ఎస్బీఐ ఖాతాదార్లు బెంబేలు,, అన్నింటికీ భాదుడే

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారుల‌పై వ‌ర‌స వ‌డ్డ‌న‌తో బెంబేలెత్తున్నారు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారుల‌పై వ‌ర‌స వ‌డ్డ‌న‌తో బెంబేలెత్తున్నారు. క‌నీస బ్యాలెన్స్ రూ. 5000 ఉండాల‌ని నిబంధ‌న పెట్టిన ఎస్బీఐ ఇప్పుడు స‌ర్వీస్ ఛార్జిల‌ను దారుణంగా పెంచేసింది. దీంతో ఎస్బీఐ ఖాతాదార్లు బెంబేలెత్తున్నారు.

ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా) కొత్త చార్జీలను ప్రకటించింది. ఎటిఎం విత్‌డ్రా, ఆన్‌లైన్ లా వాదేవీలు, చెక్ బుక్ జారీ వంటి వివిధ బ్యాంకింగ్ సేవ లపై చార్జీలను నిర్ణయించింది. ఈ కొత్త నిబంధనలు జూన్ 1(గురువారం) నుంచి అమల్లోకి వచ్చాయి. ఎటిఎం నగదు విత్‌డ్రాలు, ఆన్‌లైన్ లావాదేవీలు, చెక్‌బు క్‌ల జారీలు వంటి సేవల చార్జీలను సవరించారు. బ్యాంక్ మొబైల్ వ్యాలెట్ యాప్ ద్వారా ఎటిఎం నుంచి విత్‌డ్రా చేసుకుంటే రూ.25 ఛార్జీ వసూలు చేస్తారు.

వీటితోపాటు బ్యాంకుల బ్రాంచిలు, ఎటిఎంల నుంచి నగదు డ్రా చేసినప్పుడు కూడా ఎస్‌బిఐ ఛార్జిలు విధించనుంది. నెలలో తొలి నాలుగు బ్యాంక్ లావాదేవీలకు ఎటువంటి ఛార్జీలు ఉండవు. ఆ తర్వాత నుంచి జరిపే ప్రతీ బ్యాంకు లావాదేవికి రూ.50 సేవా పన్ను విధి స్తారు. ఆ తర్వాత నుంచి ఇతర బ్యాంకుల ఏటీఎం నుం చి డ్రా చేస్తే రూ.20, ఎస్‌బిఐ ఎటిఎం నుంచి డ్రా చేస్తే రూ.10 చెల్లించాల్సి ఉంది. ఇక సాధారణ సేవింగ్స్ ఖాతాలపై ఎనిమిది ఉచిత ఎటిఎం లావాదేవీలు ఉం టాయి. ఎస్‌బిఐ ఎటిఎంలలో 5, ఇతర ఎటిఎంలలో 3 లావాదేవీలు కొనసాగు తాయి

10 చెక్కులు ఉన్న బుక్‌కు రూ.30 ప్లస్ సేవా పన్ను, 25 చెక్కులు ఉన్న బుక్‌కు రూ.75 ప్లస్ సేవా పన్ను
50 చెక్కులు ఉన్న బుక్‌కు రూ150 ప్లస్ సేవా పన్ను

ఒక్క రూపే క్లాసిక్ కార్డు మాత్రమే ఉచితంగా జారీ

నెలలో నాలుగు ఎటిఎం విత్‌డ్రాలకు ఎలాంటి పన్ను ఉండదు. విత్‌డ్రాలు దాటి జరిపే ప్రతి లావాదేవిపై రూ.50 ప్లస్ సేవా పన్ను
ఇతర బ్యాంక్ ఎటిఎంల వద్ద డ్రాచేస్తే రూ.20, ఎస్‌బిఐ ఎటిఎంల నుంచి డ్రా చేస్తే రూ.10

సత్వర చెల్లింపు సేవ, యూనిఫైడ్ పేమెంట్ ట్రాన్స్ ఫర్, ఐయూఎస్‌ఎస్‌డీ లావాదేవీలకు రూ.లక్ష వరకూ రూ.5 చొప్పున
రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు రూ.15, రూ.2 నుంచి రూ.5 లక్షల వరకు రూ.25 ఛార్జి
వ్యాలెట్‌లోని బ్యాలెన్స్‌ను ఎటిఎం నుంచి డ్రా చేసు కుంటే రూ.25

ఈ ర‌కంగా ఎస్బీఐ ఖాతారుల న‌డ్డి విరిచే కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది. ఈ దారిలో ప్రైవేట్ బ్యాంకులు మ‌రింత‌గా ఖాతాదారుల న‌డ్డి విరిచే కార్య‌క్ర‌మాన్ని చేప‌డ‌ట్ట‌కుండా ఉంటాయా?

Add your comment

Your email address will not be published.