తెలంగాణలో చంద్రబాబుకు మరో భారీ షాక్! | Telangana Government SHOCKS Chandrababu!

admin
telangana

Chandrababu Naidu, who announced the Telugu Desam Party as a national party, has shown that it is not in any way liable to do so in the state of Telangana. click on the below video to know more details of Telangana Government SHOCKS Chandrababu!

తెలుగుదేశం పార్టీని జాతీయ పార్టీగా ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు నాయుడుకి మ‌న ప‌క్క రాష్ట్రమైన తెలంగాణ‌లో రోజు రోజుకి పార్టీని వీడే నేత‌ల సంఖ్య పెరుగుతుండ‌టంతో ఏం చేయాలో దోచ‌టం లేద‌ని తెలుస్తోంది.

రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో చంద్ర‌బాబు నాయుడు తెలంగాణ‌కు అనుకూలంగా మొట్ట‌మొద‌ట లెట‌ర్ ఇచ్చిన చంద్ర‌బాబు తెర వెనుక మాత్రం తెలంగాణ విభ‌జ‌న‌కు ఆయ‌న శ‌క్తిమేర‌కు ప్ర‌య‌త్నం చేసిన సంగ‌తి తెల్సిందే. అంతే కాకుండా తెలంగాణ‌లో మీటింగ్ పెట్టి నా వ‌ల్లే తెలంగాణ వ‌చ్చింది. నేను లెట‌ర్ ఇవ్వ‌బ‌ట్టే కేంద్రం తెలంగాణ‌పై నిర్ణ‌యం తీసుకుంద‌ని ప్ర‌క‌టించారు. దీనిలో నిజం లేక‌పోలేదు. అదే ఏపీకి వెళ్లి ఏపీ అన్యాయంగా విభ‌జించారు. ఏపీని అనాధ చేశారు. స‌చివాల‌యం కూడా లేకుండా రోడ్డున ప‌డేశారంటూ మాట మారుస్తూ ప‌దే ప‌దే ఏపీలో మాట్లాడుతుండ‌టం తెలంగాణ‌లో టీడీపీ పార్టీకి తీవ్ర‌మైన న‌ష్టం జ‌రుగుతుంది. తెలంగాణ‌లో టీడీపీకి మంచి నిర్మాణం ఉంది. పార్టీ కోసం ప‌ని చేసే నేత‌లున్నారు. వారంతా టీడీపీ వెనుకే ముందుకు సాగాల‌ని భావిస్తున్నారు. కానీ చంద్ర‌బాబు నాయుడు వైఖ‌రి కార‌ణంగా ఆ పార్టీకి ఇబ్బందులు త‌ప్ప‌టం లేదంటున్నారు.

తెలంగాణ వ‌చ్చిన తొలినాళ్ల‌లో ఆయ‌న తెలంగాణ‌లో పార్టీ అధికారంలోకి వ‌చ్చే వ‌ర‌కు ఇక్క‌డ నుంచి వెళ్లేది లేద‌ని కేడ‌ర్‌కు భ‌రోసా ఇచ్చే మాట‌లు మాట్లాడే వారు. ఆ మాట‌లు తెలంగాణ‌లో టీడీపీ శ్రేణుల‌కు కొండంత శ‌క్తినిచ్చేవి. ఇప్పుడు కూడా అప్పుడ‌ప్పుడు తెలంగాణ‌లో మీటింగ్‌లకు వ‌చ్చినా కూడా మాట‌లో ఆ ప‌దును ఉండ‌టం లేదు. దానికి తోడు టీడీపీని కేసీఆర్ టార్గెట్ చేసి టీడీపీ ఆంధ్రా పార్టీగా ముద్ర వేయ‌టంలో స‌క్సెస్ అయ్యారు. 15 టీడీపీ ఎమ్మెల్యేల్లో 12 మందిని గోడ దూకించి పార్టీ కండువ క‌ప్పారు. తెలంగాణ‌లో టీడీపీకి భ‌విష్య‌త్తులో మ‌నుగ‌డ లేద‌నే సంకేతం ప‌దే ప‌దే ఇస్తున్నారు.

ఓటుకు నోటు కేసు నేప‌థ్యంలో చంద్ర‌బాబు నాయుడు అర్దాంత్రంగా హైద‌రాబాద్‌ను ఖాళీ చేయ‌టం తెలంగాణ టీడీపీ నేత‌ల‌కు ఇప్ప‌టికీ మింగుడు ప‌టంలేదు. ఇక భ‌విష్య‌త్ చంద్ర‌బాబు తెలంగాణ‌లో టీడీపీపై కేంద్రీక‌రించినా కూడా ఇది ఆంధ్ర పార్టీ అనే భావ‌న తెలంగాణ ప్ర‌జ‌ల్లో బ‌లంగా నాటుకు పోవ‌టంతో ఇప్పుడు టీడీపీ నేత‌లు చేయించుకుంటున్న స‌ర్వేల్లో పార్టీ ప‌రిస్ధితి ఏం బాగోలేద‌ని తేలిపోతుంది. తాజాగా చంద్ర‌బాబు కుడిభుజంగా పేరున్న నామా నాగేశ్వ‌రరావు పార్టీ ప‌రిస్థితిపై చేయించిన తాజా స‌ర్వేలోనూ అదే తేలింద‌ట‌. దాంతో ఆయ‌న టీడీపీకి గుడ్ బై చెప్పేసి కేంద్రంలో తిరుగులేని హ‌వా కొన‌సాగిస్తున్న న‌రేంద్ర‌మోడీ, అమిత్ షా జంట చెంత‌కు చేరిపోయ‌వాల‌ని భావిస్తున్నార‌ట‌. ఇది త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు.

Tags : , , , , , , , , , , , , , , , , ,