సింగ‌రేణిలో రూ. 82 వేల బోనస్!! ఎన్నికల్లో గెలిపిస్తుందా? | Singareni Employees Get BONU

admin
singareni

The election campaign in Singareni is in full swing. The Singareni Coal Mine, which is the largest institution in the public sector in Telangana, is the seat of choice. The opposition is also prestigious. In the process of winning the elections on October 5, they are in the process of campaigning. Click on the below video to know more deatils of Singareni Employees Get BONU

సింగ‌రేణిలో గుర్తింపు ఎన్నిక‌ల ప్ర‌చారం జోరందుకుంది. తెలంగాణ‌లో ప‌బ్లిక్ సెక్ట‌ర్‌లో ఉన్న అతి పెద్ద సంస్ధ‌ అయిన సింగ‌రేణి కోల్ మైన్స్ గుర్తింపు ఎన్నిక‌లు ఇటు అధికార‌. ప్ర‌తిప‌క్షాల‌కు కూడా ప్ర‌తిష్టాత్మ‌కంగానే ఉన్నాయి. అక్టోబ‌రు 5వ తేదీని జ‌రిగే గుర్తింపు ఎన్నిక‌ల్లో గెలుపు కోసం ఎవ‌రి ప‌ద్ద‌తిలో వాళ్లు ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు. ఈ గుర్తింపు ఎన్నిక‌ల్లో అధికార టీఆర్ ఎస్ అనుబంధ సంఘానికి వ్య‌తిరేకంగా టీడీపీ, కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాల అనుబంధ సంఘాల‌న్నీ కూట‌మిగా ఏర్ప‌డి పోటీ చేస్తున్నాయి. తెలంగాణ‌లో ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తారు. ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో ప్ర‌జ‌ల నాడిని అంచ‌న వేసుకునే అవ‌కాశం ఉంది. వ‌చ్చే ఏడాదిలో సాధార‌ణ ఎన్నిక‌లుంటాయిని జ‌రుగుతున్న ప్ర‌చారం నేప‌థ్యంలో ఈ ఎన్నిల‌కు అత్యంత ప్రాధాన్య‌త ఏర్ప‌డింది. టీఆర్ ఎస్ అనుబంధ సంఘానికి నిజామాబాద్ ఎంపీ క‌విత గౌర‌వ అధ్య‌క్షు రాలిగా ఉండ‌టంతో ఈ ఎన్నిక‌ల‌కు రాజ‌కీయ ప్రాధాన్య‌త కూడా ఏర్ప‌డింది.

తెలంగాణ బొగ్గుగ‌ని కార్మిక సంఘం(టీబీజీకేఎస్‌) ఒక ప‌క్క‌న ఉంటే మిగిలిన ప్ర‌ధాన‌మైన యూనియ‌న్లన్నీ కూడా ఒక జ‌ట్టు క‌ట్టాయి. సింగ‌రేణి ఎన్నిక‌ల్లోనూ వామ‌ప‌క్షాలు, టీడీపీ, కాంగ్రెస్‌ల అనుబంధ సంఘాల‌న్నీ ఒక కూట‌మిగా ఏర్ప‌డ్డాయి. తెలంగాణ‌లో ఇటీవ‌ల కాలంలో అధికార ప‌క్షాన్ని ఢీ కొట్ట‌డానికి వీరంతా ఐక్యంగా వ్య‌వ‌హారిస్తున్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌లు మొద‌లు కొని, ఉప ఎన్నిక‌ల్లోనూ కూడా ఇటువంటి పంథాలో అనుస‌రించారు. అయితే సింగ‌రేణిలో మొద‌టి నుంచి బ‌ల‌మైన సంఘాలుగా ఐఎన్ టీయుసీ, ఎఐటీయుసీలు ఉన్నారు. అంతే కాకుండా జాతీయ సంఘాలైన వీటికి ప్ర‌త్యేక‌మైక‌న గుర్తింపు ఉంటుంది. మైన్స్ కు సంబంధించిన విధానప‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకునేట‌ప్ప‌డు జాతీయ స్ధాయిలో జాతీయ సంఘాల‌తో అప్పుడ‌ప్పుడు కేంద్రం చ‌ర్చిస్తుంది. కాబ‌ట్టి ఆ విధంగా వీటికి ప్రాధాన్య‌త ఉంది. గ‌తంలో సింగ‌రేణిలో ఎఐటీయుసీ, ఎన్‌టీయుసీలు ఒంట‌రిగా పోటీ చేసే గెలిచిన అనుభ‌వాలు ఉన్నాయి. అయితే టీఆర్ ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘాన్ని ఎదుర్కొవ‌టానికి వీరంతా ఒకే తాటిపైకి వ‌చ్చారు. కాబ‌ట్టి ఈ ఎన్నిక‌లను అధికార టీఆర్ ఎస్ పార్టీ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. అంతే కాకుండా ఈ సంఘానికి కేసీఆర్ కుమార్తె నిజాబామాద్ ఎంపీ క‌విత గౌర‌వ అధ్య‌క్షురాలిగా ఉన్నారు. దాంతో అధికార టీఆర్ ఎస్ పార్టీ శ్రేణులు ఈ ఎన్నిక‌ల‌ను మ‌రింత ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటున్నారు.

