బతుక‌మ్మ చీర‌ల‌పై విప‌క్షాలు త‌ప్పు చేశాయా? | Telangana Bathukamma Celebrations Started!

admin
bhathukamma

Telangana CM K, Chandrashekhar Rao Sarkar Batakamma festival is of great importance. The government has allocated huge funds to ensure that the festival of Bathukamma, which is a testimony to the tradition and culture of Telangana, KSR Sarkar for Rs. 224 rupees has been allocated.click on the below video to know more details of Telangana Bathukamma Celebrations Started!

తెలంగాణ సీఎం కే, చంద్ర‌శేఖ‌ర‌రావు స‌ర్కార్ బత‌క‌మ్మ పండుగ‌కు ఎంతో ప్రాధాన్య‌త ఇస్తోంది. తెలంగాణ సంప్ర‌దాయం, సంస్కృతి సంప్ర‌దాయాల‌కు నిలువెత్తు నిద‌ర్శ‌నంగా నిలిచే బ‌తుక‌మ్మ పండుగ‌ను మ‌రింత ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం భారీ ఎత్తున నిధులు కేటాయించింది. తెలంగాణ చ‌రిత్ర‌లో ఎప్పుడు లేని విధంగా ఈ బ‌తుక‌మ్మ సంబురాల‌కు కేసీఆర్ స‌ర్కార్ రూ. 224 రూపాయ‌ల నిధులు కేటాయించింది. ఈ మొత్తంలో నిధులు బ‌తుక‌మ్మ పండుగ‌కు కేటాయించ‌టం గ‌తంలో ఎన్న‌డు జ‌ర‌గ‌లేదు. బతుక‌మ్మ ఆడే ప్ర‌తీ తెలంగాణ మ‌హిళ‌కు చీర ఇవ్వాల‌నే ఉద్దేశంతో 1.6 కోట్ల చీర‌ల‌కు పంపిణీకి ఏర్పాట్లు చేశారు. గ‌త రెండు రోజుల్లో సగం మంది మ‌హిళ‌ల‌కు చీర‌లు పంపిణీ చేశారు. మిగిలిన చీర‌లు మ‌రో రెండ్రోజుల్లో పంపిణీ చేయ‌టానికి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంది.

తొలి రోజు పంపిణీ చేసిన చీర‌ల్లో నాణ్య‌త‌పై మ‌హిళ‌ల నుంచి కొన్ని విమ‌ర్శ‌లు త‌లెత్తాయి. దీనికి ప్ర‌ధాన‌మైన కార‌ణం మ‌హిళ‌ల‌కు సిరిసిల్ల చేనేత ప‌ట్టు చీర‌లు ఇస్తార‌ని ప్రచారం చేశారు. చీర ఖ‌రీదు రూ. 224 రూపాయ‌లు ఉంటుంద‌ని, మంచి నాణ్య‌మైన చీర‌లు ప్ర‌భుత్వం పంపిణీ చేస్తోంద‌ని భారీ ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. దీందో మ‌హిళ‌లు ఈ చీర‌లు కోసం కూలీ నాలీ మానుకుని పెద్ద పెద్ద క్యూలీ క‌ట్టారు. తీరా చీర‌లు చేతికి వ‌చ్చాయి. అయితే ముందు చెప్పిన‌ట్లుగా చేనేత ప‌ట్టు చీర‌కు బ‌దులు సూర‌ల్ సిల్క్ చీర రావ‌టంతో చాలా మంది మ‌హిళ‌లు అసంతృప్తి వ్య‌క్తం చేశారు. దీన్ని రాజ‌కీయ పార్టీలు కొంత రాజ‌కీయం చేశాయ‌ని అధికార ప‌క్ష నేత‌లు ఆరోపిస్తున్నారు. అయితే సూర‌ల్ చీర‌లు వ‌చ్చిన మాట నిజ‌మే కానీ అవి నాణ్య‌త‌లేద‌నే వాద‌న స‌రికాద‌ని ప్రిన్స‌ప‌ల్ సెక్ర‌ట‌రీ శైల‌జాఅయ్యాగ‌ర్ పేర్కొన్నారు.
తొలి రోజు చీర‌ల పంపిణీపై విప‌క్షాల చేసిన రాద్దాంతంపై కేసీఆర్ పార్టీ నేత‌ల‌తో ఫోన్ మాట్లాడారు. విప‌క్షాలు పెద్ద త‌ప్పు చేస్తున్నాయ‌ని ఆయ‌న మండిప‌డ్డారు. వారు ప్ర‌భుత్వం ఇచ్చే చీర‌ల‌కు కాల్చితే వారే కాలిపోతారంటూ పెద్ద హెచ్చ‌రికే చేశారు. అంతే కాకుండా చీర‌ల పంపిణీ వేగ‌వంతం చేసి పంపాల‌ని కూడా ఆ పార్టీ నేత‌ల‌కు సూచించారు. అయితే కేసీఆర్ అన్ని విష‌యాల‌ను ప‌రిశీలించిన మీద‌ట‌నే మాట్లాడ‌తారనే విష‌యం తెల్సిందే. చీర‌ల విష‌యంలో ప్ర‌తిప‌క్షాలు అనావ‌స‌రంగా తొంద‌ర ప‌డ్డాయా? అనే చ‌ర్చ కూడా మొద‌లైంది. తొలి రోజు అక్క‌డ‌క్క‌డ కొంద‌రు మ‌హిళ‌ల‌ను వ్య‌తిరేకించినా ఆ త‌ర్వాత ఆటువంటి సంఘ‌ట‌న‌లేవి చోటు చేసుకోలేదు. మ‌రో ప‌క్క ప్ర‌భుత్వం అనుకూలంగా కూడా మ‌హిళ‌లు ముందుకు వ‌చ్చి మాట్లాడుతున్నారు. దీంతో విప‌క్ష నేత‌ల్లో తొంద‌ర‌ప‌డ్డ‌మా? అనే ఆలోచ‌న మొద‌లైన‌ట్లుగా చెబుతున్నారు. ఏమైన‌ప్ప‌టికీ పండుగ పూట కొత్త చీర‌లు ఉచితంగా ఇవ్వ‌టాన్ని చాలా మంద మ‌హిళ‌లు హ‌ర్షిస్తున్నారు. ఇక న‌చ్చ‌క‌పోవ‌టం అనేది పెద్ద స‌మ‌స్య కాద‌ని, భ‌ర్త సొంత భార్య కే న‌చ్చిన చీర కొన‌టం సాధ్యం అయ్యే ప‌ని కాద‌ని, కాబ‌ట్టి విప‌క్షాలు ఈ విష‌యంలో త‌ప్పు లోకాలేశాయనే ప్రచారం ఊపందుకుంది. అయితే దీని వెనుక ఎవరైనా ఉన్నారా? ఇది స‌హ‌జంగా సానుకూల ప్ర‌చార‌మాఅనేది తేలాల్సి ఉంది.

Tags : , , , , , , , , , , , , , , , , ,