ఢిల్లీ నుంచి రాగానే ఏపీకి కేసీఆర్ కార‌ణ‌మిదే! | Reason Why Telangana CM KCR is Going to AP Revealed

admin
delhi

Telangana Chief Minister Chandrashekhar Rao seems to have finalized the Andhra Pradesh tour.click on the below video to know more details of Reason Why Telangana CM KCR is Going to AP Revealed

తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది.

ఆయ‌న ఈ నెల 27న‌ విజయవాడలలో పర్యటించనున్నారని సమాచారం.విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మ వారికి కేసీఆర్‌ మొక్కులను చెల్లించనున్నారని తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్రం సిద్ధిస్తే.. పలు దేవాలయాలను సందర్శిస్తానని, మొక్కులు చెల్లించుకుంటానని కేసీఆర్ మొక్కుకున్న విషయం తెలిసిందే.అందులో భాగంగా ఇప్పటికే వరంగల్‌ భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటాన్ని సమర్పించారు. ఇప్పుడు విజయవాడ కనకదుర్గా అమ్మవారి ఆలయాలను సందర్శించాల్సి ఉంది కేసీఆర్.ఈ నేపథ్యంలోనే ఆయన ఈ నెల 27న దేవాలయాల సందర్శనకు ఏపీకి బయల్దేరనున్నట్లు తెలిసింది.కాగా, ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు హాజరైన సమయంలోనే.. సీఎం కేసీఆర్‌, విజయవాడ అమ్మ వారి ఆలయాన్ని సందర్శిస్తారని అనుకున్నా అప్పుడు వాయిదా పడింది.దీంతో ద‌స‌రా ఉత్స‌వాల‌లో ఆంధ్రాలోని విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ స‌న్నిధిలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంద‌డి చేయ‌నున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర‌స్వామికి, బెజ‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ‌కు, కుర‌వి వీర‌భ‌ద్ర‌స్వామి, వరంగ‌ల్ భ‌ద్ర‌కాళీ అమ్మ‌వారికి, తిరుచానూరు ప‌ద్మావ‌తి అమ్మ‌వారికి మొక్కులు మొక్కుకున్నారు.

తిరుప‌తి మొక్కుల త‌రువాత ఆంధ్రాలోని క‌న‌క‌దుర్గ‌మ్మ‌కు ఈ నెల 27న ముక్కుపుడ‌క స‌మ‌ర్పించుకునేందుకు కేసీఆర్ ప‌ర్య‌ట‌న ఖ‌రారు అయిన‌ట్లు స‌మాచారం.ఢిల్లీలో కంటి శ‌స్త్ర‌చికిత్సకు వెళ్లిన కేసీఆర్ అక్క‌డి నుండి వ‌చ్చిన త‌రువాత‌ దేవి న‌వ‌రాత్రుల సంధ‌ర్భంగా విజ‌య‌వాడ పర్య‌ట‌నను ఖ‌రారు చేయ‌నున్నారు. ఈ నెల 27న ఆంధ్రా ప్ర‌భుత్వం అమ్మ‌వారికి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించ‌నుంది. అదే స‌మ‌యంలో కేసీఆర్ ముక్కుపుడ‌క స‌మ‌ర్పించ‌నున్నార‌ని తెలుస్తుంది. ఆంధ్రా ప్ర‌భుత్వం ఈ మేర‌కు కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌కు ఏర్పాట్లు చేస్తుంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ఏర్పాట్లు ఏవి జ‌ర‌గ‌క‌పోయిన‌ప్ప‌టికీ ఆరోజు ఖ‌చ్చితంగా వెళ్లే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ మాసంలో అమ్మ‌వారికి ముక్కుపుడ‌క ఇవ్వ‌డం మంచిద‌ని భావించిన కేసీఆర్ ఖ‌చ్చితంగా న‌వ‌రాత్రుల్లో ద‌ర్శ‌నం త‌ప్ప‌ద‌ని అంటున్నారు. దీంతో చాలా రోజుల త‌రువాత కేసీఆర్ ఏపీకి వెళ్తుడ‌టంతో అంద‌రి దృష్టి ఇప్పుడు అటు వైపు ప‌డింది. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌రువాత చాలా కాలంగా ఇరు రాష్ట్రాల సీఎంలు క‌లుసుకున్న‌ది చాలా త‌క్కువ అయితే కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌తో మ‌ళ్లీ రెండు రాష్ట్రాల మ‌ధ్య సంబంధాలు ఇంకా బ‌ల‌ప‌డ‌తాయ‌ని అంటున్నారు..

Tags : , , , , , , , , , , , , , , , , , ,