మమత ఆరోపణలకు సైన్యం దీటైన జవాబు!

surendra a
eb

పశ్చిమ బెంగాల్లో సైన్యం నిర్వస్తున్న తనిఖీలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని భారత ఆర్మీ నిరూపించింది.

సైన్యం తనిఖీలపై సహకరించాలంటూ తాము ముందుగానే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి తెలిపామని వెల్లడించింది. దీనికి సంబంధించిన నాలుగు ప్రభుత్వ శాఖలకు రాసిన లేఖలను విడుదల చేసింది. సంబంధిత అధికారులకు తనిఖీల గురించి ముందుగానే తెలుసునని ఆర్మీ విడుదల చేసిన లేఖలను బట్టి స్పష్టమవుతోంది. దీంతో నోట్ల రద్దుపై పోరాడుతున్నందుకే కేంద్రం సైన్యాన్ని మోహరించిందంటూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను సైన్యం చిత్తు చేసినట్టయింది.

బెంగాల్ ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని అనుమతులూ తీసుకున్నామంటూ.. మేజర్ జనరల్ సునీల్ యాదవ్ అధికారిక ప్రకటన విడుదల చేసిన గంట సేపటిలోనే ఆర్మీ ఈ లేఖలను విడుదల చేసింది. ఆర్మీ తనిఖీకు వారం రోజుల ముందే నవంబర్ 24న తాము అన్ని రకాల అనుమతులు తీసుకున్నామని సునీల్ యాదవ్ పేర్కొన్నారు. ఆర్మీ విడుదల చేసిన లేఖలు మేజర్ జనరల్ సునీల్ ప్రకటనతో సరిగ్గా సరిపోలాయి. స్థానిక పోలీసులు, సీపీ, ఇతర అధికారులకు గత వారం రోజుల క్రితమే స్వయంగా చేతికి అందించినట్టు తేదీలతో సహా లేఖల్లో పేర్కొనడం విశేషం. తమకు సమాచారం ఇవ్వకుండా కేంద్ర బలగాలు మొహరించారని హడావుడి చేసిన ఆమె సెల్ఫ్‌ గోల్‌ చేసుకున్నట్టైంది. ఇప్పుడెలా స్పందిస్తారో చూడాలి

Tags : , , , , , , ,