టీడీపీ నుండి మరో వికెట్ అవుట్?

admin
tdp

తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణ కి మారుపేరు అని అంటారు. ప్రత్యర్ధి, ఇతర పార్టీల వారు కూడా తమ వారికి తెలుగుదేశం పార్టీ ని ఆదర్శంగా చూపుతారు.

అయితే అదంతా గతం ఇప్పుడు పరిస్థితి మారింది, పార్టీ నాయకులు ఏమాత్రం పార్టీ నిర్ణయాలని, అధినేత ఆజ్ఞల్ని ఖాతరు చేయడంలేదు. ఇటీవలే అవినీతి నేరారోపణలతో ఇద్దరు ఎమ్మెల్సీలను సస్పెండ్ చేసిన అధిష్టానం. ఇప్పుడు పార్టీ నిర్ణయాన్ని భేఖాతరు చేసిన పుట‍్టపర్తి మున్సిపల్‌ చైర‍్మన్‌ పీసీ గంగన‍్నపై తెలుగుదేశం పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది.

వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లా పుట‍్టపర్తి మున్సిపల్‌ చైర‍్మన్‌ పీసీ గంగన‍్నపై తెలుగుదేశం పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ నుంచి ఆరు సంవత్సరాల పాటు గంగన్నను సస్పెండ్ చేస్తూ టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు బీకే పార్థసారథి శనివారం ఉత‍్తర్వులు జారీచేశారు. మున్సిపల్‌ చైర‍్మన్‌ పదవికి రాజీనామా చేయాలని వారం కిందట చంద్రబాబు నాయుడు ఆదేశించినా గంగన‍్న ఖాతరు చేయలేదు.

దాంతో టీడీపీ అధిష్టానం సూచన మేరకు గంగన‍్నను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తూ జిల్లా అధ‍్యక్షుడు ఉత‍్తర్వులు జారీచేశారు. చైర్మన్‌గా పీసీ గంగన్న రెండున్నరేళ్ల పదవీకాలం ముగియడంతో తక్షణమే రాజీనామా చేసి, ఇతరులకు అవకాశం కల్పించాలని పార్టీ అధిష్టానం ఆదేశించినా ఆయన వెనక్కి తగ్గలేదు.

తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవంటూనే.. గత ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఇచ్చిన హామీలను మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి నెరవేరిస్తే రాజీనామా చేస్తానంటూ మెలిక పెట్టిన విషయం తెలిసిందే. వివాదం పూర్తిగా ముదిరిన నేపథ్యంలో పుట్టపర్తి మునిసిపల్ చైర్మన్ గంగన్నపై టీడీపీ సస్పెన్షన్ వేటు వేసింది.

Tags : , , , , , , , , , , , , , , , , , , , , ,