బంగారు తెలంగాణ దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయా?

mohanrao
kcr

తెలంగాణ ఆవిర్బావించిన రోజు నుంచి తెలంగాణ‌లో ప‌దే ప‌దే విన్పిస్తున్న మాట బంగారు తెలంగాణ‌. కొత్త రాష్ట్రం సిద్దించి మూడేళ్లు పూర్తి అయింది.

ప్ర‌భుత్వం ప‌ని తీరు ఆ దిశ‌గా సాగుతుందా? ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు, యువ‌త మ‌నోభావాలు ఎలా ఉన్నాయి. కేసీఆర్ స‌ర్కార్‌ పాల‌నా తీరు పై ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారనే చ‌ర్చ కొత్త‌ది కాక‌పోయినా ఈ సంద‌ర్భంగా మ‌రో సారి గుర్తుకు తెచ్చుకోవాల్సిన సంద‌ర్భం ఇది.

ప్ర‌తిప‌క్షాల‌కు కేసీఆర్ ఎప్ప‌టిక‌ప్పుడు షాక్‌లు ఇస్తూనే ఉన్నారు. అయినా తెలంగాణ‌లో బ‌ల‌మైన కేడ‌ర్ ఉండి , ఎన్నిక‌ల‌కు సిద్దం చేసుకుంటున్న పార్టీల్లో కాంగ్రెస్‌, బీజేపీ, టీడీపీలు త‌మ ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేస్తూనే ఉన్నారు. మ‌రో రెండేళ్ల‌లో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో పార్టీలు వేగం పెంచాయి. అయితే తెలంగాణ ఆవిర్బావ దినోత్స‌వాన్ని అంద‌రూ కూడా వేడుకుగా జ‌రుపుకుంటున్నారు. తెలంగాణ ప్ర‌జ‌ల చిర కాల కోరిక నేర వేరి మూడేళ్లు పూర్తి అయింది. ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌భుత్వం ఘ‌నంగా నిర్వ‌హిస్తోంది.

అమరుల త్యాగఫలం ఉద్యమకారుల పోరాటాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఆవతరణ వేడుకలకు సిద్ధమైంది. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుకలకు అసెంబ్లీ, సచివాలయంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లోని ముఖ్య కూడళ్లు, పోలీస్, ప్రభుత్వ కార్యాలయాలు విదుత్య్ కాంతుల అలంకరణతో మెరిసిపోతున్నాయి. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా వివిధ రంగాలలో సేవలు చేస్తున్న 52 మందిని రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలతో సత్కరించనున్నారు. సిఎం కె.చంద్రశేఖర్‌రావు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఉదయం నిర్వహించనున్న ఆవిర్భావ ఉత్సవాలకు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి, మూడేండ్ల పాలనపై ప్రసంగిం చనున్నారు.

అంతకుముందు ఆయన పరేడ్ గ్రౌండ్‌లో సైనిక అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్లుగా అమలుపరుస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు ఈ ఆర్థిక సంవత్సరంలో అమలు చేయనున్న కార్యక్రమాలను సిఎం కెసిఆర్ వివరించనున్నారు. పరేడ్ గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మంత్రులందరూ తమకు కేటాయించిన జిల్లాలలో ఆవతరణ వేడుకల్లో పాల్గొనన్నారు. రాష్ట్ర కేంద్రంతో పాటు ప్రతి జిల్లాలోనూ ఉత్సవాల నిర్వహణకు రూ. 10 లక్షల చొప్పున కేటాయించారు. ప్రతి గ్రామంలోనూ ఈ వేడు కలు జరగనున్నాయి. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఉత్సవాలు జరుగనున్నాయి.

ప్ర‌భుత్వాలు భారీగా ఉత్స‌వాలు నిర్వ‌హిస్తూన్నా, తెలంగాణ ప్ర‌జ‌లు ఆశించిన మేర ఫ‌లితాలు రావ‌టం లేద‌నే అసంతృప్తి రోజు రోజుకు పెరుగుతుంది. బంగారు తెలంగాణ సంగ‌తి అలా ఉంచి కనీస అవ‌స‌రాలు, కేసీఆర్ గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను అమ‌లు చేస్తే అదే చాలు అనుకుంటున్నారు. ముఖ్యంగా ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి. డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, ఇంటికో ఉద్యోగం వంటి అనేక స‌మ‌స్య‌ల‌పై ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. కేసీఆర్ ప్ర‌భుత్వ వైఖ‌రితో విభేదిస్తున్న చాలా మంది కొత్త పార్టీల వైపు అడుగులు వేస్తున్నారు. ఏమైనా తెలంగాణ స‌ర్కార్ బంగారు తెలం గాణ వైపు అడుగులు వేస్తున్న‌ట్లేనా?

Tags : , , , , , ,