కేంద్ర‌మంత్రులుగా వారిని తీసుకోవ‌డానికి కార‌ణం|Reason Why Modi SELECTED These CABINET Ministers

admin
minister

The Union Cabinet reorganization has given a big jalak to the BJP leaders in the country … Prime Minister Modi is looking at the senior sections of the BJP, which is his own party.Click on the below video to know more details for Reason Why Modi SELECTED These CABINET Ministers

కేంద్ర కేబినెట్ పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ దేశంలోని బీజేపీ నేతల‌కు భారీ ఝ‌ల‌క్ ఇచ్చింది… ప్ర‌ధాని మోదీ తీరు చూస్తుంటే త‌న సొంత పార్టీ అయిన బీజేపీ సీనియ‌ర్ నేత‌ల‌పై ఆయ‌న‌కు రోజురోజుకు న‌మ్మ‌కం త‌గ్గిపోతున్న‌ట్టు ఉంద‌ని ఢిల్లీ వ‌ర్గాలు భావిస్తున్నాయి…

కేంద్ర మంత్రులుగా ఉండి ప‌ని తీరును మెరుగు ప‌రుచుకోలేని వారికి ఉద్వాస‌న పలికి ప్ర‌జ‌ల‌కు చేరువ‌గా ప‌థకాల‌ను తీసుకువెళ్లే స‌మ‌ర్థుల‌కు రెడ్‌కార్పెట్‌ వేశారు… తొమ్మిదిమంది కొత్త మంత్రుల్లో ఏకంగా న‌లుగురు మాజీ అధికారులు ఉండ‌డం గ‌మ‌నార్హం…. ఆలిండియా స‌ర్వీసుల‌కు చెందిన‌వీరిలో ఇద్ద‌రు మాజీ ఐఏఎస్‌లు, ఓ మాజీ ఐపీఎస్‌, ఓ మాజీ ఐఎఫ్ఎస్ అధికారి ఉన్నారు… మాజీ ఐఏఎస్‌లు రాజ్‌కుమార్‌సింగ్, అల్ఫాన్స్ క‌న్నంథ‌న‌మ్‌లు బీహార్‌, కేర‌ళ కోటా నుంచి మంత్రి ప‌ద‌వులు ద‌క్కించుకున్నారు.. మాజీ ఐఎఫ్ఎస్ అధికారి హ‌ర్దీప్‌సింగ్ పూరి పంజాబ్ కోటా నుంచి కేంద్ర‌మంత్రి అయ్యారు… మాజీ ఐపీఎస్ స‌త్య‌పాల్‌సింగ్‌కు యూపీ కోటాలో మంత్రి ప‌ద‌వి కేటాయించారు… వీళ్ల‌లో ఒక్క రాజ్‌కుమార్‌సింగ్ మాత్ర‌మే బీహార్ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు… మిగిలిన ముగ్గురికి లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌ల్లో స‌భ‌త్య‌త్వం లేదు….వీళ్ల‌కు మంత్రి ప‌ద‌వులు వ‌స్తాయ‌ని హ‌స్తిన‌లో రోజూ హ‌ల్‌చ‌ల్ చేసే రాజకీయవ‌ర్గాలు కూడా క‌నిపెట్ట‌లేక‌పోయాయి.కేంద్ర కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌లో మోదీ వ్య‌వ‌హ‌రించిన తీరు చూస్తుంటే ఆయ‌న త‌న సొంత పార్టీ నేత‌ల కంటే మాజీ అధికారులనే ఎక్కువ‌గా న‌మ్ముతున్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌డంలో లీట‌ర్ల కంటే మాజీ అధికారులే న‌య‌మ‌ని, బాగా పనిచేసి త‌న ప్ర‌భుత్వానికి ఎక్కువ మార్కులు తెచ్చిపెడతార‌ని, ఆయ‌న భావించిన‌ట్టు చెబుతున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం ఇప్పటి వ‌ర‌కు తీసుకున్న నిర్ణ‌యాల మేలును చాలా మంది ప్ర‌జ‌ల‌కు చెప్ప‌లేక‌పోయార‌ని మోడీ వీరిపై