వైఎస్ జ‌గ‌న్ లండ‌న్ టూర్ ఎందుకో తెలుసా? | Reason Why YS Jagan is Going to LONDON Revealed

admin
ysjagan

AP Opposition Leader YS Jaganmohan Reddy has been specially interested in the tour of the ruling party. click on the below video to know more details of Reason Why YS Jagan is Going to LONDON Revealed

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి టూర్ల‌పై అధికార ప‌క్షంతో పాటు అనేక మంది ప్ర‌త్యేకంగా ఆస‌క్తిక‌న‌బ‌రుస్తూ ఉంటారు.

వైఎస్ జ‌గ‌న్‌పై కాంగ్రెస్ ప్ర‌భుత్వం హ‌యాంలో న‌మోదు అయిన సీబీఐ కేసులు. ఈడీ కేసుల నేప‌థ్యంలో ఆయ‌న ఏ దేశం టూర్ వెళ్లినా కూడా ప్ర‌త్యేకమైపోతుంది. గ‌తంలో కూడా జ‌గ‌న్ లండ‌న్ వెళ్లారు. జ‌గ‌న్ లండ‌న్ టూర్ పై టీడీపీ పార్టీ నేత‌లు నిఘా పెట్టిన‌ట్లుగా కూడా వార్త‌లు వ‌చ్చాయి. ఆయ‌న వ్య‌క్తిగ‌తంగా ఎక్క‌డికి వెళ్లినా కూడా అటువంటి నిఘా కొన‌సాగుతుంది.

తాజాగా వైఎస్ జ‌గ‌న్ మ‌రోసారి లండ‌న్ టూర్‌కు సిద్ద‌ప‌డుతున్నారు. ఇది పూర్తిగా జ‌గ‌న్ కుటుంబానికి సంబంధించింది. ఇంకా స్ప‌ష్టంగా చెప్పాలంటే జ‌గ‌న్ కుమార్తె చ‌దువు ప‌ని మీద ఆయ‌న లండ‌న్ టూర్ వెళ్తున్నారు. ఇటీవ‌ల జ‌గ‌న్ పెద్ద కుమార్తె అంత‌ర్జాతీయంగా పేరొందిన లండ‌న్ స్కూల్ ఆఫ్ ఎక‌నామిక్స్‌లో సీటు సాధించిన సంగ‌తి తెల్సిందే. ఆమెను అక్క‌డ జాయిన్ చేయ‌టానికి ఆయ‌న వె ళ్తున్నారు. ఈ నెల 11వ తేదీ బ‌య‌లు వెళ్తున్న జ‌గ‌న్ తిరిగి ఈ నెల 19వ తేదీన వ‌స్తారు.

జ‌గ‌న్ కుమార్తె వ‌ర్ష ఈ ప్రెస్టెజియ‌స్ సంస్ధ‌లో మెరిట్ లో స్ధానం సాధించ‌టంతో ఏపీలో సీఎం చంద్ర‌బాబు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో స‌హా ప‌లువురు ఆమెను అభినందించారు. వైఎస్ జ‌గ‌న్‌కు మంచి పేరే వ‌చ్చింది. రాజ‌కీయాల్లో త‌ల‌మున‌కై ఉన్న‌ప్ప‌టికీ కూడా ఆయ‌న పిల్ల‌ల‌ను బాగా చ‌దివించార‌ని ప‌లువురు అభినందించిన సంగ‌తి తెల్సిందే.

Tags : , , , , , , , , , , , , , , , ,