విశాఖ ల్యాండ్ స్కాం జ‌గ‌న్ ధ‌ర్నాతో ఏం జ‌ర‌గ‌నుంది?

ఏపీలో ప్ర‌ధాన ప‌ట్ట‌ణంగా ఉన్న విశాఖ‌ప‌ట్నం కేంద్రంలో భూ కుంభ‌కోణం ఏపీలో పెద్ద సంచ‌ల‌నం సృష్టిస్తున్న సంగ‌తి తెల్సిందే.


దీనిపై మిత్ర‌ప‌క్షం బీజేపీ నేత‌లు విష్ణ‌కుమార్ రాజుతో పాటు ఎమ్మెల్సీ సోము వీర్రాజు లాంటి వారు ప్ర‌భుత్వాన్నినిల‌దీస్తున్నారు. అలాగే కేబినెట్ మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు కూడా భూ కుంభ‌కోణం నిజ‌మేన‌న్నారు. జిల్లా క‌లెక్ట‌ర్ కూడా కొన్ని భూములు రికార్డులు క‌న్పించ‌టం లేద‌న్నారు. కొన్ని భూములు టెంప‌రింగ్ జ‌రిగాయ‌ని ఏపీ డీజీపీ సాంబ‌శివ‌రావు కూడా ప్ర‌క‌టించారు. దీనిపై ప్ర‌భుత్వం పోలీస్ ఉన్న‌తాధికారి నేతృత్వంలో క‌మిటీని నియ‌మించారు. దాకికి ప‌ర‌ధికి కూడా నిర్దేశించారు.

ఇక్క‌డే విప‌క్షాలు ప్ర‌భుత్వ వైఖ‌రిని తీవ్రంగా త‌ప్పుప‌డుతున్నాయి. అస‌లు మోసాలు జ‌రిగిన బీమిలి ప్రాంతాన్ని , ఇత‌ర కొన్ని ప్రాంతాల‌ను త‌ప్పించార‌ని ఆరోపిస్తున్నాయి. ఏ ప్ర‌భుత్వం అధికారంలో ఉంటే అక్క‌డ మంత్రి ప‌ద‌వి పొందిన వ్య‌క్తి అని ప‌రోక్షంగా ఈ భూముల కుంభ‌కోణంలో గంటా శ్రీ‌నివాస‌రావు పాత్ర ఉంద‌ని ఆయ‌న పేరు ప్ర‌స్తావించ‌క‌పోయినా బీజేపీ నేత సోము వీర్రాజు చంద్ర‌బాబుకు రాసిన లేఖ‌లో పేర్కొన్నారు. ప్ర‌భుత్వం నియ‌మించిన సిట్ పై త‌మ‌కు విశ్వాసం లేద‌ని బీజేపీ ప్ర‌క‌టించింది. విప‌క్షాల స‌రే స‌రి. చంద్ర‌బాబు సీబీఐ విచార‌ణ‌కు ఎందుకు భ‌య‌ప‌డుతున్నారంటూ నిల‌దీస్తున్నాయి.

అయితే ఈ భూకుంభ‌కోణాల‌కు వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న ఉద్య‌మాన్ని తీవ్ర‌త‌రం చేసేందుకు వైసీపీ కార్యాచ‌ర‌ణ రూపొందించింది. ఈ నెల 22న విశాఖ‌లో మ‌హాధ‌ర్నా ప్ర‌క‌టించింది. ఈ మ‌హాధ‌ర్నా జ‌రిగితే ఏం జ‌రుగుతుంది? అనే ప్ర‌శ్న రావ‌చ్చు? చ‌ంద్ర‌బాబు ప్ర‌భుత్వం విప‌క్షాల‌ను ఏనాడు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేదు. కాబ‌ట్టి ఈ ధ‌ర్నా వ‌ల్ల ఏమిటి? ఉప‌యోగం అనే కంక్లోజ‌న్ రావ‌చ్చు.

కానీ మ‌హా ధ‌ర్నా ద్వారా ప్ర‌జ‌ల‌కు ఏం చెప్పాల‌ని ప్ర‌తిప‌క్షం ప్లాన్ చేసిందో. అది విజ‌య‌వంతం అవుతుంది. దాని వ‌ల్ల ప్ర‌భుత్వానికి జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోతుంది. విప‌క్షానికి ఇంత‌కంటే గొప్ప విజ‌యాలు రావు. ప్ర‌భుత్వ త‌ప్పుల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లి వారిని ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా చైత‌న్య‌వంతం చేస్తే ప్ర‌తిప‌క్షం విజ‌య‌వంతంగా త‌న పాత్రం పోషిస్తున్న‌ట్లే?

ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ధ‌ర్నాలో పాల్గొంటే మీడియా ఎంత ప్రాధాన్య‌త ఇస్తోందో తెల్సిందే. దీని ద్వారా సిట్ ప‌రిధి లోని డొల్ల త‌నం బ‌య‌ట ప‌డుతుంది. చంద్ర‌బాబు ఎందుకు గుప్పెట్లో పెట్టుకోవాల‌ని భావిస్తున్నారో ప్ర‌జ‌ల‌కు తెలిస్తే చాలు కదా? చంద్ర‌బాబు సీబీఐ విచార‌ణ‌కు ఎందుకు భ‌య‌ప‌డుతున్నారో స్ప‌ష్టం అవుతుంది. త‌ప్పులు చేసిన వారికి శిక్ష‌లు ప‌డ‌తాయా లేదా కోర్టుల్లో ఈ కేసులు ఎప్ప‌టి తేల‌తాయో ఎవ‌రూ అంత సులువుగా చెప్ప‌లేరు. కానీ ప్ర‌జ‌ల్లో జ‌రుగుతున్న ప్ర‌చారానికి ప్ర‌భుత్వం స‌మాధానం చెప్ప‌క‌పోతే ప్ర‌చారాన్ని న‌మ్ముతారు.

Add your comment

Your email address will not be published.