ఉప రాష్ట్రపతిగా ఉంటూ ఏపీ ప్రత్యేక హోదా కోసం!! | Vice President Venkaiah Naidu to Still SUPPORT AP

admin
ap

The relationship between Andhra Pradesh Chief Minister Chandrababu and Vice President Venkiah Naidu is known to all.click on the below video to know more details of Vice President Venkaiah Naidu to Still SUPPORT AP

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు – ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ల మధ్యన సంబంధం అందరికీ తెలిసిందే.

పార్తీలకి అతీతంగా ఇద్దరికీ ప్రేమాభిమానాలు ఉన్నాయి అనేది చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. బీజేపీ తో బాబు దోస్తానా జరగడానికి అసలు కారణం వెంకయ్య అని అందరికీ తెలుసు. బాబు మీద వెంకయ్య ప్రేమా, వెంకయ్య మీద బాబు ప్రేమా ఎప్పటికప్పుడు ఓపెన్ గా చూపించుకుంటూ నే ఉంటారు కూడా. వెంకయ్య కేంద్రం లో లేరు అనే బెంగ చంద్రబాబు కి ఎప్పుడో మొదలైంది. బాబుపై మోడీకి అభిమానం అంతంత మాత్రమేనని.. వెంకయ్య కారణంతోనే ఇప్పుడున్న స్థాయిలో ఉందన్న అభిప్రాయాన్ని పలువురు నేతలు వ్యక్తం చేస్తుంటారు. రాజకీయంగా మాత్రమే కాక వ్యక్తిగతంగా కూడా వెంకయ్య కి చాలా క్లోజ్ అయిన చంద్రబాబు ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు తీసుకున్న వెంకయ్య కి తెలుగు రాష్ట్రము ఏపీ లో అడుగు పెట్టడమే కనీ వినీ ఎరుగని సన్మాన ఏర్పాట్లు చేసారు.

గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బెజవాడ కనకదుర్గమ్మ వారధి వరకూ భారీ మానవహారాన్ని ఏర్పాటు చేశారు.ఆగస్టు 26న నిర్వహించిన అపూర్వ పౌరసన్మానాన్ని తన జీవితంలో మర్చిపోలేనని నాటి సభలో వెంకయ్య చెప్పుకున్నారు. నిజమే.. 26 కిలోమీటర్ల పాటు వేలాది మందిని నిలబెట్టి.. వారి చేత పూలు చల్లిస్తే.. ఏ నేత మాత్రం ఆ అభిమానానికి పిధా కాకుండా పోతారు. అయితే ఎప్పటికీ ఆ రకమైన వెల్కం నీ ప్రేమ నీ తాను మర్చిపోలేకపోతున్నాను అంటూ వెంకయ్య తన సన్నిహితులతో అంటున్నారు అని తెలుస్తోంది. ఇంతప్రేమ చూపించిన ఏపీ కి ఖచ్చితంగా మంచి చెయ్యాలి అనీ ప్రత్యెక హోదా ఇచ్చే చాన్స్ ఎటూ లేదు కాబట్టి మోడీ తో మాట్లాడి తాను కేంద్రం లో మంత్రిగా ఉన్న టైం లో ఏపీ కి ఎలాంటి సహాయం అందిందో అలాంటిదే ఇప్పుడు కూడా అందేలా ప్లాన్ చెయ్యాలని వెంకయ్య కోరబోతున్నట్టు సమాచారం. లేదంటే విభజనతో ఏపీకి జరిగిన నష్టాన్ని హోదాతో భర్తీ చేసే అవకాశాన్ని పరిశీలించి.. ఆ దిశగా మోడీ సర్కారు నిర్ణయం తీసుకునేలా చేస్తే.. నిజంగానే వెంకయ్యను ఏపీ ప్రజలు ఎప్పటికి మర్చిపోలేరు.

Tags : , , , , , , , , , , , , , , , ,