ప‌క్క‌పార్టీల వైపు టీఆర్ఎస్ కేడ‌ర్ చూపు ?|TRS Leaders To JOIN Congress and BJP?

admin
trs

So far, MLAs have seen the leaders of the populist in the ruling party.click on the below video to know more details of TRS Leaders To JOIN Congress and BJP?

ఇప్ప‌టి వ‌ర‌కు అధికార పార్టీలోకి ఎమ్మెల్యేలు పాపులార్టీ ఉన్న నేత‌లు రావ‌డం చూశాం.

కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అధికార పార్టీకి చెందిన కేడ‌ర్ ప‌క్క‌పార్టీల వైపు చూస్తున్న‌ట్లుగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం టీఆర్ ఎస్ పార్టీలోకి చేరిన చాలా మంది నాయ‌కులు ఇప్పుడు త‌మ‌కు త‌గినంత ప్రాధాన్య‌త ఉండ‌టంలేద‌ని వాపోతున్నార‌ట‌. టీ స‌ర్కార్ అధికారంలోకి వ‌చ్చి మూడేళ్లు పూర్త‌యింది. 14 ఏండ్లు అధినేత అడుగులో అడుగై అన్ని పిలుపుల‌కు స్పందించి వ్య‌క్తిగ‌త‌, రాజ‌కీయ జీవితాల‌ను ప‌ణంగా పెట్టి పోరాటంలో ముందు నిలిచారు. ఇన్నేండ్లు త‌మ ప‌నితీరును చూసిన మీ ప్ర‌భుత్వ‌మే ఏర్ప‌డింది.. ఇంకేం మీ ప్ర‌భుత్వంలో నీదే హ‌వా అన్నారు. తీరా చూస్తే మూడేళ్ల‌యినా ఇంత‌వ‌ర‌కు ఓ ప‌ద‌వి లేదు అని కొంత మంది నేత‌లు త‌మ అనుచ‌రుల వ‌ద్ద వాపోతున్నార‌ట‌.అప్ప‌ట్లో ప్ర‌భుత్వాల‌కు వ్య‌తిరేకంగా పోరాడి ఎంత నిర్బందిచినా ఉద్య‌మ స్పూర్తిని కాపాడిన త‌మ‌కు ఎలాంటి భ‌రోసా లేదంటూ ఆవేద‌న చెందుతున్నార‌ట‌. ఎదైనా ఒక‌రోజు వస్తుంది కాదా అనుకుంటూ మూడేళ్ల‌పాటు పార్టీనే అంటిపెట్టుకొని ఇటు ప్రాధాన్య‌త లేక అటు పార్టీని విడ‌వ‌లేక .. పార్టీలో కొన‌సాగ‌లేక ముందు నుయ్యి .. వెన‌క గొయ్యిలా వారి ప‌రిస్థితి త‌యార‌యింది. దీంతో ఇటీవ‌ల ఓ మంత్రి వ‌ద్ద యాకూబ్ ఖాన్ చేసిన ఆత్మ‌హ‌త్య ప్ర‌య‌త్నం అందులో భాగ‌మే. ఇలాంటి వారు ఇంకా ఎంతో మంది టీఆర్ ఎస్ శ్రేణులు ఉన్నార‌ట‌.

అధికారం వ‌చ్చి మూడేళ్ల‌యినా నామినేటెడ్ ప‌ద‌వులు ఇచ్చింది లేదు. అడ‌పా ద‌డ‌పా ఇస్తూ మొక్కుబ‌డి తంతుగా మార్చారు. అధికారం వ‌చ్చిన వెంట‌నే ప‌ద‌వులు భ‌ర్తీ చేసి ఉంటే ఓ ట‌ర్మ్ పూర్త‌యి రెండో ట‌ర్మ్ కూడా మ‌రికొంద‌రికి అవ‌కాశం ద‌క్కేది. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 3500 మంది వ‌ర‌కు నామినేటెడ్ ప‌ద‌వులు ద‌క్కాయి. గ‌త ఏడాదిగా ఇంకా అదిగో ఇదిగో అని ఊరిస్తున్నారు త‌ప్పితే ఇవ్వ‌డం లేదు. స‌రిగ్గా పూర్తి చేస్తే ఇంకో 3000 ప‌ద‌వులు వ‌స్తాయి. ఇప్పుడు చిన్నా చిత‌కా ప‌ద‌వులు ఇచ్చినా తీసుకుని అనుభ‌వించాల‌న్న సంతోషంలో క్యాడ‌ర్ లేకుండా పోయింద‌ట‌.మొద‌టి నుండి పార్టీలో ఉన్న వారికి ఇప్పుడు వ‌చ్చిన నేత‌ల నుండి ఏ మాత్రం గౌర‌వం ల‌భించ‌డం లేదని అంటున్నారు.గ‌తంలో త‌మ‌తో స‌న్నిహితంగా ఉన్న‌వారు ఎప్పుడ‌యినా స‌మ‌స్య చెబితే స్పందించేది. కానీ అధికారం వ‌చ్చిన త‌రువాత వారు స‌మ‌స్య‌ల‌ను వినే స‌మ‌యం లేదు అని వాపోతున్నారు.. పాత కార్య‌క‌ర్త‌లు క‌నిపిస్తే మీద చేయి వేసి వెళ్లిపోవ‌డం త‌ప్పితే ఎందుకొచ్చావ్ అని ఆరా తీసే ప‌రిస్థితి లేద‌ని అంటున్నారు..దీంతో ఇలాంటి అసంతృఫ్త‌లు అంతా ఇత‌ర పార్టీల‌కు వెళ్లాల‌నే యోచ‌న చేస్తున్నార‌ట‌. ఎలాగో త‌మ‌కు ఈ పార్టీలో గౌర‌వం ఇవ్వ‌డం లేదు కాబ‌ట్టి ఇత‌ర పార్టీల‌కు వెళితే అక్క‌డ పార్టీలో కీల‌క ప‌ద‌వులు తీసుకొని తామే లీడ‌ర్లుగా క్షేత్ర స్థాయిలో కాస్త గౌర‌వంగానైనా ఉండ‌వ‌చ్చ‌ని ఆలోచ‌న చేస్తున్నార‌ట‌. ఇక ఇప్ప‌టికే అసంతృప్తుల‌పై క‌న్నువేసిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీని వారిని లాక్కునేందుకు సిద్ద‌మైంద‌ట‌. మొత్తానికి అధికారం వ‌చ్చే వ‌రకు కంటికి రెప్ప‌లా పార్టీని కాచుకున్న‌వారికి కాద‌ని ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన వారిని అంద‌లం ఎక్కించ‌డంపై గులాబీ శ్రేణులు కాస్త ఘాటుగానే ఉన్నాయ‌ట‌.

Tags : , , , , , , , , , , , , , , ,