చేతులు కాల్చుకొని ఆకుల కోసం వెతుకుతున్న ఆ TDP ex.MLA! | TDP Ex- MLA in DILEMMA?

admin
exmla

This TDP leader’s situation has become an impassable one.

Can he renew his future of compromise? Do you think that the party in power is now wrong? Prakasham district Gaddalaru is the former MLA Anna Ramababu situation. Prakasham district Giduluru constituency Former MLA Anna Rambabu announced the party two months ago. Click on the below video to know more details of TDP Ex- MLA in DILEMMA?

ఈ టీడీపీ నేత పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. చేతులారా ఆయన రాజీకీయ భవిష్యత్ ను ఆయనే కాలరాసేసుకున్నారా? అధికారంలో ఉన్న పార్టీని వీడి ఇప్పుడు తప్పు చేశానని మధనపడుతున్నారా? ప్రకాశం జిల్లా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నారాంబాబు పరిస్థితి ఇది. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పార్టీని వీడుతున్నట్లు రెండు నెలల క్రితం ప్రకటించారు. గత ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థి అశోక్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. 2014 నుంచి నిన్న మొన్నటి వరకూ ఆయనే గిద్దలూరు ఇన్ ఛార్జిగా ఉన్నారు. గిద్దలూరు నియోజక వర్గంలో గెలవకపోయినా ఆయనే అనధికార ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన చెప్పిన పనే అధికారులు చేయాలి. దీంతో అన్నా రాంబాబు గెలవకున్నప్పటికీ ఎమ్మెల్యేగానే చలామణి అవుతూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. నియోజకవర్గం అంతటా కలియతిరిగారు. అన్నా రాంబాబు వెంటే టీడీపీ శ్రేణులు, నేతలు, అనుచరగణం ఉండేది. ఆయన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు.

అయితే కొద్ది రోజుల క్రితం సీన్ మారింది. వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన అశోక్ రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి కోసమంటూ అధికార తెలుగుదేశం పార్టీలో చేరిపోయాయి. అమరావతిలో పసుపు కండువా కప్పుకుని అశోక్ రెడ్డి గిద్దలూరు చేరుకున్నప్పటి నుంచి అన్నా రాంబాబుకు కష్టాలు ప్రారంభమయ్యాయి. అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో అశోక్ రెడ్డి మాటనే అధికారులు వింటున్నారు. అంతేకాదు టీడీపీ అధినాయకత్వం నియోజకవర్గ బాధ్యతలను అశోక్ రెడ్డికి అప్పగించి… అన్నా రాంబాబును పక్కనపెట్టింది. దీంతో అన్నారాంబాబు మనస్తాపానికి గురై పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. కాని రాంబాబు వెంట ఒక్క నేత అంటే ఒక్క నేత టీడీపీని వీడి రాలేదు. ఇన్నాళ్లూ తన అనుచరులుగా ఉన్న వారు కూడా ముఖం చాటేశారు. సొంత అనుచరులే హ్యాండ్ ఇవ్వడంతో అన్నా రాంబాబుకు ఇప్పుడు దిక్కు తోచడం లేదు. అధికార పార్టీని వీడిన రాంబాబు మరే పార్టీలో చేరలేదు. దీంతో మళ్లీ అన్నా రాంబాబు టీడీపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. జిల్లా మంత్రి శిద్ధారాఘవరావుతో మాట్లాడితే లోకేష్ తో మాట్లాడుకోవాలని సూచించారట. ఇంతకీ అన్నా రాంబాబుఎందుకు పార్టీని వదిలేశారో? మళ్లీ ఎందుకు వద్దామనుకుంటున్నారో? ఆయనకే క్లారిటీ లేకుండా పోయింది. ఆవేశంతో వేసిన ఒక్క తప్పటడుగు మాజీ ఎమ్మెల్యే రాజకీయ భవిష్యత్ ను ప్రశ్నార్ధకంగా మార్చివేసింది.

Tags : , , , , , , , , , , , , , , , , , , ,