‘వంగ‌వీటి’కి ప‌వ‌న్‌ ఆల్ట‌ర్నేట్ లీడ‌రా?

2014 ఎన్నిక‌ల్లో తేదేపా వైపు కాపు ఓట్ల‌ను మ‌ర‌ల్చాడు ప‌వ‌న్‌. ద‌శాబ్ధాల పాటు కొన‌సాగిన చ‌రిత్ర‌ను ప‌వ‌న్ మార్చ‌గ‌లిగాడ‌ని అనుకోవ‌చ్చా? ఆ ఇమేజ్ దృష్ట్యా ప‌వ‌న్‌ని వంగ‌వీటి రంగాకి ఆల్ట‌ర్నేట్ అని అనుకోవ‌చ్చా? 

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ స్థాపించి ప్ర‌జ‌ల్లోకి వెళ్లాడు. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ గెల‌వ‌డం వెన‌క ప‌వ‌న్ కృషి విస్మ‌రించ‌లేనిది. ముఖ్యంగా గోదావ‌రి జిల్లాల్లో కాపు ఓట్ల‌న్నీ గంప‌గుత్త‌గా తేదేపాకి ప‌డ‌టానికి ప‌వ‌న్ చేసిన ప్ర‌చారం ఓ కార‌ణం. ప‌వ‌న్ వ‌ల్ల‌నే చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చార‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కుల మాట‌. అయితే దీని వెన‌క కులం ప్ర‌భావం ఉంద‌నేది ఓ విశ్లేష‌ణ‌. బెజ‌వాడ స‌ర్కిల్‌లో వంగ‌వీటి రంగాకి, ఆ కుటుంబానికి ఉన్న బ‌లం గురించి తెలిసిందే. 80ల‌లో వంగ‌వీటి రంగాని కాపులు దేవుడిగా కొలిచారు. అందుకే ఆ వ‌ర్గం ఓట్లు ఇప్ప‌టికీ రంగా ఫ్యామిలీకే ఉంటాయి. 

వంగ‌వీటి రంగా తాను హ‌త్య‌కు గుర‌య్యేప్ప‌టికి కాంగ్రెస్ లెజిస్లేట‌ర్‌గా ఉన్నారు. అందువ‌ల్ల క‌మ్మ సామాజిక‌ వ‌ర్గం డామినేష‌న్‌ని అణ‌చివేయ‌డానికి పుట్టిన మ‌హానేతగా వంగ‌వీటిని కాపులు, సామాన్య ప్ర‌జ‌లు కొలిచారు. అందుకే ఇప్ప‌టికీ కాపు వ‌ర్గం ఓట్లు క‌మ్మ సామాజిక వ‌ర్గానికి ఇప్ప‌టికీ దూర‌మైపోయాయి. అయితే వంగ‌వీటి జ్ఞాప‌కాల‌తోనే ఇప్ప‌టికే తేదేపా వ్య‌తిరేక పార్టీల‌కు కాపు వ‌ర్గం ఓటేస్తోంది. అయితే చాలా కాలానికి ప‌వ‌న్ వ‌చ్చి కాపుల మైండ్‌సెట్‌ని మార్చ‌గ‌లిగాడు. అత‌డి ప్ర‌భావంతోనే 2014 ఎన్నిక‌ల్లో తేదేపా వైపు మ‌ళ్లి ప్ర‌జ‌లు తేదేపాకి ఓటేశారు. అంటే ద‌శాబ్ధాల పాటు కొన‌సాగిన చ‌రిత్ర‌ను ప‌వ‌న్ మార్చ‌గ‌లిగాడ‌నే దాన‌ర్థం. అంటే అత‌డు మొన‌గాడి కిందే లెక్క‌. ఆ ఇమేజ్ దృష్ట్యా ప‌వ‌న్‌ని వంగ‌వీటి రాంగాకి ఆల్ట‌ర్నేట్ నేత‌గా జ‌నం ప‌రిగ‌ణిస్తున్నార‌ని అనుకోవ‌చ్చా? లేదూ ఉమ్మ‌డి రాష్ట్రం నుంచి విడివ‌డి స్వ‌తంత్య్రంగా ఏర్ప‌డిన న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధికి చంద్ర‌బాబు లాంటి అనుభ‌వ‌జ్ఞుడైన నేత అవ‌స‌రం అని భావించ‌డం వ‌ల్ల‌నే ప్ర‌జ‌ల ఓట్లు తేదేపాకి ప‌డ్డాయ‌ని అనుకోవాలా? ఏదేమైనా 2019 ఎన్నిక‌ల ర‌ణ‌రంగంలో జన‌సేనాని ప‌వ‌ర్ ఎంతో తెలుస్తుంది. ఒక‌వేళ ప‌వ‌న్ హ‌వా ఈసారి కూడా సాగితే అప్పుడు కాపు సామాజిక వ‌ర్గానికి ప‌వ‌న్ ఆల్ట‌ర్నేట్ నేత‌గా భావించ‌వ‌చ్చు. వంగ‌వీటిని కొట్టే నేత‌గానూ అభివ‌ర్ణించ‌వ‌చ్చు. జ‌స్ట్ వెయిట్ అండ్ సీ.

Add your comment

Your email address will not be published.