క‌ర్నూలులో శిల్పా తో త‌ల‌ప‌డుతున్న‌ TDP నేత ఎవ‌రు? | Who is Going to COMPETE With Shilpa in Kurnool?

admin
kurnool

Before the heat and even cooler created by the most prestigious elections, the sub-election will be ready for another by-election in Kurnool district.click on the below video to know more details of Who is Going to COMPETE With Shilpa in Kurnool?

అంత్యంత ప్ర‌తిష్టాత్మంగా జ‌రిగిన నంద్యాల ఉప ఎన్నిక‌లు సృష్టించిన వేడి ఇంకా చ‌ల్ల‌రాక ముందే క‌ర్నూలు జిల్లాలో మ‌రో ఉప ఎన్నిక‌కు రంగం సిద్దం అవుతుంది.

పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయ‌టం వ‌ల్ల జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌ల కాదు. విలువ‌కు క‌ట్టుబ‌డి పార్టీ మారితే ఆ పార్టీలో తాను పొందిన ప‌ద‌వికీ రాజీనామా చేయాల‌నే నిబంధ‌న‌ల‌కు క‌ట్టుబ‌డి, పార్టీ అధినేత వైస్ జ‌గ‌న్ ఆదేశాల‌ను తూ,చా త‌ప్ప‌కుండా పాటించిన శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి టీడీపీకి, ఆ పార్టీ ద్వారా పొందిన ఎమ్మెల్సి ప‌ద‌వికి రాజీనామా చేసిన కార‌ణంగా రాబోతున్న ఉప ఎన్నిక‌లు ఇవి. ఆగ‌స్టు 14వ తేదీన ఆయ‌న శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి రాజీనామాను ఆమోదించారు. కాబ‌ట్టి ఆగ‌స్టు 14వ తేదీ నుంచి 6 నెల‌లు లోగా ఎన్నిక‌లు నిర్వ‌హించాలి.

ఆయ‌న స్దానిక ప్ర‌జాప్ర‌తినిధుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన విష‌యం తెల్సిందే. అయితే ఈ ఎమ్మెల్సీ ప‌ద‌వి కోసం అప్పుడే టీడీపీలో క‌ల‌క‌లం మొద‌లైంది. దీనికి ప్ర‌ధాన కార‌ణంగా చంద్ర‌బాబు నాయుడు త‌న అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని ఆయా సంద‌ర్భాన్ని బ‌ట్టి అనేక మందికి హామీ ఇవ్వ‌ట‌మే ప్ర‌ధాన కార‌ణం. దీంతో ఎమ్మెల్సీ టిక్కెట్ త‌న‌కు కావాలంటే, త‌న‌కు కావాల‌నే వారి సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింది. చంద్ర‌బాబు నాయుడు ఎంత మందికి టిక్కెట్ ఇస్తామ‌ని హామీ ఇచ్చారు? ఎవ‌రికి టిక్కెట్ ఇచ్చే అవ‌కాశం ఉంది? ప‌్ర‌స్తుత ప‌రిస్థితిలో ఎవ‌రు స‌రైన అభ్య‌ర్ది అవుతార‌నే విష‌యాన్ని చ‌ర్చించుకుందాం.

