చంద్ర‌న్న‌కే దిక్కులేదు! ఇక ఐల‌య్య సంగ‌తా? | TG Venkatesh SHOCKING Comments on Kancha Ilaiah

admin
chandra

AP CM Chandrababu Naidu came to the new ruckus. The incident that once again reminded him of the shame.click on the below video to know more details of TG Venkatesh SHOCKING Comments on Kancha Ilaiah

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడుకు కొత్త చిక్కు వ‌చ్చి ప‌డింది. మ‌రోసారి ఆయ‌న‌కు జ‌రిగిన అవ‌మానం గుర్తు చేసే సంఘ‌ట‌న చోటు చేసుకుంది.

కంచ ఐల‌య్య వైశ్యుల‌పై సామాజిక స్మ‌గ్ల‌ర్లు కోమ‌టోళ్లు అనే పుస్త‌కం రాసి , వివాదంలో చిక్కుకున్న విష‌యం తెల్సిందే. ఈ పుస్త‌కం మార్కెట్‌లో విడుద‌ల అయిన నాటి నుంచి కూడా పెద్ద రాద్దాంత‌మే న‌డుస్తోంది. వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన వాళ్లు త‌మ‌ను కంచ ఐల‌య్య అవ‌మానించార‌ని వారు మండిప‌డుతున్నారు. ఈ పుస్త‌కాన్ని నిషేదించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఐల‌య్య బేష‌ర‌తుగా క్ష‌మాప‌న చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఐల‌య్య దిష్టిబొమ్మ‌ల‌ను ద‌గ్గం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నిర‌స‌న‌లు వెల్లువెత్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో టీడీపీ ఎంపీ టీజీ వెంక‌టేశ్ ఐల‌య్య‌పై తీవ్ర‌మైన వ్యాఖ్య‌ల‌చేశారు. హైద‌రాబాద్‌లో ఐల‌య్య పుస్త‌కంపై జ‌రిగిన రౌండ్ టేబుల్ స‌మావేశంలో పాల్గొన్న టీజీ వెంక‌టేశ్ ఐల‌య్య‌ను ఉద్దేశించి ప‌రుష‌మైన ప‌దాల‌తో దాడి చేశారు. ఇదే విదేశాల్లో అయితే ఆయ‌న్ని న‌డి రోడ్డుపై న‌రికి చంపేసేవార‌న్నారు. ఆయ‌న్ని న‌డిరోడ్డుపై ఉరి తీసి చంపాల‌ని టీజీ వెంక‌టేశ్ డిమాండ్ చేశారు. టీజీ వెంక‌టేశ్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఐల‌య్య‌ను స‌మ‌ర్దించే వాళ్లు విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. ఇటీవ‌ల తెలంగాణలో ఏర్ప‌డిన తెలంగాణ సామాజిక వేదిక (టీ-మాస్‌)కు సంబంధించిన నేత‌లు టీజీ వెంక‌టేశ్ వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. అంతే కాకుండా ఇరు రాష్ట్రాల సీఎంల‌కి దీనితో లింక్ పెట్టారు. ఐల‌య్య‌పై టీజీ వ్యాఖ్య‌ల‌కు ఏపీ సీఎంకి ఏమిటి సంబంధం అనే అనుమాన వ‌స్తుందా? ఈ వీడియో సాంతం చూడండి మీకే తెలుస్తోంది.

టీజీ వ్యాఖ్య‌ల‌పై కంచ ఐల‌య్య మీడియా స‌మావేశంలో మాట్లాడారు. టీడీపీ ఎంపీ అయిన టీజీ వెంక‌టేశ్ వ్యాఖ్య‌ల‌పై ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు స్పందించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. చంద్ర‌బాబు నాయుడు ఈ వ్యాఖ్య‌ల‌పై స్పందించ‌ని ప‌క్షంలో బాబు కూడా టీజీ వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్దించిన‌ట్లుగా తాము భావిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే తెలంగాణ సీఎం కేసీఆర్ టీజీ అభిప్రాయంతో ఏకీభావిస్తూ క‌లిసి న‌డుస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఇక చంద్ర‌బాబు స్పంద‌న కోసం ఎదురు చూస్తున్నాం అన్నారు.

త‌న‌ను న‌డిరోడ్డుపై ఉరి తీయాల‌ని డిమాండ్ చేసిన టీజీపై వ్యాఖ్య‌ల‌పై స్పందించాల‌ని కోరుతున్న కంచ ఐల‌య్య‌కు అస‌లు చంద్ర‌బాబు నాయుడుకి కూడా ఇటువంటి అనుభ‌వం ఎదురైంద‌నే సంగ‌తి తెలుసా? తెలియ‌దా? అనే చ‌ర్చ మొద‌లైంది. నంద్యాల ఉప ఎన్నిక‌ల సంద‌ర్బంగా ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చంద్ర‌బాబు నాయుడ్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు వివాద‌స్ప‌దం అయ్యాయి. బాబు ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన వాగ్దానాలు అమ‌లు చేయ‌కుండా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను మోసం చేసినందున‌ న‌డిరోడ్డుపై ఉరి తీసినా త‌ప్పు లేద‌ని జ‌గ‌న్‌ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌ల‌కే ఏం చేయాలో తెలియ‌క బాబు త‌ల‌ప‌ట్టుకున్నారు. ప‌దే ప‌దే ప్ర‌జ‌లకు గుర్తు చేస్తూ సానుభూతి సంపాదించే ప‌నిలో చంద్ర‌బాబు ఉన్నారు. ఇప్పుడు ఐల‌య్య చేసిన డిమాండ్ మ‌ళ్లీ పాత విష‌యాన్ని మ‌రోసారి గుర్తుకు తెచ్చిన‌ట్లు అయిందంటున్నారు. జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌పై ఎన్నిక‌ల క‌మిష‌న్ వైఎస్ జ‌గ‌న్‌కు నోటీసులు ఇచ్చి కేసు రిజిస్ట‌ర్ చేసిన సంగ‌తి తెల్సిందే. అదీ ఎన్నిక కోడ్‌ను ఉల్లంఘించిన కేసులో. అంతే త‌ప్పా, చంద్ర‌బాబు నాయుడు ఈ విమ‌ర్శ‌ల విష‌యంలో చేసిందేమి లేదు. ఆయ‌న‌పై చేసిన వ్యాఖ్య‌ల‌కే దిక్కులేదు. ఇప్పుడు ఐల‌య్య‌పై టీజీ చేసిన వ్యాఖ్య‌ల‌ను చంద్ర‌బాబు ఏం చేస్తారు? అని చాలా మంది పెద‌విరుస్తున్నారు. అయినా చంద్ర‌బాబు నాయుడుకు ఓట్ల లెక్క‌లు ఉంటాయి. బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన ఐల‌య్య విష‌యంలో బాబు మాత్రం ఆచితూచి వ్య‌హ‌రిస్తార‌ని ప‌రిశీల‌కులు విశ్లేషిస్తున్నారు.

Tags : , , , , , , , , , , , , , , , , , ,