ఆ చీరల నిజమైన క్వాలిటీ ఎంత? | What is the Actual Price & Quality Telangana Bathukamma Sarees?

admin
sarees

If you go out, it will be a bad time to get back to you. Click on the below video to know more details of What is the Actual Price & Quality Telangana Bathukamma Sarees?

మంచి చేద్దాం అని బయలుదేరితే చెడు ఎదురు అవ్వడం ఒక్కొక్కసారి మనల్ని చిక్కుల్లో పడేస్తూ ఉంటుంది.

తాజాగా తెలంగాణా లో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటె పరిస్థితి అలాగే ఉంది కదా అనిపిస్తుంది. తిరుగులేని ఇమేజ్ తో తెలంగాణా లో రాజ్యం ఏలుతున్న తెరాస సర్కారు కి ఈ చీర వ్యవహారం చిరాకు పుట్టించింది. చిరాకు కాదు జుగుప్సా కరంగా ఎందుకు ఈ ప్రోగ్రాం పెట్ట్టుకున్నాం రా బాబూ అనిపించేలా చేసింది. మతాలకీ, కులాలకీ అతీతంగా బతుకమ్మ సందర్భంగా చీరలు ఇవ్వాలి అని అనుకున్న తెరాస సర్కారు ఆ విషయం మీద ఘనమైన ప్రకటనలు చేసింది కూడా. అయితే చీరలు మహిళల చేతికి వచ్చే వరకూ ఆహా ఒహో అంటూ కబుర్లు చెప్పడం తో వారు బోలెడు ఆశలు పెట్టేసుకున్నారు. ఇష్టమైన హీరో సినిమా కి హైప్ పెట్టుకుని సినిమా దరిద్రంగా ఉన్నప్పుడు ఫాన్ రియాక్ట్ ఐనట్టు రియాక్ట్ అయ్యారు వాళ్ళందరూ. దీంతో రివర్స్ గేర్ పడింది . మాకు ఇంత చౌకబారు చీరలు ఇస్తారా అంటూ వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చీరల్ని గుట్టలుగా పోగేసి తగలబెట్టి తమ నిరసన తెలియజేసారు లేడీస్ అందరూ.

ఊహించని రీతి లో చోటు చేసుకున్న ఈ పరిణామాల మీద రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్.. చేనేత – జౌళి కమిషనర్ శైలజా రామయ్యర్ లు రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వం ఇస్తున్న చీరలు నాణ్యమైనవేనని చెబుతూ.. 1.04 లబ్థిదారులకు అవసరమైన చీరలు సిరిసిల్లలో లేని నేపథ్యంలో సూరత్ నుంచి తెప్పించామన్నారు. చేనేత మీద ఇలాంటి చీరలు చెయ్యాలి అంటే మూడు సంవత్సరాల టైం పడుతుంది అని ఒప్పుకున్నారు. కానీ లాజిక్ ఏంటో మిస్ అయింది , ఎందుకంటే మూడేళ్ళు పడుతుంది అని చెబుతూనే వచ్చే ఏడాది తెలంగణా లోనే తయారు చేయిస్తాం అని చెప్పడం. 3.7 కోట్ల మీటర్ల వస్త్రంతో 58 లక్షల చీరల్ని సిరిసిల్ల మగ్గాల నుంచి సేకరించామని.. 2.3 కోట్ల మీటర్ల వస్త్రంతో తయారు చేసిన చీరలను సూరత్ నుంచి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.చీరాల నాణ్యత మాత్రం రెండు చోట్లా రెండొందల రూపాయల పైనే నాణ్యత ఉంటుంది అన్నారు ఆయన కానీ మరొక పక్క మహిళలు మాత్రం డబ్భై రూపాయల చీరలు తమ మొఖాన కొట్టారు అంటూ సర్కారు మీద యమా సీరియస్ గా ఉన్నారు. నాలుగు దశల్లో నాణ్యతను పరిశీలించి చీరలు కొనుగోలు చేసినట్లు చెబుతున్నా.. ఆ స్థాయిలో చీరలు లేవన్న మాట బలంగా వినిపిస్తోంది.
ఇంత పెద్ద మొత్తంలో సూరత్ నుంచి కొనుగోలు చేసే కన్నా.. ముందే ప్రభుత్వం తమకు పని అప్పగించి ఉంటే పెద్ద ఎత్తున ఉపాధి లభించి ఉండేదన్న మాట చేనేత కార్మికులు చెబుతున్నారు.

Tags : , , , , , , , , , , , , , , , , , ,