కేసీఆర్ కు మ‌రో ప‌రీక్ష‌ తెలంగాణ‌లో మ‌రో ఉప‌పోరు|TRS Vs BJP | Byelections in Telangana?

admin
kcr

In the Telangana, another by-election is Nagara Murga .. on the TRAs Sarkar with this by-election, once again to look up the Samaramaamanda to say that the argument is very much.click on the below videos to know more details of TRS Vs BJP | Byelections in Telangana?

తెలంగాణ‌లో మ‌రో ఉప ఎన్నిక న‌గారా మ్రోగ‌నుందా.. టీఆర్ఎ స్ స‌ర్కార్ పై ఈ ఉప ఎన్నిక‌తో మ‌రోసారి సమ‌ర శంకారావాన్నిపూరించేందుకు బీజేపీ సిద్థ‌మైందా అంటే అవున‌నే వాద‌న‌లే ఎక్కువ‌గా విన‌బ‌డుతున్నాయి.

కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా తెలంగాణకు చెందిన బీజేపీ నేత‌, సికింద్రాబాద్ ఎంపీ ‘బండారు దత్తాత్రేయ’ను పదవి నుంచి తొలగించిన విష‌యం తెలిసిందే.ఆయ‌న వెంట‌నే రాజీనామా స‌మ‌ర్పించేశారు. వాస్తవానికి దత్త‌న్న‌ను ఇంత తొందరగా తొలగిస్తారని ఎవ‌రూ ఊహించ‌లేదు.ఇక‌, ఇప్పుడుద‌త్త‌న్న గురించి మ‌రో సంచ‌ల‌న వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన ద‌త్త‌న్న‌.. త్వ‌ర‌లోనే లోక్‌సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తారని అంటున్నారు. బీజేపీ అధిష్టానం త్వ‌ర‌లోనే ఆయనకు గవర్నర్‌ పదవి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసిన‌ట్టు తెలుస్తోంది. ఇదే కనుక నిజం అయి ఆయన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే.. ఉపఎన్నికలు రావ‌డం ఖాయం అని అంటున్నారు.ఆయ‌న స్థానంలో అంబ‌ర్ పేట్ ఎమ్మెల్యే పార్టీ సీనియ‌ర్ నేత అయిన కిషన్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి ఆరు నెలల లోపు సికింద్రాబాద్ ఉప ఎన్నిక జరిపాలని చూస్తున్నార‌ట‌. ఇందుకోసం ఆ ఎన్నికను ఏకగ్రీవం చేయడానికి కేసీఆర్ మద్దతు అవసరం కనుక ఆయ‌న‌తో చర్చలు జరిపేందుకే ఢిల్లీకి పిలిపించార‌ని మ‌రికొంత మంది అంటున్నారు. ఒకవేళ కేసీఆర్ తో చ‌ర్చ‌లు స‌ఫ‌లం కాక‌పోతే మాత్రం ఎన్నికల్లో పోటీ చేసి గెల‌వాల‌ని చూస్తున్నార‌ట‌.

నిజానికి తెలంగాణ‌లో గత మూడున్నరేళ్ల నుంచి ఎలాంటి ఎన్నిక‌లూ జ‌ర‌గ‌లేదు. దీంతో అధికార పార్టీపై ప్ర‌జ‌ల నాడి ఎలా ఉందో తెలియ‌డం లేదు. పైకి అంతా బాగానే ఉన్న‌ట్టుగా ఉన్న‌ప్ప‌టికీ.. లోలోన మాత్రం కేసీఆర్‌, ఆయ‌న టీంపై ప్ర‌జ‌ల్లో అసంతృప్తి ఉంద‌ని అంటున్నాయి విప‌క్షాలు. ఈ విష‌యం తాజా ఉప పోరుతో తేలిపోతుంద‌ని చెబుతున్నారు విశ్లేష‌కులు. గత ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి బీజేపీ, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు పోటీపడగా బీజేపీ గెలిచింది. ఇక‌, ఇప్పుడు ఉపఎన్నిక వస్తే బీజేపీకి పోటీకిగా టీఆర్ ఎస్ మాత్ర‌మే బ‌రిలో నిల‌వ‌గ‌లుగుతుంది. అయితే ఈ ఆ స్థానం నుంచి పోటీ చేసేది ఓ కేంద్ర మంత్రి కావ‌డం ఇక ప్ర‌స్తుతం అది బీజేపీ ఖాతాలో ఉండ‌టంతో ఈజీగా గెలిచే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ వేత్త‌లు అంటున్నారు. ఇక టీఆర్ ఎస్ ఈ ఎన్నిక‌ల్లో క‌నుక పోటీ చేసి ఓడితే మాత్రం ఆ పార్టీపై వ్య‌తిరేక ఏర్ప‌డింద‌ని ప్ర‌చారం చేసేందుకు కూడా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అంటున్నారు. ఇక అంబ‌ర్ పేట నుంచి కూడా ఉప ఎన్నిక జ‌ర‌గాల్సి ఉంటుంది కావునా ఈ రెండు ఎన్నిక‌లు బీజేపీకి ప్ర‌తిష్టాత్మ‌కం కానున్నాయి. మ‌రో వైపు అధికార టీఆర్ ఎస్ పై గత మూడున్నరేళ్ల కేసీఆర్‌ పాలనలో నగర ప్రజలు నరకం చవిచూస్తున్నారు. పూర్తికానీ మెట్రోరైలు, ఇంకా మొదలు కానీ డబుల్‌బెడ్‌రూమ్‌ ఇళ్లు, గుంతలు పడిన రోడ్లు వెరసి అభివృద్ధికి ఆమడ దూరంలో నగరం ఉండడం అధికారపార్టీపై ప్ర‌జ‌ల్లో పీక‌ల్లోతు ఆగ్ర‌హం ఉంది. అదేస‌మ‌యంలో తెలంగాణ ఉద్యమ సమయంలో లక్షలాది ఉద్యోగాలు వస్తాయని ఊరించిన కేసీఆర్‌ ఇప్పుడు ఉద్యోగాల ఊసెత్తకపోవడంతో ఆయ‌న‌పై వ్య‌తిరేక‌త ఏర్ప‌డింది. ఈ ప‌రిణామాల‌న్నింటిని ఉపయోగించుకొని బీజేపీ బ‌ల‌ప‌డేందుకు సిద్ధ‌మౌతున్న‌ట్లు తెలుస్తోంది ఇక ఇదే క‌నుక నిజ‌మైతే మాత్రం తెలంగాణ‌లో మ‌రో ఉప పోరు త‌ప్ప‌ద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

Tags : , , , , , , , , , , , , , , ,