గౌత‌మ్ రెడ్డి ర‌చ్చ‌వెన‌క అస‌లు ర‌హ‌స్యం ఇదా? | Reason Behind Gautham Reddy’s Political Game

Gautam Reddy, who has become a political hot topic in the AP, is now interested in the facts of Vanagvati Radhakrishna’s case.click on the below video to know more details of Reason Behind Gautham Reddy’s Political Game.

ఏపీలో పొలిటిక‌ల్ హాట్ టాపిక్ గా మారిన గౌత‌మ్ రెడ్డి, వంగ‌వీటి రాధాకృష్ణ వ్య‌వ‌హారంపై ఇప్పుడు ఆస‌క్తిగొలిపే వాస్త‌వాలు బ‌య‌ట‌పడుతున్నాయి.

ప‌క్కా ప్లాన్ తోనే గౌత‌మ్ రెడ్డి ఈ ర‌చ్చ‌కు కార‌ణ‌మ‌య్యార‌నే వాద‌న‌లు ఇప్పుడు తెర‌పైకి వ‌స్తున్నాయి. అయితే ఇంత‌గా ర‌చ్చ చేసుకోవ‌డానికి గౌత‌మ్ రెడ్డికి ఏం ప‌ని ఉందో తెలియాలంటే మాత్రం గ‌తంలో జ‌రిగిన ప‌రిణామాల‌ను ఒక‌సారి చూడాల్సిందే..నిన్న మొన్న‌టి వ‌ర‌కు గౌతం రెడ్డి పేరు కేవ‌లం విజ‌య‌వాడ రాజ‌కీయాలకు మాత్ర‌మే ప‌రిమితం అయింది. కానీ, వంగ‌వీటి రంగాపై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌తో రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌కు వ‌చ్చారు. నిజానికి రంగా త‌న‌యుడు రాధాకృష్ణ‌ అన్న‌ట్టు.. రంగాను విమ‌ర్శించే స్థాయి గౌతం రెడ్డికి లేద‌ని ఇటు టీడీపీ నేత‌లు, అటు వైసీపీ నేత‌లు కూడా అభిప్రాయ‌ప‌డుతున్నారు. అనూహ్య కార‌ణాల నేప‌థ్యంలోసీపీఐ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆయ‌న త‌రువాత పెద్ద‌గా పాపులార్టీ సంపాధించుకోలేక‌పోయారు. దీంతో ఆయ‌న గురించి రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ జర‌గాల‌నే ఉద్దేశ్యంతోనే ఇలా చేశార‌ని తెలుస్తోంది.2014లో వైసీపీ త‌ర‌ఫున విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టికెట్ సంపాయించుకుని పోటీ చేసినా.. భారీ తేడాతో ప‌రాజ‌యం పాల‌య్యాడు. గౌతం రెడ్డికి అసెంబ్లీకి పోటీ చేసేంత స్థాయి లేద‌ని అప్ప‌ట్లో జ‌గ‌న్ చేసిన స‌ర్వేలో తెలిసిందట‌. అయినా స‌రే ఇంక క్యాండెట్లు లేక‌పోవడంతో గౌతంకే టికెట్ ఇచ్చారు జ‌గ‌న్‌. ఇక‌, ఇప్పుడు ప‌రిస్థితి మారింది.

ఎలాగైనా 2019లో అధికారంలోకి రావాల‌ని గ‌ట్టి ప‌ట్టుమీదున్న జ‌గ‌న్‌.. గెలుపు గుర్రాల‌ను ప్రోత్స‌హించే ప‌నిలో ప‌డ్డారు. ఈ క్ర‌మంలోనే సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో గ‌ట్టి ప‌ట్టున్న బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌ల్లా ది విష్ణును పార్టీలోకి తీసుకున్నారు.దీంతో ఇక‌, త‌న‌కు 2019లో పార్టీ టికెట్ ద‌క్క‌ద‌ని నిర్ణ‌యించుకున్న గౌతం రెడ్డి తెర‌వెనుక త‌న ప్లాన్ తాను రెడీ చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఎలాగూ ఏపీలో ఎద‌గాల‌ని నిర్ణ‌యించుకున్న బీజేపీలోకి చేర‌డం ద్వారా సెంట్ర‌ల్ టికెట్‌ను ద‌క్కించుకోవాల‌ని ఆయ‌న ప్లాన్ వేసుకున్నార‌ట‌. అయితే గౌత‌మ్ రెడ్డి పార్టీ మారితే మీడియాలో కేవ‌లం జిల్లా స్థాయి వ‌రకు మాత్రం వ‌స్తుంది. కానీ త‌న‌కు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రాదు. ఇది మ‌న‌సులోపెట్టుకున్న గౌత‌మ్ రెడ్డి త‌న వ్యూహాన్ని ప‌క్కాగా అమ‌లు ప‌రిచార‌ట‌. ఈ క్ర‌మంలోనే పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు విజ‌య‌వాడ‌లో మోస్ట్ పాపుల‌ర్ లీడ‌ర్ అయిన రంగాపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ప‌క్కా ప్లాన్ ప్ర‌కార‌మే మీడియాలో ఇలా వ్యాఖ్యానించార‌ని గుస‌గుస‌లు వినబ‌డుతున్నాయి. దీంతో రాష్ట్ర‌వ్యాప్తంగా గౌతం రెడ్డి ఎవ‌రు? అని చ‌ర్చ వ‌చ్చేలా ఇలా రెండు విధాలా ప్లాన్ వేసి స‌క్సెస్ అయిన‌ట్టు తెలుస్తోంది.ఈ విధంగా ఆయ‌న‌పై పొలిటిక‌ల్ చ‌ర్చ‌జ‌ర‌గ‌డంతో ఇక పార్టీలో కూడా త‌న‌కు మంచి పొజిష‌న్ ఉంటుంద‌ని భావించార‌ట‌. ఇక తాజాగా జ‌రిగిన ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఇక తాను అనుకున్న మైలేజీ రావ‌డంతో విజ‌య‌వాడ‌లో పొలిటిక‌ల్ చ‌క్రం తిప్పవ‌చ్చ‌ని భావిస్తున్నార‌ట‌. తాను పార్టీ మారితే ఓ సెన్సెషిన‌ల్ కావాల‌ని అదును చూసి మ‌రి ఇలాంటి కామెంట్స్ చేశారని తెలుస్తోంది. మొత్తానికి రాజ‌కీయాంగా చ‌ర్చ‌ల్లో నిల‌వ‌డంలో స‌క్సెస్ అయిన గౌత‌మ్ రెడ్డి త‌న ప‌ర‌ప‌తిని భ‌విష్య‌త్ లో పెంచుకోవ‌డంలో స‌క్సెస్ అవుతారా..? ఇత‌ర పార్టీ నుంచి ఆయ‌న గెలుపొంద‌డం సాధ్యామేనా అనేది మాత్రం భ‌విష్య‌తే నిర్ణ‌యించాలి…!

Add your comment

Your email address will not be published.