టెన్త్ ప‌ది సార్లు ఫెయిలైతే సీనియార్టీనా? బాబు సీనియార్టీ అటువంటిదే !

admin
roja

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుపై వైసీపీ ఫైర్ బాండ్ రోజా సెటైర్లు వేశారు. త‌నే సీనియ‌ర్‌నంటూ మాట్లాడుతున్న తీరుపై రోజా పంచ్‌ల మీద పంచ్‌లు వేస్తూ లాజిక‌ల్ కౌంట‌ర్ ఇచ్చారు.

చంద్రబాబు వ్యాఖ్య‌ల‌ పై ఆర్ కె రోజా పంచ్ డైలాగ్స్‌తో చెల‌రేగిపోయారు. దేశం మొత్తం మీద సీనియర్ తానే అని చంద్రబాబు చెప్పుకోవటాన్నిరోజా త‌న‌దైన శైలీలో తిప్పి కొట్టారు.. సిఎంకు కావాల్సింది సీనియారిటీ కాదని, సిన్సియారిటీ అన్నారు. ప‌ది సార్లు ఫెయిల్ అయితే అది సీనియార్టీ అవ‌ద‌న్నారు. అది ఫెల్యూర్ అంటార‌న్నారు. అదే సందర్భంలో వినేవాడు వెర్రివాడైతే….చెప్పేవాడు చంద్రబాబు అనే సామెత చంద్రబాబును ఉద్దేశించి రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారంలో ఉందన్నారు. ప్రత్యేకహోదా వల్ల ఉండే ఉపయోగాలుంటో వైసీపీ ఎంఎల్ఏ రోజా ముఖ్యమంత్రికి వివరించారు. హోదా వల్ల ఏం ఉపయోగాలున్నాయో నిజంగా చంద్రబాబు తెలుసుకోవాలని ఉంటే టిడిపి నేతలు సుజనా చౌదరి, గల్లా జయదేవ్ లాంటి వాళ్ళను అడిగితే తెలుస్తుందన్నారు. హోదా వల్ల ఏం ఉపయోగాలుంటాయని వారు హిమాచల్ ప్రదేశ్ కు వెళ్ళి పరిశ్రమలు పెట్టారో అడిగితే వాళ్ళే చెబుతారంటూ రోజా ఎద్దేవా చేసారు.

హోదా వల్ల ఏమీ ఉపయోగం లేకపోతే, పోయిన ఎన్నికల్లో ప్రత్యేకహోదా 15 ఏళ్ళు కావాలని ఎందుకు డిమాండ్ చేసారో చెప్పాలని నిలదీసారు. శాసనసభ మొదటి సమావేశంలోనే ప్రత్యేకహోదా, ప్యాకేజి రెండూ కావాలంటూ కేంద్రాన్ని ఎందుకు డిమాండ్ చేశారంటూ ప్రశ్నించారు. ఓటుకునోటు కేసులో ఇరుక్కున తర్వాతే ప్రత్యేకహోదా విషయంలో చంద్రబాబుపై స్వరం మార్చారంటూ ధ్వజమెత్తారు. హోదాపై పూర్తిస్ధాయిలో పోరాటాలు చేస్తోంది ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమేనన్నారు. రెవిన్యూలోటును బర్తీ చేయమని చంద్రబాబు కేంద్రాన్ని గట్టిగా అడిగే స్ధితిలో లేరంటే భయపడటం నిజంగా సిగ్గు చేటన్నారు. సీనియారిటీనే ముఖ్యమంటే చంద్రబాబు కన్నా యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజులు సీనియార్లు అన్నారు..

మోడి ప్రధానమంత్రి అవుతారని ఊహించని కారణంగానే గోద్రా అల్లర్ల నేపధ్యంలో మోడిని అరెస్టు చేయిస్తానని చంద్రబాబు చేసిన ప్రకటనను రోజా గుర్తు చేసారు. ప్రత్యేకహోదాను తాకట్టు పెట్టటం వల్ల రాష్ట్రం, యువత భవిష్యత్తును కాలరాస్తున్నట్లు చంద్రబాబుపై మండిపడ్డారు. ప్రత్యేకహోదాపై కలిసి వచ్చే అన్నీ పార్టీలతో పోరాటాలు చేస్తామని రోజా స్పష్టం చేసారు

తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేకహోదా కావాలని ఎందుకు అడిగారని నిలదీశారు. పదేళ్లు కాదు 15 ఏళ్లు కావాలని డిమాండ్ చేసిన సంగతి మరిచారా అని అడిగారు. ప్రత్యేకహోదా వల్ల లాభాలు తెలియాలంటే ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టిన టీడీపీ నేతలను అడగాలని చంద్రబాబుకు సూచించారు. ప్రత్యేక ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి ఏమి సాధించారని ప్రశ్నించారు. ప్రత్యేకహోదా విషయంలో వెనకడుగు వేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. విశాఖ భూకబ్జా దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని.. లోకేశ్ మంత్రులు, ఎమ్మెల్యేలే సూత్రధారులని ఆరోపించారు. విశాఖ భూకుంభకోణంపై సీబీఐ విచారణకు ఎందుకు వెనుకాడుతున్నారని ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు

Tags : , , , , , , , , , , ,