కార్యకర్తలను గెటౌట్ అన్నబాలయ్య కారణమిదే !! | What? Balakrishna ASKED his SUPPORTERS to GET OUT??

admin
getout

In the Hindupur constituency where Nandamuri Balakrishna is represented, the ‘Thuruvula’. Click on the below video to know more details of What? Balakrishna ASKED his SUPPORTERS to GET OUT??

సినీనటుడు నందమూరి బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ‘తమ్ముళ్ల’ మధ్య తగువులాట మొదలైంది.

మరీముఖ్యంగా నియోజకవర్గంలో అన్నీతానై వ్యవహరిస్తున్న బాలకృష్ణ (పీఏ) శేఖర్‌ తీరు వివాదాస్పదంగా మారిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఆయ‌న స‌మ‌క్ష్యంలోనే మ‌రోసారి తెలుగు తమ్ముళ్లు కుమ్ములాట‌కు దిగారు. దీంతో హిందూపురం టీడీపీ నేతల మధ్య సమన్వయం లేకపోవడం పట్ల ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సీరియస్ అయ్యారు. అందరూ కలసి పనిచేయాలని… లేకపోతే పార్టీ నుంచి వెళ్లిపోవాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూపురంలోని తన నివాసంలో పార్టీ నేతలతో నిన్న బాలయ్య సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో నేతల మధ్య గ్రూపు తగాదాలు మరోసారి బయటపడ్డాయి. బాలయ్య ముందే నేతలు ఒకరిపై మరొకరు విమర్శలకు దిగారు. దీంతో, బాలయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ తనతో పాటు కలసి పనిచేయాలని… లేకపోతే వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చారు.

ఈ సందర్భంగా బాలయ్యా మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ప్రజల చెంతకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేర్చాలన్నదే తన తపన అని… ఈ నేపథ్యంలో, నేతలంతా విభేదాలను మరిచి, తనతో పాటు కలసి పని చేయాలని సూచించారు. నేతల మధ్య సయోధ్య కుదిర్చి, ఒకరి మండలాల్లో మరొకరు కలగజేసుకోవద్దని చెప్పారు. ఇదే సమయంలో మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ పై కూడా టీడీపీ నేతలు బాలయ్యకు ఫిర్యాదు చేశారు. ఆయన వ్యవహారంతో అభివృద్ధి కుంటుంపడిందని వారు ఆరోపించారు. దీంతో హిందూపురం టీడీపీలో వ‌ర్గ‌పోరు మ‌రింత క్లిష్ట‌ప‌రిస్థితికి చేరింది. ఇదిలా ఉంటే బాలకృష్ణ నియోజకవర్గానికి చుట్టపుచూపుగా వచ్చిపోతుండడంతో ఇక్కడ ఇలాంటి ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయని అక్క‌డి స్థానిక నేత‌లు అంటున్నారు. ఎవ‌రికి వారు ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని క‌ష్ట‌ప‌డి పార్టీ కోసం ప‌నిచేసే వారికి గుర్తింపు ఇవ్వ‌డంలేద‌ని అక్క‌డి వారు ఆరోపిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తీ ఒక్క‌రు తామే లీడ‌ర్లుగా చ‌లామ‌ణీ అయిపోతున్నార‌ని ఇలాంటి పరిస్థితి మారాలంటూ ఒక‌రిపై ఒక‌రు ఆరోప‌ణ‌లు ప్ర‌త్యారోప‌ణ‌లు చేసుకునే స్థితికి చేరింది. ఇక గ‌తంలో పీఏ వ్య‌వ‌హారంపై కూడా అక్క‌డి నేత‌లు ఇలాగే చేశారు. అభివృద్ధి పనులు మొదలుకుని పార్టీ వ్యవహారాల దాకా అన్నింట్లోనూ జోక్యం చేసుకుంటున్నారు. ఈయన మితిమీరిన జోక్యాన్ని సొంత పార్టీ నాయకులే జీర్ణించుకోలేకపోతున్నారు. శేఖర్‌ను హిందూపురం నుంచి ఎలాగైనా సాగనంపాలన్న ఉద్దేశంతో నియోజకవర్గంలోని హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు మండలాల నేత‌లు అసంతృప్తి గ‌ళం వినిపించారు.ఇప్పుడు కూడా అలాగే జ‌ర‌గ‌డంతో ఆయ‌న అస‌హ‌నానికి లోన‌య్యారు. అంద‌రూ క‌లిసి ప‌నిచేయ‌లేక‌పోతే బ‌య‌ట‌కు వెళ్లాలంటూ ఘాటుగానే వ్యాఖ్యానించారు. దీంతో అక్క‌డ ఉన్న గంద‌ర‌గోళం కాస్తా స‌ద్దుమ‌నిగింది. అయితే బాల‌య్య సొంతంగా క‌ల్పించుకుంటే త‌ప్ప నియోజ‌క‌వ‌ర్గ స్థాయి నేత‌ల్లో మార్పు రాదని కొంత మంది తెలుగు త‌మ్ముళ్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. మ‌రి దీనిపై బాల‌య్య స్పందించి నేత‌ల మ‌ధ్య స‌యోధ్య‌ను కుదుర్చుతారా..? లేక ఈ వ్య‌వ‌హారం ఇలాగే కొన‌సాగుతుందా కాల‌మే నిర్ణ‌యించాలి…

Tags : , , , , , , , , , , , , , , , , , , , ,