టీఆర్ ఎస్ ఎమ్మెల్యే ఆక్ర‌మ‌ణ‌లు బ‌ట్ట‌బ‌య‌లు! | SHOCKING Facts REVEALED About TRS MLA’s

admin
mla

Telangana CM K. The incident in Chandigarh Rao Sarkar was taken to Jagamgam district. The District Collector collects the lands which directly occupy the MLAs and make them annuling in Telangana. There are allegations of many MLAs already in Telangana. Click on the below video to know more details of SHOCKING Facts REVEALED About TRS MLA’s

తెలంగాణ సీఎం కే. చంద్ర‌శేఖ‌ర‌రావు స‌ర్కార్‌ను ఇర‌కాటంలో పెట్టే సంఘ‌ట‌న జ‌న‌గాం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా క‌లెక్ట‌ర్ నేరుగా ఓ ఎమ్మెల్యేల ఆక్ర‌మించిన భూముల‌ను వెలుగులోకి తెచ్చి వాటిని ర‌ద్దు చేసిన తీరు తెలంగాణ‌లో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఇప్ప‌టికే తెలంగాణలోని అనేక మంది ఎమ్మెల్యేల‌పై ఆరోప‌ణ‌లు వెల్లువెత్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఓ జిల్లా క‌లెక్ట‌ర్ నేరుగా ఓ ఎమ్మెల్యే ఆక్ర‌మాల‌పై నేరుగా మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు చేయ‌టం ఇప్పుడు తెలంగాణ‌లో హాట్ టాపిక్ మారింది. దీనిపై సీఎం కే. చంద్ర‌శేఖ‌ర‌రావు ఎలా స్పందిస్తారో చూడాలి.
జ‌న‌గాం జిల్లా క‌లెక్ట‌ర్ ఎమ్మెల్యే యాద‌వ‌రెడ్డి భూ ఆక్ర‌మ‌ణ‌పై ప్ర‌భుత్వాన్ని ఫిర్యాదు చేశారు. కానీ ప్ర‌భుత్వ పెద్ద‌లు ఈ ఫిర్యాదుపై స్పందించ‌లేదు. దాంతో జిల్లా క‌లెక్ట‌రే నేరుగా రంగంలోకి దిగారు. మీడియా స‌మావేశం ఏర్పాటు ఎమ్మెల్యే ఆక్ర‌మ‌ణ‌లకు ఆధారాలంటూ మీడియాకు తెలిపారు. జిల్లా క‌లెక్ట‌ర్ తీసుకున్న చ‌ర్య‌పై ప్ర‌భుత్వ పెద్ద‌లు గుర్రుగా ఉన్నార‌ని తెలుస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే చ‌ర్య‌ల‌ను మీడియాకు తెల‌ప‌టం అంటే ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్ట‌డంగానే ప్ర‌భుత్వంలో కొంద‌రు పెద్ద‌లు ఆలోచ‌న‌లు చేస్తున్న‌ట్లుగా తె లుస్తోంది.

జ‌న‌గాం జిల్లా క‌లెక్ట‌ర్ దేవ‌సేన స్ధానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డి భూ ఆక్ర‌మ‌ణ‌ల‌ను మీడియాకు వివ‌రించారు. బ‌తుక‌మ్మ కుంట వ్య‌వ‌హారాన్ని వెలుగులోకి తెచ్చారు. మీడియా సాక్షిగా ఎమ్మెల్యే ఆక్ర‌మ‌ణ‌ల‌ను వెల్ల‌డించారు. ఐదు ఎక‌రాల కుంట‌ను పూడ్చిన‌ట్లుగా ఎమ్మెల్యేపై క‌లెక్ట‌ర్ దేవ‌సేన ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. అంతే కాకుండా దీనిలో ఎమ్మెల్యే పేరుతో రిజిస్ట్రేష‌న్ అయిన భూమిని కూడా ర‌ద్దు చేసిన‌ట్లుగా ఆమె తెలిపారు. అభివృద్ది పేరు చెప్పి డ‌బ్బులు ఎలా వ‌సూలు చేసింది.? ప‌్ర‌భుత్వం నుంచి నిధులు ఎలా తెచ్చుకుంది కూడా ఆమె వివ‌రించారు. సుప్రీం కోర్టు మార్గ ద‌ర్శ‌కాల‌కు విరుద్దంగా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును దేవ‌సేన వివ‌రించారు. అప్ప‌ట్లో ఓ గుడిని ఎమ్మెల్యే పేర రిజిస్ట్రేష‌న్ చేయించుకున్నార‌ని దాన్ని తానే ర‌ద్దు చేసిన‌ట్లుగా వివ‌రించారు. బతుక‌మ్మ కుంట ప్ర‌దేశం వివాద‌స్ప‌ద స్ధ‌లంగా ఉండ‌టంతో అక్క‌డ బ‌తుక‌మ్మ వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌టం లేద‌ని ఆమె తెలిపారు. ఏకంగా ఓ జిల్లా క‌లెక్ట‌ర్ ఓ ఎమ్మెల్యేపై బ‌హిరంగంగా అవినీతి ఆరోప‌ణ‌లు చేయ‌టంతో స‌ర్కార్ ఇర‌కాటంలో ప‌డిన‌ట్లు అయింది. దీనిపై ఎలా స్పందాల్సి ఉంది.

అయితే గ‌తంలో కూడా కేసీఆర్ స‌ర్కార్‌కు ఇటువంటి అనుభ‌వాలు ఉన్నాయి. స్ధానిక ఎమ్మెల్యేతో జిల్లా క‌లెక్ట‌ర్‌కు విభేదాలు త‌లెత్తిన నేప‌థ్యంలో పెద్ద‌ప‌ల్లి జిల్లా క‌లెక్ట‌ర్ సెల‌వుపై వెళ్ల‌టంపై కూడా ప్ర‌భుత్వం విమ‌ర్శ‌లు ఎదుర్కొంది. ఇప్పుడు అటువంటి వివాద‌మే ఎమ్మెల్యే, జిల్లా క‌లెక్ట‌ర్ మ‌ధ్య నెల‌కుంది. దీనిపై జిల్లా మంత్రి క‌డియం శ్రీ‌హ‌రి దృష్టికి కూడా తీసుకెళ్లిన‌ట్లుగా జిల్లా క‌లెక్ట‌ర్ దేవ‌సేన పేర్కొన్నారు. అయితే దీనిపై సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తార‌నేది మాత్రం ఆస‌క్తిక‌రంగా ఉంది. ఎందుకంటే గ‌తంలో మ‌హ‌బూబాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్‌తో స్ధానిక ఎమ్మెల్యే వ్య‌వ‌హ‌రించిన తీరుపై ఎమ్మెల్యేల‌పై కేసీఆర్ చ‌ర్య‌లు తీసుకున్నారు. ఇప్పుడు కూడా కేసీఆర్ అలాగే వ్య‌వ‌హారిస్తారా? లేదా జిల్లా క‌లెక్ట‌ర్‌పై చ‌ర్య‌ల‌కు పూనుకుంటారా? అనేది మాత్రం ఇప్పుడు తెలంగాణ‌లోని రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ మారింది.

Tags : , , , , , , , , , , , , , , , , , ,