గుర్రుగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇక మాజీ కేంద్ర మంత్రి బండార ద‌త్తాత్రేయ కార్మిక మంత్రిగా ఉన్న‌కేంద్రం స‌మ‌కూర్చిన ప‌థ‌కాల‌ను ఆయ‌న ఏనాడు స‌మ‌ర్థ‌వంతంగా చెప్ప‌లేదు. ఇక ఇప్ప‌టికి మోడీ న‌ల్ల‌ధ‌నం, అవినీతిర‌హిత స‌మాజం, డిజిట‌ల్ సేవ‌లు, స్వ‌చ్ఛ భార‌త్, మేకిన్ ఇండియా లాంటి పేర్ల‌తో మాత్ర‌మే ముందుకు వ‌చ్చారు.గ్రామీణ ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మ‌య్యే సంక్షేమ, ఉచిత ప‌థ‌కాలు తీసుకురాలేదు. అయితే ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాద‌న్నర గ‌డువు మాత్ర‌మే ఉంది. దీంతో సంక్షేమ ప‌థ‌కాలే ఎక్కువ‌గా ఓటింగ్ ను ప్రాభావితం చేస్తాయి కాబ‌ట్టి ఈ మిగిలిని స‌మయంలో ప్ర‌జ‌ల‌కు కావాల్సిన సేవ‌ల‌నుచేయాలి. ఇలా చేయాలి… అంటే వాటిని ప‌క్కాగా అమ‌లు చేసేవారు కావాలి. ఈ వ‌రుస‌లో రాజ‌కీయనేత‌ల కంటే అధికారులే ఎక్కువ అవ‌గాహ‌న క‌లిగిన వారు ఉంటారు. సంక్షేమ ప‌థ‌కాల‌ను క్షేత్ర స్థాయిలోకి తీసుకువెళ్ల‌డంలో వారూ త‌ల‌పండి ఉంటారు. దీంతో ఈ విష‌యాల‌ను గుర్తుంపెట్టుకున్న ప్ర‌ధాని ప్ర‌భుత్వ అధికారుల‌కు ఈసారి స్థానం క‌ల్పించారు. వారంద‌రిని ఉప‌యోగించుకొని వారి క‌నుస‌న్న‌ల్లో సంక్షేమ ప‌థ‌కాలు ఎలా చేరాలి, వాటిపై ప్ర‌చారం ఎలా నిర్వ‌హించాలి, అధికారుల‌తో ఎలా ప‌నిచేయించాల‌నేదానిపై దృష్టిపెట్ట‌నున్నార‌ట‌. అందుకే వారి ఈ సారి కేంద్ర మంత్రి ప‌దవులు ద‌క్కాయానే వాద‌న‌లు వినిపిస్తున్నాయి. దీంతో ఇక నుంచి మోడీ ఎక్కువ‌గా సంక్షేమంపైనే ఎక్కువ దృష్టిపెట్టే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. నోట్ల ర‌ద్దు మోడీకి పెద్ద‌గా మైలేజీని ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆయ‌న సంక్షేమం బాట‌ను ఎంచుకున్నార‌ని విశ్లేష‌కులు అంటున్నారు. మొత్తానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఒక ర‌కంగా త‌న పాల‌నా మార్కును చూపించిన మోడీ ఇప్పుడు మ‌రో ర‌కం బాట‌లో ప్ర‌జ‌ల‌కు చేరువై ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మౌతున్న‌ట్లుగా తెలుస్తోంది. 2019 ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకొనే ఈసారి మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రిగింద‌ని తెలుస్తోంది. ఇక నుంచి మంత్రుల‌కు ప‌రుగులే అని ప్ర‌జ‌ల్లోకి ప్ర‌తీ ఒక్క‌రు వెళ్లి ప‌నిచేయాల్సిన టాస్క్ లే ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు. చూడాలి మ‌రి మోడీ తీసుకున్న ఈ స్టాండ్ ఎంత వ‌ర‌కు సక్సెస్ అవుతుందో….

Tags : , , , , , , , , , , , , , , , , , , , ,