‘న‌న్ను మాట్లాడ‌నిస్తారో లేదో చూడాలి’

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ప్ర‌భుత్వంపై మ‌రోసారి విమ‌ర్శ‌లు ఎక్కిపెట్టారు. దేశంలో నెల‌కున్న ప‌రిస్థితుల‌పై తాను మాట్లాడాని స‌భ‌ల‌కు వ‌చ్చానన్నారు.

పెద్ద నోట్ల ర‌ద్దుతో దేశంలో ఆర్ధిక అత్య‌వ‌స‌ర ప‌రిస్తితి కొన‌సాగుతుంది. గ‌త 36 రోజులుగా ప్ర‌జ‌లు న‌గ‌దు కోసం, రూ, 2000 నోటు చిల్ల‌ర కోసం నానా అగ‌చాట్లు ప‌డుతున్నారు. రోజులు గ‌డిచే కొద్దీ స‌మ‌స్య తీవ్ర‌త త‌గ్గుతుంద‌ని భావిస్తున్న ప్ర‌జ‌ల‌కు నిరాశ ఎదుర‌వుతుంది. రోజు, రోజుకు స‌మ‌స్య తీవ్ర‌త పెరుగుతుంది. శ‌ని,ఆది,సోమ‌వారాలు సెల‌వుతో ఇబ్బందులుప‌డ్డ ప్ర‌జ‌లు మంగ‌ళ‌వారం తెల్ల‌వారిఝాము నుంచే క్యూలు క‌ట్టారు. అయినా నో క్యాష్ బోర్టులు, బ్యాంకులే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.

ఈనేప‌థ్యంలో బుధ‌వారం నాటి పార్ల‌మెంట్ స‌మావేశాల‌కు కాంగ్రెస్‌, బీజేపీలు ఎంపీల‌కు విప్ జారీ చేశాయి. ప్ర‌తిప‌క్ష కాంగ్ర‌సె్ నోట్ల ర‌ద్దుపై బీజేపీని పార్ల‌మెంట్‌లోప‌ల‌, బ‌య‌ట తీవ్రంగా దుయ్య‌బ‌డుతుంది. బుధ‌వారం పార్ల‌మెంట్ సమావేశానికి హాజ‌రైన సంద‌ర్భంగా రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. గ‌తంలో నేను మాట్లాడితే మోదీ కాళ్ల కింద భూకంపం వ‌స్తుంద‌ని వ్యాఖ్య‌నించిన రాహుల్‌, త‌న‌ను పార్ల‌మెంట్‌లో బీజేపీ అధికార పార్టీ స‌భ్య‌లు మాట్లాడ‌నిస్తారో లేదో అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు.

Add your comment

Your email address will not be published.