తెలంగాణ వ్య‌తిరేకిని ఆ ప‌ని చేయమంటున్నారట! | Telangana Leaders Requests for Lagadapati Survey?

admin
telangana

The Telangana movement was stirred up and another voice from Bezawada was raised. United Andhra. Telangana Seperate, however, will be a political sagandalam Annagramante Lagadapati Rajagopal. Click on the below video to know more details of Telangana Leaders Requests for Lagadapati Survey?

తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఉద్యమించిన వేళా అటు బెజవాడ నుంచి మరో గొంతు లేచింది. సమైక్య ఆంధ్రా అంటూ. తెలంగాణ సెపరేట్ అయితే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రకటించిన ఆంధ్రాగొంతే లగడపాటి రాజగోపాల్.

అవును తెలంగాణ రావడంతో ఆయన కూడ తన మాటకు కట్టుబడే ఉన్నారు. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత నిజంగానే లగడపాటి రాజకీయాలకు దూరంగా ఉన్నారు.ఆయన ఇప్పుడు సర్వేలంటూ మరోసారి తెరపైకి వచ్చారు. నిజానికి లగడపాటి సర్వేలో చాలానే జరుగుతున్నాయి కూడా. నంద్యాల ఉప ఎన్నికలే దానికి నిదర్శనం. నంద్యాలలో టీడీపీ విజయకేతనం ఎగురవేసిన అనంతరం లగడపాటి ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిశారు.దీంతో ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం తెలంగాణ‌లోనూ హాట్ టాపిక్ గా మారింది. ల‌గ‌డ‌పాటి చేయించే స‌ర్వే ప‌క్కాగా ఉంటుంద‌ని తెలంగాణ నేత‌లు న‌మ్ముతున్నార‌ట‌. దీంతో ఆయ‌న‌తో త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌ర్వే చేయించుకునేందుకు సంప్ర‌ధింపులు మొద‌లుపెట్టారట‌. ఆయ‌న‌కు స‌న్నిహితులుగా ఉండే వారితో కార్యం చ‌క్క‌బెట్టుకునేందుకు చూస్తున్నార‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ‌లో కేసీఆర్ నేత‌ల ప‌నితీరుపై వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపోట‌ముల‌పై లెక్క‌లు చెప్పారు. అయితే ఆంధ్ర ఆక్టోప‌స్ ఏం చెబుతారు అని తెలుసుకునేందుకు ఎక్కువ మంది కుతూహ‌లంగా ఉన్నార‌ట‌. ఆయ‌న అయితే క‌రెక్ట్ గా ప‌ల్స్ పట్టుకోగ‌ల‌ర‌ని అనుకుంటున్నార‌ట‌. ఇదిలా ఉంటే అటు ఏపీలో చంద్రబాబు కూడా లగడపాటి సర్వేలను చాలా సీరియస్ గానే తీసుకుంటున్నారని మంత్రివర్గం చెప్తుంది. ఏదేమైనా ఏపీలో లగడపాటి రాజకీయాలకు దూరంగా ఉన్నా బిజినెస్ లో భాగంగా సర్వేల్లో కూడా తనదైన శైలిని ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ కూడా లగడపాటితో చర్చలు జరపవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ల‌గ‌డ‌పాటి లాంటి వ్య‌క్తికి ఇక్క‌డ ఏం ప‌ని అంటూ కొంత మంది తెలంగాణ వాదులు ప్ర‌శ్నిస్తున్నార‌ట‌. ఆయ‌న పార్ల‌మెంట్ లో మన నేత‌ల‌కు చేసిన ఘ‌ణ కార్యం చాలాని ఇప్పుడు మ‌ళ్లీ స‌ర్వేల పేరుతో తెలంగాణ రాజ‌కీయాల్లోకి తీసుకువ‌చ్చి మ‌ళ్లీ ఇప్పుడు కూడా వారి పెత్త‌నాన్ని పెంచి పోషించ‌వ‌ద్ద‌ని అంటున్నార‌ట‌. అయితే ఆయ‌న‌తో స‌ర్వేలు చేయించుకునేందుకు టీఆర్ ఎస్ నేత‌లు కూడా కొంత మంది ముందుకు వ‌స్తున్నార‌నే గుస‌గుస‌లు విన‌బ‌డుతున్నాయి.. ల‌గ‌డ‌పాటితో స‌ర్వే చేయించుకునేందుకు తెలంగాణ నేత‌లు పోటీ ప‌డుతుండ‌టంతో ఇది తెలిసిన చాలా మంది విమ‌ర్శ‌లు చేస్తున్నారు. తెలంగాణ‌కు అంద‌రికంటే బ‌ద్ద శ‌త్రువు అయిన వ్య‌క్తితో ఎలా స‌ర్వే చేయిస్తార‌ని అంటున్నారు… ఏది ఏమైనా రాష్ట్రం విడిపోయినా కూడా ల‌గ‌డ‌పాటి కార్యం భాగానే న‌డుస్తుంద‌న‌డంలో సందేహం లేదు…మొత్తానికి తెలంగాణ నుంచి త‌ట్టా బుట్టా స‌ర్థుకున్న ఈయ‌న‌గారికి ఇప్పుడు రాజ‌కీయాల్లో లేక‌పోయిన రాజ‌కీయంగా మంచి ఆశ్ర‌యం దొరికింద‌ని విశ్లేష‌కులు జోకులు కూడా వేస్తున్నారు. అయితే ఇంత‌కీ ల‌గ‌డ‌పాటితో స‌ర్వే చేయించుకునే నేత‌లు ఎవ‌రూ… నిజంగానే ఆయ‌న ఇక్క‌డ స‌ర్వే చేయ‌నున్నారా అనేది తేలాలంటే మాత్రం మ‌రి కొన్ని రోజులు ఆగాల్సిందే…

Tags : , , , , , , , , , , , , , , ,