జానాకు చెక్ పెట్టేందుకు ప్లాన్ రెడీ? | T Congress Leaders | Uttam Kumar VS Jana Reddy

admin
jana

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పార్టీ ప‌రిస్థితి ఏమో కానీ నేత‌ల తీరు మాత్రం వాడీ వేడిగానే ఉంది.

అధికార‌పార్టీని దుమ్మెత్తిపోయాల్సింది పోయి ఆ పార్టీ నేత‌లు సొంత నేత‌ల‌పైనే ఒక‌రిపై ఒక‌రు కారాలు మిరాయాలు నూరుకుంటున్నారు. అయితే ఇదాంతా బ‌య‌ట కాకున్నా అధిష్టానం వ‌ద్ద వీరి ఆగడాలు ఎక్కువ అయిపోయాయ‌ని ఆ పార్టీ శ్రేణులు గుస‌గుస‌లాడుకుంటున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూప్ త‌గాదాలు గుర్తుకు వ‌స్తాయి. పార్టీ ఏ ప‌రిస్థితిలో ఉన్నా అందులో ఏ మాత్రం మార్పు ఉండ‌దు. ఇప్పుడు కూడా టీ కాంగ్రెస్ లో ఆదే రిపీట్ అవుతుంద‌నే వాద‌న‌లు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా పార్టీ సీనియ‌ర్ నేత అయిన జానారెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మ‌ధ్య ఈ వార్ వాడీ వేడీగా సాగుతోంద‌ట‌.

ఇందులో భాగంగానే జానారెడ్డికి చెక్ పెట్టేందుకు ఉత్త‌మ్ ప్లాన్ కూడా గీశార‌ని అంటున్నారు స్థానిక నేత‌లు..2019 ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాదిన్న‌ర టైమ్ ఉండ‌గానే ఇప్ప‌టి నుంచే వీరి మ‌ధ్య పోటీ పెరిగిపోయింది.తెలంగాణ‌లో టీఆర్ ఎస్ కు ప్ర‌త్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీకి ఎదిగితే సీఎం కుర్చీపై ఎవ‌రు ఉండాల‌నేదానిపైనే ఈ ర‌గ‌డ అంతా.. దీంతో పార్టీలో ముఖ్య‌నేత‌ల మ‌ధ్య సీఎం సీటు కోసం కుర్చీలాట మొద‌లైంది. ఉత్త‌మ్‌,జానారెడ్డిల మ‌ధ్య స‌రికొత్త వార్ కొన‌సాగుతోంది. త‌న సీటును ప‌దిలం చేసుకోవడం కోసం ఉత్త‌మ్ ఎత్తులు వేస్తుంటే….ఇటు జానా కూడా కొత్త స్కెచ్‌లు గీస్తున్నారు. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ల పేరుతో జానా బ్యాచ్‌కు ఉత్త‌మ్ చెక్ పెట్టాల‌ని చూస్తున్నారు. అయితే ఇటీవ‌లే హైక‌మాండ్ పెద్ద‌ల‌ను క‌లిసి వ‌చ్చిన జానారెడ్డి 2019లో సీఎం అభ్య‌ర్థిగా ఫోక‌స్ కావ‌డానికి ఓ బ్లూప్రింట్ సిద్ధం చేసుకున్నారట‌. ఇందులో భాగంగా మొద‌ట పార్టీ ప‌టిష్ట‌త కార్య‌క్ర‌మం పేరుతో ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు తెర‌తీయాల‌ని జానా భావిస్తున్నారు.ఇప్ప‌టికే తెలంగాణ‌లో దిక్కుమొక్కు తెలియ‌క‌…2019 ఎన్నిక‌ల‌పై బెంగ పెట్టుకున్న తెలంగాణ తెలుగుదేశం నేత‌ల‌ను కాంగ్రెస్‌లోకి లాగాల‌ని జానారెడ్డి భావిస్తున్నారు. మంచిర్యాల జిల్లాకు చెందిన బోడ‌జ‌నార్ధ‌న్‌తో పాటు ఉత్త‌ర‌, ద‌క్షిణ తెలంగాణ‌లోని తెలుగుదేశం నేత‌ల‌కు ఆయ‌న ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌లోకి వ‌స్తే తాను టికెట్ ఇప్పిస్తాన‌ని అభ‌య‌మిచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. టీడీపీ నుంచి ఐదు నుంచి ఎనిమిది లీడ‌ర్ల‌ను కాంగ్రెస్‌లోకి చేర్పించాల‌ని జానా భావిస్తున్నారు. ఈ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ద్వారా హైక‌మాండ్ ద‌గ్గ‌ర ప‌ర‌ప‌తి పెంచుకోవాల‌ని జానా క‌ల‌లు కంటున్నారు. ఇలా త‌న కోట‌రీని పెంచుకుంటే తానే సీఎం కావ‌చ్చున‌నే ఆలోచ‌న‌లో జానా రెడ్డి ఉన్నార‌ట‌. అయితే ఆయ‌న క‌ల‌ల‌ను నిజ‌యం చేయ‌కూడ‌ద‌ని తానే ముఖ్య‌మంత్రి కావాల‌ని ఉత్త‌మ్ భావిస్తున్నార‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కు విప‌క్ష నేత‌గా జానారెడ్డి విఫ‌ల‌మైన అంశాల‌ను అన్నింటిని అదిష్టానం దృష్టికి తీసుకువెళుతున్నార‌ట‌. టీపీసీసీ చీఫ్ కావ‌డం వ‌ల్ల అధిష్టానంతో నేరుగా ఉత్త‌మ్ కు సంబధాలు ఉంటాయి… దీనిని అవ‌కాశంగా మ‌లుచుకొని జానాకు చెక్ పెడుతున్నార‌ట‌. ఇక ఆయ‌న వ‌ర్గం నేత‌ల‌ను త‌న చాయ‌ల్లోకి కూడా రానివ్వ‌డంలేద‌నే వాద‌న‌లు కూడా వినిపిస్తున్నాయి. జానారెడ్డి వేసే ఆలోచ‌న‌లు ఆచ‌ర‌ణ‌లోకి రాకుండా చూస్తున్నార‌ట‌. దీంతో సొంత పార్టీ నేత‌ల కార‌ణంగా త‌న‌కు ప‌ద‌వి గండం ప‌ట్టుకుంద‌ని ఆయ‌న మ‌ధ‌న‌ప‌డిపోతున్నార‌ట‌. మ‌రి ఈ సీనియ‌ర్ నేత అయిన జానారెడ్డికి అధిష్టానం క‌నిక‌రిస్తుందా,? విప‌క్షనేత‌గా ఆక‌ట్టుకోలేక పోయార‌న్న వాద‌న తెర‌పైకి తెచ్చి ప‌క్క‌న పెడుతుందా అనేది చూడాల్సిందే…..

Tags : , , , , , , , , , , , , , ,