తంతే బూరెలగంపలో పడ్డ శిల్పా! మరో ఎన్నికకు రెడీ | Shilpa Mohan Reddy to Participate in By-Elections?

admin
shilpa

The leader of the Nandhiya Sabha seat in the election is also in front of the election campaign. The sub-election of the Nairs made the country look all over the country.click on the below video to know more details of Shilpa Mohan Reddy to Participate in By-Elections?

pలో నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక సందర్భంగా నాయకుల ప్రచార హోరు ఇంకా కళ్ళముందే ఉంది. నంద్యాల ఉప ఎన్నిక యావ‌త్ దేశాన్ని నంద్యాల వైపు చూసేలా చేసింది.

ఇక్క‌డ పార్టీ మారి పోటి చేసిన శిల్పా సోద‌రులు ఈ ఘోరప‌రాజ‌యాన్ని మ‌ర్చిపోక‌ముందే మ‌రో ఎన్నిక‌కు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. శిల్పా సోద‌రుల‌కు నంద్యాల ఉప ఎన్నిక ఘోర ప‌రాజ‌యం స‌రిపోయిన‌ట్టు లేదు..అందుకే వారు మ‌రో ఎన్నిక‌కు రెడీ అవుతున్నారు.
నంద్యాల శాసనసభకు ఉప ఎన్నిక సందర్భంగా.. శిల్పా మోహన్ రెడ్డి వైకాపా తరఫున బరిలోకి దిగడంతో, ఆయన సోదరుడు చక్రపాణి రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆ వెంటనే అది ఆమోదం కూడా పొందింది. ఇప్పుడు అదే స్థానానికి ఉప ఎన్నిక రాబోతోంది. వాస్త‌వంగా చూస్తే క‌ర్నూలు జిల్లా స్థానిక సంస్థ‌ల్లో వైసీపీకే మెజార్టీ ఉంది. అయినా గ‌త ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యం సాధించింది.

ఇక నాడు టీడీపీ త‌ర‌పున గెలిచిన శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి ఇప్పుడు రాజీనామా చేయ‌డంతో ఇప్పుడు ఈ ప‌ద‌వి కోసం టీడీపీలో గ‌ట్టి పోటీ నెల‌కొంది. ఇక విప‌క్ష వైసీపీలో మాత్రం ఈ సీటు అడిగేవాళ్లే కనుచూపు మేరలో కనపడటం లేదట. కేవ‌లం శిల్పా బ్ర‌ద‌ర్స్ మాత్ర‌మే మ‌రోసారి త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకుందామని భావిస్తున్నార‌ట‌.
గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి గెలిచిన శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి పార్టీ మారినందుకు ప‌ద‌వికి రాజీనామా చేసిన సానుభూతి, నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో ఓడిన సానుభూతితో పాటు స్థానిక సంస్థ‌ల్లో వైసీపీ వాళ్ల‌కే ఎక్కువ మెజార్టీ ఉండ‌డంతో ఈ సారైనా గెలుస్తామ‌ని శిల్పా చ‌క్ర‌పాణి ఆశ‌ల‌తో ఉన్నార‌ట‌. అయితే శిల్పా మ‌రోసారి ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తే మ‌రోసారి ఆయ‌న ఘోరంగా ఓడిపోక త‌ప్ప‌దాని tdpవర్గాల మాట మ‌రి మ‌ళ్లీ ఇక్క‌డ పోటీ చేసే సాహ‌సం శిల్పా బ్ర‌ద‌ర్స్ చేస్తారో ? లేదో ? చూడాలి.

Tags : , , , , , , , , , , , , , , , , , ,