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు హామీలు విచిత్రంగా ఉంటాయి. ఆయ‌న ఎదుట వ్య‌క్తి అవ‌స‌రం ఉంద‌ని భావిస్తే ఆ సంద‌ర్భంలో ఆయ‌న‌కు ఏదో ఓ హామీ ఇచ్చి ఆయ‌న్ని సంతృప్తి ప‌ర్చ‌టం ఓ ఎత్తుగ‌డ‌గా అమ‌లు చేస్తుంటారు. ఇది ప్ర‌తిప‌క్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ఆయ‌న ఇదే స్టైల్ అమ‌లు చేస్తుంటారు. ఆ విధంగా ఇప్ప‌టికే చంద్ర‌బాబు నాయుడు హామీలిచ్చిన వారి సంఖ్య త‌క్కువ‌గా ఏమీ లేదు. కర్నూలు, క‌డ‌ప స్ధానిక సంస్ధ‌ల నియోజ‌క‌వ‌ర్గానికి శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డి రాజీనామా చేయ‌టంతో ఖాళీ ఏర్ప‌డి నాటి నుంచి ఈ సీటు కోసం గ‌తంలో హామీలు పొందిన నేత‌లు రంగంలోకి దిగుతున్నారు. చంద్ర‌బాబు నుంచి హామీలు పొందిన వారిలో ఎస్పీవై రెడ్డి అల్లుడు సంజ‌ల శ్రీ‌ధ‌ర్‌, ఏపీ ఉప ముఖ్య‌మంత్రి కేఇ కృష్ట‌మూర్తి సోద‌రుడు కేఈ ప్ర‌భాక‌ర్‌, మాజీ మంత్రి ఏరాసు ప్ర‌తాప్ రెడ్డి, బూమా నాగిరెడ్డి కుడి భుజంగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి, వీరంద‌రికి చంద్ర‌బాబు నాయుడు హామీలిచ్చి ఉన్నాడు. ఈ ఉప ఎన్నిక‌ల్లో వారితో ఉత్స‌హంగా ప‌ని చేయించ‌టానికి చంద్ర‌బాబు నాయుడు కేఈ ప్ర‌భాక‌ర్, ఏపీ సుబ్బారెడ్డి, శ్రీ‌ధ‌ర్, ఏరాసు ప్ర‌తాప్ రెడ్డిల‌కు హామీ ఇచ్చారు. ఇప్పుడు వీరి త‌మ‌కు ఈ సీటు కావాలంటే త‌మ‌కు కావాల‌ని ప‌ట్టుప‌డుతున్నారు. అయితే ఎస్పీవై రెడ్డి అనారోగ్యంతో క‌ద‌ల‌లేన ప‌రిస్థితిలో ఉన్నారు కాబ‌ట్టి ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు టిక్కెట్ ఇస్తే బాగుంటుంద‌ని వాద‌న బ‌లంగా విన్పిస్తోంది. అంతే కాకుండా ఆ కుటుంబం ప్ర‌స్తుతం బిజినెస్ ప‌రంగా తేరుకుని ఆర్ధికంగా నిల‌దొక్కుకుందంటున్నారు. శ్రీ‌ధ‌ర్‌కు టిక్కెట్ ఇస్తే టీడీపీపై కూడా ఆర్ధికంగా పెద్ద భారం ప‌డ‌ద‌ని అంచ‌న వేస్తున్నారు. అయితే కేఇ ప్ర‌భాక‌ర్ నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో మోరాయింస్తే చంద్ర‌బాబు నాయుడు ఇదే హామీ ఇచ్చారంటున్నారు. ఆయ‌న‌కే కాదు ఏవీ సుబ్బారెడ్డి కూడా అలాగే చేశారు. ఇప్పుడు చంద్ర‌బాబు నాయుడు వీరిలో ఎవ‌రికి టిక్కెట్ ఇస్తారు. ఎవ‌రికి హ్యండీచ్చార‌నే చ‌ర్చ కూడా సాగుతుంది. ఉంది. ఒక టిక్కెట్ అయితే చంద్ర‌బాబు హామీ ఇచ్చింది మాత్రం 4 గురికి, వీరంద‌ర‌కి టిక్కెట్ ఇవ్వ‌టం సాధ్యం. ఒక్క‌రికి టిక్కెట్ ఇవ్వ‌గ‌ల‌రు. కానీ హ్యండిచ్చేంది మాత్రం ముగ్గురికి. వీరిలో టిక్కెట్ పొందేదెవ‌రనే త్వ‌ర‌లోనే తేలిపోనుంది.

అయితే వైసీపీ మాత్రం శిల్పా చక్ర‌పాణి రెడ్డికే అవ‌కాశం ఇచ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. పోయిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో శిల్పా చ‌క్ర‌పాణి రెడ్డిపై వైఎస్ వివేకానంద‌రెడ్డి పోటీ చేసి ఓడిపోయిన సంగ‌తి తెల్సిందే. కానీ ఇప్పుడు శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి రాజీనామా చేసి వైసీపీకి వ‌చ్చినందుకు ఆయ‌న‌కే సీటు ఇవ్వొచ్చంటున్నారు. అదే జ‌రిగితే మ‌రో సారి శిల్పా కుటుంబ‌తో టీడీపీ త‌ల‌ప‌డిన‌ట్లే అవుతుంది.

Tags : , , , , , , , , , , , , , , , , ,