అయితే గుర్తింపు ఎన్నిక‌ల్లో గెలుపు కోసం టీఆర్ ఎస్ పార్టీ శ్రేణుల‌తో పాటు యూనియ‌న్ నేత‌లు కూడా కేసీఆర్ ద‌స‌రా, దీపావ‌ళి సంద‌ర్బాన్ని పుర‌స్క‌రించుకుని రూ. 82 వేల రూపాయ‌లు ఇచ్చార‌ని భారీ ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. మీడియా కూడా దీన్ని ఊద‌ర‌గొడుతుంది. ఈ ప్ర‌చారంలో డొల్ల త‌నాన్ని ఆ సంస్ధ‌లో ప‌ని చేస్తున్న కార్మికులు ఎత్తి చూపుతున్నారు. టీఆర్ ఎస్ నేతలు చేస్తున్న ప్ర‌చారంలో నిజం లేద‌ని, వాళ్లు మ‌ళ్లీ కార్మికుల్ని మోసం చేయ‌టానికి జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని నమ్మొద్దంటూ వారు కూడా ప్ర‌చారం సాగిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో వార‌స‌త్వ ఉద్యోగాల‌ను ఇస్తామ‌ని హామీ ఇచ్చి గుర్తింపు ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన టీబీజీకేఎస్ ఆ హామీని నిలుపుకోలేద‌ని రివ‌ర్స్‌లో కూట‌మి నేత‌లు ప్ర‌చారం మొద‌లు పెట్టారు.

ప్రతి ఏడాది దీపావళి bonus కింద కోల్ ఇండియా వారు ప్రతీ కార్మికుడికి కొంత డబ్బులు ఇస్తారు, ఇది central government నిర్ణయంతో జరుగుతుంది. జాతీయ స్ధాయిలో అమ‌లు జ‌రుగుతుంది. కోల్ ఇండియా వారు కార్మికుల‌ ప్రతిభను గుర్తించి దీపావళి బోనస్ సింగరేణి కార్మికులకు ఇస్తారు. ఏ ఏడాది రూ. 57000 ఇచ్చారు… ఇవి జాతీయ సంఘాలు కోల్ ఇండియా తో మాట్లాడి ఇప్పిస్తారు. ఇది బొగ్గు బావుల్లో పనిచేసినందుకు కార్మికులకు ఇచ్చేది. ప్ర‌తీ ఏడాది కూడా ఇస్తారు. singareni కార్మికునికి సింగరేణి యాజమాన్యం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తో చర్చించి దసరా అడ్వాన్స్ ఇస్తుంది, ప్ర‌తీ ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఇస్తారు. ఈ యెక్క అడ్వాన్స్ ను తిరిగి ప్రతి నెల 2500/- రూ… సింగరేణి కార్మికుల జీతం నుండి మొత్తం 10 నెలలు జీతంలో కోత వేస్తారు. ఈసారి 25 వేలు ఇచ్చారు ప్రతి నెల ఇరవై అయిదు వందలు చొప్పున కోత కోస్తారు.

మొత్తం 82000/- రూ,, ఇది మన ముఖ్యమంత్రి గారు సింగరేణి కార్మికులుకు ఇచ్చిన నజరానా అని TV లో పేపర్లలో టీఆర్ ఎస్ ప్రచారం చేస్తోందని ప్రత్యర్ది కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇది కేసీఆర్ కార్మికులు ఇచ్చింది కాదు. ప్ర‌తీ ఏడాది లాగే జ‌రిగే వ్య‌వ‌హారమే. కానీ దీన్ని అధికార పార్టీ గొప్ప‌గా జ‌రుగుతున్న ప్ర‌చారంగా కూట‌మి నేత‌లు కార్మికుల‌కు వివరిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో వార‌స‌త్వ ఉద్యోగాలు క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చి అధికారంలోకి వ‌చ్చిన టీఆర్ ఎస్ అనుబంధ సంస్ధ ఈ హామీని అ మ‌లు చేయ‌టంలో విఫ‌లం అయింది. దాంతో ఏదో విధంగా కార్మికుల‌ను బురిడి కొట్టించాలని చేస్తున్న ప్ర‌చారంగా ప్రత్యర్దులు విమర్శలు గుప్పిస్తున్నారు. అధికార పార్టీ నేతలు మాత్రం మా ప్రభుత్వం హయాంలోనే ఈ స్ధాయిలో బోనస్ ఇవ్వటం సాధ్యం అయిందటున్నారు. ఏమైనప్పటికీ ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజల పల్స్ తెలుసుకోవటానికి దోహదపడతాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Tags : , , , , , , , , , , , , , , , , , , , ,