ఖైరతాబాద్ వినాయ‌కుడి నిమ‌జ్జ‌నం వెన‌కర‌హ‌స్యం తెలుసా? |SECRET Behind Khairtabad Ganesh IMMERSION

Ganesha is very important in our country. Everyone mixes together and makes the idols immersed in the river or in the sea after worshiping it.click on the below video to know more details of SECRET Behind Khairtabad Ganesh IMMERSION

మ‌న దేశంలో వినాయ‌క చ‌వితికి చాలా ప్రాముఖ్య‌త ఉంది. అంద‌రూ క‌లిసిమెలిసి వినాయ‌క ప్ర‌తిమ‌ల‌ను ప్ర‌తిష్టించి పూజ‌లు చేసిన త‌రువాత నదిలో కాని సముద్రంలో కాని నిమజ్జనం చేస్తారు.

సాధారణంగా ఐదవరోజు లేదంటే తొమ్మిది,పదకొండవ రోజుల్లో ఈ నిమజ్జన కార్యక్రమం చేస్తారు.కానీ ఈ సారి ఖైరతాబాద్ వినాయకున్ని పన్నెండో రోజున అంటే సెప్టెంబర్ 5వ తేదిన నిమజ్జనం చేస్తున్నారు. అయితే దీనికంటే ముందు వినాయ‌క చ‌వితి, నిమ‌జ్జ‌నం గురించి కూడా కొన్ని విష‌యాలు తెలుసుకోవాల్సి ఉంది. వినాయక చవితి సంప్రదాయం యావత్తూ, ప్రకృతికి అనుగుణంగానే సాగుతుంది. నదులలోను, వాగులలోను దొరికే ఒండ్రుమట్టితో ఆ స్వామి ప్రతిమను రూపొందిస్తారు. ఇక వినాయకుడి పూజ కోసం మట్టి విగ్రహం, పత్రాలు ఉపయోగించడం వెనక మరో కారణం కూడా కనిపిస్తుంది. ఒండ్రు మట్టిలోనూ, పత్రాలలోనూ ఔషధి గుణాలు ఉంటాయి. గణపతికి చేసే షోడశోపచార పూజలో భాగంగా మాటిమాటికీ ఈ విగ్రహాన్నీ, పత్రాలనూ తాకడం వల్లా… వాటిలోని ఔషధి తత్వం మనకి చేరుతుంది. పూజ ముగిసిన తర్వాత ఓ తొమ్మిది రోజుల పాటు ఆ విగ్రహాన్నీ, పత్రాలనూ ఇంట్లో ఉంచడం వల్ల… చుట్టూ ఉన్న గాలిలోకి ఆ ఔషధి గుణాలు చేరతాయి.ఇలా తొమ్మిది రోజుల పాటు విగ్రహాన్నీ, పత్రాలనీ ఇంట్లో ఉంచుకున్న తర్వాత…. దగ్గరలో ఉన్న జలాశయంలో కానీ బావిలోకానీ నిమజ్జనం చేస్తాము.

ఇదిలా ఉంటే వినాయక చవితి నాటికి వర్షాలు ఊపందుకుంటాయి. వాగులూ, నదులూ ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటాయి.అలాంటి సమయంలో తీరం వెంబడి మట్టి విగ్రహాలను నిమజ్జనం చేయడం వల్ల వరద పోటు తగ్గే అవకాశం ఉంటుంది. పైగా ఈ కాలంలో ప్రవహించే నీటిలో క్రిమికీటకాలు ఎక్కువగా ఉంటాయని అంటారు. నిమజ్జనంలో విడిచే పత్రితో నీరు కూడా క్రిమి రహితంగా మారిపోతుందన్నది పెద్దల మాట. అందుకే రంగురంగుల వినాయ‌కుల కంటే మ‌ట్టి వినాయ‌కులే మంచిద‌ని అంటున్నారు చాలా మంది. ఇక ఇదిలా ఉంచితే ఈ ఏడాది 12 రోజు వినాయ‌క నిమ‌జ్జ‌నం చేయ‌డం వెన‌క ఓ బ‌ల‌మైన‌కార‌ణం కూడా ఉంది. అందుకే అత్యంత పెద్ద వినాయ‌కుడిగా పేరుతెచ్చుకున్న ఖైరాతాబాద్ వినాయ‌కుడిని కూడా 12 వ‌రోజే నిమ‌జ్జ‌నం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఏడాది అనంత చతుర్దశి ఏరోజు వస్తే అప్పుడు ఖైరతాబాద్ వినాయకున్ని నిమజ్జనం చేసేవారు. అయితే ఈ సారి పన్నెండు రోజులకు వస్తుంది.కాబట్టి ఎన్ని రోజులు అనేది పరిగణనలోకి తీసుకోకుండా అనంత చతుర్దశి నాడే నిమజ్జనం చేయాలని గణేశ్ ఉత్సవకమిటీ నిర్ణయించింది.దీంతో ఈ సారి వినాయ‌క నిమ‌జ్జ‌నం 5వ తేదీన జ‌రుగుతుంది. ఇక ఇదే రోజు హైదరాబాద్ లోని చాలా విగ్ర‌హాలు నిమ‌జ్జ‌నం కానున్నాయి. ఇప్ప‌టికే కొంత మంది నిమ‌జ్జ‌నంచేసిన‌ప్ప‌టికీ అనంత చ‌తుర్ధ‌శి కోసం వేచి చూస్తున్న‌వారు కూడా చాలా మంది ఉన్నారు.

Add your comment

Your email address will not be published.