కోమ‌టిరెడ్డి – రేవంత్ ల మ‌ధ్య ఏం జ‌రిగింది? | What Happened Between Komatireddy and Revanth Reddy?

admin
komatireddy

The comments made by Komatireddy Venkat Reddy, who are ready to oppose the knees on KCR, have now become a hot topicAlready on the reverse criticism of the reverse, Venkat Reddy of the same social group looks like him. Click on the below video to know more details of What Happened Between Komatireddy and Revanth Reddy?

కేసీఆర్ పై క‌త్తులు దూసేందుకు విప‌క్షాలు సిద్ద‌మౌతున్న వేల కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
ఇప్ప‌టికే ఓ వైపు రేవంత్ విమ‌ర్శ‌ణ బాణాలు సందిస్తుంటే అదే సామాజిక వ‌ర్గానికి చెందిన వెంక‌ట్ రెడ్డి ఆయ‌న‌కు తోడైన‌ట్టుగా క‌నిపిస్తోంది. కేసీఆర్ పై పోరు చేసేందుకు విప‌క్షాలు ఉమ్మ‌డి అభ్య‌ర్థిని కూడా నిలిపే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఇదే స‌మ‌యంలో నేత‌ల కామెంట్లు కూడా దానికి ప్రాణం ఇచ్చే విధంగానే ఉన్నాయి. కోమటిరెడ్డి బ్ర‌ద‌ర్స్ కూడా కేసీఆర్ ను ఇర‌కాటంలో పెట్ట‌డానికి త‌మ సొంత జిల్లాలో క‌త్తులు దూసేందుకు సిద్ద‌మౌతున్నార‌ట..నల్గొండ ఎన్నిక కోసం తానుకూడా ఎదురుచూస్తున్నానని కాంగ్రెస్ సినీయర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. పోటీకి నేను సిద్ధం. ఏఐసీసీ అధిష్టానం నల్గొండ ఉప ఎన్నిక కి ఏవ్యక్తిని నిలబెట్టినా మేము మద్దతిస్తామని అన్నారు. మరోవైపు తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సైతం నల్గొండ ఎంపి సీటు పై పోటీ చేసేందుకు సిద్దం అని ప్రకటించాడు.దీంతో సీఎంను ఇర‌కాటంలో పెట్ట‌డ‌మే విప‌క్షాల ల‌క్ష్యంగా అర్థం అవుతుంది. అయితే ఇక్క‌డే మ‌నం గ‌మనించాల్సిన మ‌రో అంశం కూడా ఉంది. అదేంటంటే ఇంత‌కు ముందుకు వ‌రకు అయితే నేత‌లు తామే పోటీ చేస్తామ‌ని ప్ర‌క‌టించేవారు. లేదంటే అధిష్టానంతో తేల్చు్ఉంటామ‌ని స‌వాల్ చేసేవారు.

కానీ న‌ల్గొండ ఉప ఎన్నిక క‌నుక జ‌రిగితే నేత‌లు మ‌రోర‌కంగా స్పందించే అవ‌కాశం క‌నిపిస్తుంది. తామే పోటీ చేస్తాం.. అది కుద‌ర‌క‌పోతే ఎవ‌రు పోటీ చేసినా మ‌ద్ద‌తు అడిగితే కేసీఆర్ కు వ్య‌తిరేకంగా ఉండేందుకు ఖ‌చ్చితంగా మ‌ద్ద‌తును ఇస్తామ‌నే స్థాయికి వెళ్లిపోయారు. కేసీఆర్ పాల‌న‌పై ఇప్ప‌టి నుంచే వ్య‌తిరేక‌త తీసుకువ‌స్తే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి తాము బ‌ల‌ప‌డ‌వ‌చ్చ‌నే యోచ‌న‌లోనే అన్ని పార్టీలు ఉన్న‌ట్టుగా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇక ఈ విష‌యంలో రేవంత్, కోమటిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ఓ అవ‌గాహ‌ణ‌కు వ‌చ్చార‌నే వాద‌న‌లు కూడా బ‌లంగా వస్తున్నాయి. న‌ల్గొండ నుంచి రేవంత్ లాంటి వ్య‌క్తిని పోటీకి దింపి తాము కూడా మ‌ద్ద‌తు ఇస్తే ఖ‌చ్చితంగా విజ‌యం సాధించ‌వ‌చ్చ‌ని వారు న‌మ్ముతున్నార‌ట‌. ఇందుకోసం తాము బేష‌రతుగా మ‌ద్ద‌తు ఇస్తామ‌ని కూడా చెప్పార‌ట‌. ఎన్నిక జ‌ర‌గాలే కానీ అన్ని శ‌క్తులు ఒడ్డిమ‌రి తాము న‌ల్గొండ‌లో మ‌రోసారి త‌మ బ‌లాన్ని నిరూపించుకొని కేసీఆర్ ను గ‌ద్దెదించేందుకు పునాదులు వేస్తామ‌ని శ‌ప‌తం చేస్తున్నార‌ట‌. ఇక ఇదే జ‌రిగితే త‌మ‌కే పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ద‌క్కే అవ‌కాశం కూడా ఉంద‌ని అంటున్నారు. దీనికి తోడు కేసీఆర్ పై వ్య‌తిరేక‌త ఉంద‌ని నిరూపిస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో సునాయశంగా విజ‌యం సాధించగ‌ల‌మ‌ని న‌మ్ముతున్నార‌ట‌. దీంతో ఎవ‌రికి వారు కేసీఆర్ ను దెబ్బ‌కొట్టేందుకు సిద్ద‌మౌతున్నార‌ట‌. ఇక కేసీఆర్ అనుచ‌ర‌వ‌ర్గం నుంచి వ‌చ్చిన ఈ పుకారు కాస్తా విప‌క్షాల‌ను ఏక‌తాటిపైకి తీసుకువ‌స్తున్నాయా లేక చెక్ పెట్టే విధంగా త‌యారు అయిందా అనేది ఇప్పుడు రాజ‌కీయంగా చ‌ర్చ సాగుతోంది.. మ‌రి ఈ పొలిటిక‌ల్ వార్ లో ఎవ‌రు విజ‌యం సాధిస్తారు అనేది చూడాల్సి ఉంది..

Tags : , , , , , , , , , , , , , , ,