తెలంగాణా వచ్చినా మమ్మల్ని తొక్కుతూనే ఉన్నారు! | Why are Telangana POLICE Ending their Lives?

admin
telangana

In the Telangana region, the suicides of the suicide have become anxious. It is to be seen politically and socially as well. Click on the below video to know more details of Why are Telangana POLICE Ending their Lives?

తెలంగాణా ప్రాంతంలో వరసగా జరుగుతున్న ఆత్మహత్యలు ఆందోళనకరంగా మారాయి.

రాజకీయ పరంగా అలాగే సామాజిక పరంగా కూడా ఈ వ్యవహారాలు చూడాల్సి ఉంది. ఇదివరకు ఎన్నడూ లేనట్టు ఇప్పుడు ఈ ప్రాంతం లో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఒకప్పుడు ఇవే ఆత్మహత్యలు ఉద్యమ కాలం లో జరిగితే రాష్ట్రం కోసం త్యాగం చేసాడు అనేవారు. కొన్ని నిజంగా తెలంగాణా కోసం జరిగినా, మరి కొన్ని అలా చిత్రీకరించారు అంటూ అపవాదులు వచ్చాయి.ఆ విధంగా చిత్రీకరించినా కూడా ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం ఇంకా రాలేదు అనేవారు ఉన్నారు. ఆ విషయం పక్కన పెడితే ఈ మధ్య కాలం లో చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడం , ప్రయత్నాలు వరకూ వెళ్ళడం లాంటివి భయాందోళన కి గురి చేస్తున్నాయి. స్వయంగా పోలీసు అధికారులే వీరిలో ఎక్కువగా ఉన్నారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు సీఐ జీపు డ్రైవరు , హోం గార్డు అయిన శివ రాష్ట్రం వచ్చినా కూడా అంతగానే తమవారిని తననీ తొక్కేస్తున్నారు అంటూ లేఖ రాసి పెట్టి చనిపోయాడు. వికారాబాద్‌ జిల్లా మోత్కుపల్లిలో అప్పుల బాధ భరించలేక రైతు దంపతులు ఆత్మహత్యకు పాల్పడగా భార్య మరణించి భర్త కొనప్రాణంతో మిగిలారు.

పూర్వపు కరీం నగర్‌ జిల్లాలో గూడెం అనే గ్రామంలో దళితులకు భూ పంపిణీలో పాలకపక్ష ముఠాతగాదాల వల్ల తమకు అన్యాయం జరిగిందని ఇద్దరు దళితయువకులు ఎంఎల్‌ఎ రసమయి బాలకిషన్‌ కార్యాలయం దగ్గర ఆత్మహత్యకు ప్రయత్నించి ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. తాండూరు లో తెరాస కార్యకర్త ఒకరు పదవులు రాలేదు అంటూ నాయకుల దగ్గరే ఆత్మహత్య కి ప్రయత్నం చేసాడు. సిఎం నివాసం ప్రగతి భవన్‌ ముందు కూడా ఆత్మహత్యకు ప్రయత్నించిన ఉదంతాలున్నాయి. పైగా వీరంతా వివిధ తరగతులకు చెందిన వారు. సమస్యల తీవ్రతకూ సంకేతంగా ఈ సంఘటనలను చూసి పరిష్కార చర్యలు తీసుకోవాలే తప్ప రాజకీయ కుట్రల పేరిట లేక వ్యక్తిగత సమస్యల పేరిట నిర్లక్ష్యం చేస్తే ఇవి ఇంకా పెరిగే ప్రమాదం వుంది. రాష్ట్రం వచ్చినా కూడా తమకి సరైన న్యాయం జరగడం లేదు అనీ తెలంగాణా వారిని ఇంకా తొక్కేసే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి అనే ధోరణి చాలా మంది తెలంగాణా వారిలో కనిపిస్త్తోంది. ఆ ఫీలింగ్ పోగొట్టడం కోసం కెసిఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Tags : , , , , , , , , , , , , , , , ,