన స్పష్టం చేశారు. బ్లాక్ మ‌నీ, అవినీతి ర‌ద్దు, టెర్ర‌రిజం అడ్డుకుంటామ‌ని చెప్పిన మోదీ ఇప్పుడు మాట మార్చార‌ని ఆయ‌న దుయ్య‌బ‌ట్టారు. బ్లాక్ మ‌నీ ఎక్క‌డ‌ని ఆయ‌న నిల‌దీశారు. మోదీ సుకున్న నిర్ణ‌యం తెలివి త‌క్కువ నిర్ణ‌యంగా అభివ‌ర్ణించారు.

Add your comment

Your email address will not be published.