KCR ను చుట్టేసిన నాసిర‌కం చీర‌లు ! | Telangana CM KCR Upset With Bathukamma Saree Plan!

admin
kcr

Telangana Chief Minister Chandrasekhar Rao Sarkar is supposed to be excited. The government decided to devote saris to women across Telangana to celebrate this festival. The distribution of these sarees is going on in the last three days. About a third of the saris are reported to have been distributed so far. Click on the below video to know more deatils of Telangana CM KCR Upset With Bathukamma Saree Plan!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కే. చంద్ర‌శేఖ‌ర‌రావు స‌ర్కార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న సంగ‌తి తెల్సిందే. ఈ బ‌తుక‌మ్మ పండుగ సంబురాల‌ను పుర‌స్క‌రించుకుని తెలంగాణ వ్యాప్తంగా మ‌హిళ‌ల‌కు చీర‌లు పంచాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. గ‌త మూడు రోజుల‌గా ఈ చీర‌ల పంపిణి శ‌ర‌వేగం జ‌రుగుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు మూడో వంతు చీర‌లు పంపిణి జ‌రిగిన‌ట్లుగా చెబుతున్నారు. ప్ర‌భుత్వం కూడా ఈ చీర పంపిణికీ భారీగానే నిధులు కేటాయించింది. ఈ చీర కొనుగోలుకు ప్ర‌భుత్వం రూ. 224 కోట్లు కేటాయించింది. అంతే కాకుండా ఈ చీర‌లు సిరిసిల్ల చేనేత కార్మిక‌ల నుంచి కొనుగోలు చేసి వారిని ఆదుకుంటామ‌ని కూడా ప్ర‌క‌టించింది. కానీ ఇవ‌న్నీ ప్ర‌క‌ట‌న‌లు మాత్ర‌మే. అస‌లు నిజం ఏమిటో గుట్టు ర‌ట్టైంది. నాసి ర‌కం చీర‌ల‌కు పంపిణికి హైద‌రాబాద్‌లోని ఓల్డ్ సిటోనే ప్లాన్ సిద్దం అయింది. దీనికి అధికార పార్టీకి చెందిన నేత‌ల క‌నుస‌న్న‌లోనే ప‌థ‌క ర‌చ‌న జ‌రిగింది.

తెలంగాణ వ్యాప్తంగా బుధ‌వారం నుంచి ప్రారంభ‌మైన బ‌తుక‌మ్మ సంబురాల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించిన కేసీఆర్ స‌ర్కార్ మ‌హిళ‌ల‌కు చీర‌లు పంపిణీ చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. దానికి చాలా ముందుగానే ఏర్పాట్లు చేసింది. నాణ్య‌మైన చీర‌లు పంపిణీ చేస్తామ‌ని కూడా మ‌హిళ‌ల‌ను న‌మ్మించింది. దాంతో చాలా మంది మ‌హిళ‌ల‌ను ప్ర‌భుత్వం ఇచ్చే చీర కోసం కూలీ. నాలీ ప‌నులు మానుకుని ఉద‌యాన్ని వ‌చ్చి క్యూ లైన్ల‌లో నిల‌బడి చీర‌లు తీసుకున్నారు. తీరా చీర నాణ్య‌త చూసిన త‌ర్వాత వాళ్లు మ‌హిళ‌ల క‌ళ్లు బైర్లు కమ్మాయి. నాసి ర‌కం చీర‌లు. ప‌ట్టు చీర‌లు ఇస్తామ‌ని చెప్పి. నాణ్య‌త లేని సూర‌ల్ సిల్క్ చీర‌లు ఇచ్చే స‌రికి వాళ్లు ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. చీర‌లు కాల‌బెట్టారు. అయితే ప్ర‌భుత్వం నాణ్య‌మైన చీరలే ఇస్తున్నామ‌ని బూకాయించే ప‌నే చేసింది. అంతే కాకుండా విప‌క్షాల‌పై ఎదురు దాడి చేసింది. కానీ గురువారం మీడియాలో వ‌చ్చిన వార్తా క‌థ‌నాన్ని ప‌రిశీలిస్తే మ‌హిళ‌ల‌కు ఇచ్చిన చీర‌ల్లో విప‌క్షాలు ఆరోపించిన‌ట్లుగా భారీ కుంభ‌కోణం దాగి ఉంద‌ని స్ప‌ష్టం అవుతుంది.

15 రోజుల క్రిత‌మే సిటీకి చెందిన మంత్రుల బంధువులు, రాష్ట్ర ప్ర‌భుత్వ రంగ సంస్ధ‌ అధికారి, టీఆర్ ఎస్ కు చెందిన నేత‌లు పాత‌బ‌స్తీలోని మ‌దినా మార్కెట్‌లో చీర‌లు బేరం మొద‌లు పెట్టారు. త‌క్కువ ధ‌ర‌కు చీర‌ల‌ను కొనేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. బ‌ట్ట‌ల వ్యాపారుల ద్వారా సూర‌త్ బ‌ట్ట‌ల ప‌రిశ్ర‌మ ఎజెంట్లను ప‌ట్టుకున్నారు. జీఎస్టీ కార‌ణంగా మ‌రీ ఇంత త‌క్క‌వ ధ‌ర‌ల‌కు చీర‌లు రావని చెప్ప‌టంతో జీఎస్టీ ప‌డ‌కుండా చ‌ర్య‌లు తీసుకున్నారు. అనుకున్న విధంగా నాసి ర‌కం చీర‌ల‌కు త‌క్కువ ధ‌ర‌కు పొందారు. వాటిని అధికారులెవ‌రూ ప‌రిశీలించ‌కుండానే మ‌హిళ‌ల‌కు పంపిణీ చేసేశారు. దీంతో మ‌హిళ‌లు నాసిర‌కం చీర‌ల‌పై మండిప‌డిన సంగ‌తి తెల్సిందే. ఈ చీరల ప‌థ‌కంలో భారీ కుంభ‌కోణం చోటు చేసుకుంద‌ని విప‌క్షాలు చేసిన ఆరోప‌ణ నిజ‌మ‌ని ఈ వార్త‌క‌థ‌నం స్ప‌ష్టం చేసింది. ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తారో చూడాలి. దీనిపై మీ స్పంద‌న తెలియ చేయండి. కామెంట్స్ చేయండి. నిజాన్ని వెలుగులోకి తెద్దాం.

Tags : , , , , , , , , , , , , , , , , ,