APలో YCPకి అదిరిపోయే రెస్పాన్స్ ! | What? YSRCP Back in FORM in AP now? | AP News

admin
AP

Jaganmohan Reddy reviewed how YSR’s family started to strengthen YSRCP on the field level. As soon as Jagan left for London tour, the show made an effort to learn how the campaign was going on. The party sources said that the YSR’s family had begun 11 days and now it has reached 38 lakh viz. Click on the below video to know more details of What? YSRCP Back in FORM in AP now?

వైఎస్సార్సీపీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ప్రారంభించిన వైఎస్సార్‌ కుటుంబం ఎలా సాగుతుందో తెలుసుకునేందుకు జగన్మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభమైన వెంటనే జగన్‌ లండన్‌ పర్యటనకు వెళ్లడంతో ఇంటింటికి ప్రచార కార్యక్రమాలు ఎలా సాగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేశారు. వైఎస్సార్ కుటుంబం కార్యక్రమం ప్రారంభమై 11 రోజులు పూర్తై ఇప్పటికి 38 లక్షల మంది వైస్సార్ కుటుంబంలో చేరినట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. రాష్ట్ర స్థాయిలో పార్టీ సీనియర్లు మరియు ముఖ్య నేతలతో వై ఎస్ జగన్ నిర్వహించిన సమీక్షలో ఇప్పటి వరకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన ఫిర్యాదులు పై సమీక్ష. జరిపారు. భవిష్యత్ కార్యాచరణపై పార్టీ సీనియర్లు మరియు ముఖ్య నేతలకు వై ఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు కల్పించాలనే భావనతో వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమం ప్రారంభమైంది. సెప్టెంబర్ 11న వైఎస్సార్ కుటుంబం ప్రారంభమైందని, ఇప్పటికి 38 లక్షల మంది వైస్సార్ కుటుంబంలో చేరడం శుభపరిణామం అన్నారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు 4.3 లక్షల వైఎస్ఆర్ సీపీ పార్టీ బూత్ కమిటీ సభ్యులకు శిక్షణ కార్యక్రమం సెప్టెంబర్ 2 వ తారీఖున ప్రారంభమైంది. ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ, పెన్షన్ లతో పేదవాడు లబ్ది పొందిన రాజన్న రాజ్యాన్ని గుర్తు చేస్తున్నారని వివరించారు. పార్టీ ప్లీనరీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్న పథకాల గురించి వివరిస్తున్నారు . ఇంటి నుంచి ఒక్కరైనా వైఎస్ఆర్ కుటుంబంలో భాగం అయ్యేలా చేస్తున్నారు. ఇందు కోసం ఆధునిక టెక్నాలజీని కూడా వినియోగిస్తున్నారు. దీంతో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాలన పై అభిప్రాయాన్ని తెలుసుకుంటున్నారు .రాష్ట్ర ప్రభుత్వ పాలనకు ఒకవేళ మార్కులు వేయాల్సి వస్తే ఎన్ని వేస్తారో వేయాలని అడుగుతున్నారు.

వైఎస్ఆర్ కుటుంబం లో భాగంగా ఇంటింటికి వెళ్లే కార్యకర్తలకు ఒక కిట్ ను అందచేస్తారు. ఈ పబ్లిసిటీ కిట్ లో వైఎస్ఆర్ కుటుంబం కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలు, గైడ్, విజిటింగ్ కార్డు, బాబు పాలనపై మార్కులు వేసే పత్రం, వైఎస్ఆర్ బ్యాడ్జి, వైఎస్ఆర్ కుటుంబం లో చేరిన తర్వాత వారి ఇంటికి వైఎస్ఆర్ కుటుంబం అని అంటించే స్టిక్కర్ ఉంటాయి. సెప్టెంబర్ 11 తేదీ నుంచి అక్టోబర్‌ 2వ తేదీవరకు 20 రోజులపాటు వైఎస్‌ఆర్‌ కుటుంబం కార్యక్రమం కొనసాగనుంది. పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని జగన్‌ సూచించారు.

Tags : , , , , , , , , , , , , , , , , , , , , , , , ,