కాకినాడ మేయ‌ర్ గా పావని ఎన్నిక వెన‌క కారణం ఇదా? | Sunkara Pavani Becomes Kakinada Mayor

admin
kakinada

Since the TDP Flag over the Kakinada corporation, there was a nervous breakdown on the issue of who was the Mayor.click on the below video to know more details of Sunkara Pavani Becomes Kakinada Mayor

కాకినాడ కార్పొరేష‌న్ పై టీడీపీ జెండా ఎగిరిన‌ప్ప‌టి నుంచి అక్క‌డ మేయ‌ర్ ఎవ‌రు అనే అంశంపై న‌రాలు తెగే ఉత్కంఠ ఏర్ప‌డింది.

దీంతో ఎవ‌రికి వారు తామంటే తాము అని బాబు చుట్టూ తిరిగారు. ఇక కీల‌క నేత‌లు కూడా త‌మ అనుకూల వ‌ర్గం వారిని అంద‌లం ఎక్కించేందుకు ప్రయ‌త్నాలు చేశారు. అయితే చివ‌ర‌కు బాబు ఓ నిర్ణ‌యం చెప్పాల్సి వ‌చ్చింది. ఇక ..కాకినాడ నగర పాలక మేయర్‌ గా 28వ డివిజన్ కార్పోరేటర్ గా ఎన్నికైన‌ సుంకర పావనిని ఎన్నుకోవాల‌ని సీఎం ప్ర‌తిపాధించారు. ఇక డిప్యూటీ మేయర్‌ అభ్యర్థిగా కాలా సత్తిబాబును ముందే నిర్ణయించడంతో ఇక వీరిని అధికారికంగా కార్పొరేట‌ర్లు ఎన్నుకోవాల్సింది మాత్ర‌మే మిగిలి ఉంది. అయితే సుంకర పావని ఎమ్మెలే కొండబాబుకు అనుకూల వర్గం కావ‌డంతోపాటు కాకినాడ ఎంపీ తోటనరసింహం, ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు , జ్యోతుల నెహ్రూ, డిసిసిబి ఛైర్మన్ వరుపుల రాజా లకు దగ్గర బంధువు. దీంతో ఆమెకు ఈ ప‌ద‌వి వ‌రించిందనీ అధిష్టానం వద్ద ఈమె పేరు గ‌ట్టిగా వినిపించ‌డంతో బాబు కూడా ఒకే చెప్పార‌ని అంటున్నారు.ఇక డిప్యూటీ సీఎం చినరాజప్ప, ఆర్థిక మంత్రి యనమల, కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మేయర్ అభ్యర్థిత్వం ఖరారు చేయడంలో కీలక పాత్ర పోషించారు.

ఈ పార్టీ అధిష్ఠానం ముందు త‌మ‌ నిర్ణయం చెప్ప‌డంతో చంద్రబాబు నాయుడు స్థానిక నేతలతో మాట్లాడిన తర్వాతనే సుంకర పావనికి మేయర్ కిరీటం అప్పగించారు. మరోవైపు సుంకర పావని భర్త తిరుమల కుమార్ కాకినాడ నగర టీడీపీ అధ్యక్షుడిగా పని చేస్తుండటం ఆమెకు కలిసి వచ్చింది. మేయర్ గా ఎంపికైన సుంకర పావనికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి…ఇదిలా ఉంటే ఓసీ మహిళకు రిజర్వ్ అయిన మేయర్ పదవి కాపు సామాజిక వర్గానికి అది దక్కనుందే ప్రచారం సాగడంతో టీడీపీ నుంచి గెలిచిన నలుగురు కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళా కార్పొరేటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 28వ డివిజన్‌ కార్పొరేటర్ సుంకర పావని, 8వ డివిజన్‌ కార్పొరేటర్ అడ్డూరి వరలక్ష్మి, 38 వ డివిజన్ కార్పొరేటర్ మాకినీడి శేషుకుమారి, 40వ డివిజన్ కార్పొరేటర్ సుంకర శివప్రసన్నలలో ఒకరికి మేయర్ పదవికి పోటీ ప‌డ్డారు. ఎవరికి వారే పెద్ద నేతల ఆశీస్సుల కోసం ఎదురు చూస్తుండ‌గా కొండ‌బాబు అనుకూల వ‌ర్గానికి ఈ ప‌ద‌వి ద‌క్క‌డం విశేషం…మ‌రోవైపు మేయర్‌ అభ్యర్థి ఎంపిక కోసం తీవ్ర కసరత్తు చేసింది టీడీపీ నాయకత్వం. అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాతనే మేయర్‌ అభ్యర్థి ఎంపిక నిర్ణయాన్ని మంత్రులు, పార్టీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికే వదిలేశారు. అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం మేయర్‌ అభ్యర్థిగా సుంకర పావని పేరును అధికారికంగా ప్రకటించారు.కాగా 20 ఏళ్ల అనంతరం కాకినాడ నగరపాలక సంస్థలో తెదేపా పాగా వేసింది. మొత్తం 50 డివిజన్లు ఉన్న కాకినాడ నగరపాలక సంస్థలో 48 డివిజన్లకు ఎన్నికలు జరిగాయి. అందులో టీడీపీ 39 చోట్ల పోటీ చేసి 32 స్థానాల్లో విజయం సాధించగా.. మిత్రపక్షం బీజేపీ 9 డివిజన్లలో పోటీ చేసి మూడు చోట్ల గెలిచింది. వైసీపీకి ఈ ఎన్నికల్లో 10 సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే.

Tags : , , , , , , , , , , , , , , , , , ,