CM అవ్వాలని బాలయ్య సంచలన కామెంట్స్! | WHAT! Balakrishna is Interested to Become CM?

admin
cm

TDP’s founder, former NTR’s successor, as NTR’s successor, is the dream of millions of TDP fans and Nandamuri fans to enter the films and politics of Nandamuri Balakrishna as Hindustur mla. click on the below video to know more details of WHAT! Balakrishna is Interested to Become CM?

టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు మాజీ cm దివంగత ఎన్టీఆర్ వార‌సుడిగా సినిమాలు, రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి హిందూపూర్ mlaగా గెలిచిన నంద‌మూరి బాల‌కృష్ణ సీఎం అవ్వాల‌ని కోట్లాది మంది టీడీపీ అభిమానులు, నంద‌మూరి అభిమానుల క‌ల‌.

నందమూరి బాలకృష్ణ సినిమాల్లో స్టార్ హీరోగా వెలుగు తున్నప్పటినుంచే ఆయ‌న‌కు సీఎం పదవికి లింకు పెట్టి చాలామందే కామెంట్లు చేసేవారు.
బాల‌య్య పబ్లిక్ లోకి వ‌స్తే చాలు ఆయ‌న అభిమానులు కాబోయే సీఎం బాల‌య్య అని జిందాబాద్‌లు కొడుతుంటారు. ఇక ఇప్ప‌టికే తాను సీఎం అయ్యే విష‌య‌మై బాల‌య్య చాలాసార్లు స్పందించారు. దేవుడు త‌న నుదిటిన ఏది రాసిపెట్టి ఉంటే అది అవుతుంద‌ని కూడా బాల‌య్య గ‌తంలోనే సీఎం పోస్టుపై ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు.
ఆయ‌న తాజాగా గురువారం త‌న నియోక‌వ‌ర్గం అయిన హిందూపురంలో ప‌ర్య‌టించారు.

ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ మ‌రోసారి సీఎం పోస్టుపై త‌న మ‌న‌స్సులో ఉన్న‌ది ఉన్న‌ట్టు కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశారు. తానేదో పెద్ద పదవులు ఆశించి రాజకీయాల్లోకి రాలేదని, సీఎం అవ్వాలని.. మంత్రి అవ్వాలని తనకు ఎలాంటి ఆశ లేదని బాలకృష్ణ చెప్పారు.
హిందూపురం నాన్న పోటీ చేసిన నియోజకవర్గమని, అందుకే ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఎమ్మెల్యే అయ్యానని ఆయన చెప్పుకొచ్చారు. నియోజకవర్గంలోని సమస్యలు కొన్ని తన దృష్టికి వచ్చాయని, ఎమ్మెల్యేగా వాటిని పరిష్కరించడమే తన పని అని బాలకృష్ణ తెలిపారు. నియోజకవర్గ సమస్యలను పరిష్కరిస్తూ… పార్టీకి అవసరమైన సేవలందించడమే తన ముందున్న కర్తవ్యమని బాల‌య్య చెప్పారు.

Tags : , , , , , , , , , , , , , , , ,