ఆ రెండు పార్టీల‌కు టీడీపీ గుడ్ బై!

surendra a
tdp

ఏపీలోని అధికారపార్టీ టీడీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా బ‌రిలోకి దిగ‌బోతుందా? గ‌త ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీల మ‌ద్దుతో పోటీకి దిగిన టీడీపీ ఈ సారి వైఖ‌రి మార్చాల‌నుకుంటుందా? అంటే అవున‌నే పార్టీ వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది.

రాష్ట్రంలో ‘ఆన్ ది స్పాట్’ లో ఎన్నిక‌లు జ‌రిగితే టీడీపీ జ‌య‌కేత‌నం ఎగ‌ర‌వేడ‌యం ఖాయ‌మ‌ని ఓ దిన ప‌త్రిక ఇటీవ‌లే ఓ స‌ర్వే చేసి చెప్పింది. అందుకే ఇప్పుడు టీడీపీ సొంత కుంప‌టి పెట్టాల‌ని అనుకుంటుంద‌ని స‌మాచారం. సొంతంగా బరిలోకి దిగితేనే ఎక్కువ సీట్లు వస్తాయ‌ని…ఇత‌ర పార్టీల మ‌ద్ద‌తు తీసుకోకుండా గెలిస్తే లాలోచీలేవి ఉండ‌వ‌ని పార్టీ శ్రేణులు భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

గ‌త ఎన్నిక‌ల్లో మోదీకి మ‌ద్దుతిచ్చింది టీడీపీ. కానీ ఏపీపై ఆయ‌న మాత్రం చిన్నచూపే చూశారు. ఈ తీరుపై పార్టీ నేత‌లు కూడా ర‌గిలిపోతున్నారు. పార్టీ నియ‌మావ‌ళి మేర‌కు క‌మ‌లనాధుల‌తో క‌లిసి ప‌నిచేస్తున్నారు త‌ప్ప, మ‌న‌స్ఫూర్తిగా ప‌నిచేయ‌డంలేద‌ని ఇప్ప‌టికే బాబు గ‌మ‌నించిన‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా మార‌నున్నాయని తెలుస్తోంది.

Tags : , , , , , , , , , ,